రాశుల ఆధారంగా చాలా విషయాలను చెప్పవచ్చు. అలాగే నక్షత్రాలను బట్టి కూడా చాలా విషయాలను చెప్పవచ్చు. ఈ నక్షత్రాల్లో పుట్టిన అబ్బాయిలు మంచి తండ్రులు అవుతారు. ప్రతి ఒక్క తండ్రి కూడా మంచి తండ్రి అవ్వాలని అనుకుంటారు. కానీ అది అందరికీ సాధ్యం కాదు. ఎంత చేసినా కూడా కొంత మంది ఏదో ఒక కారణం వలన తక్కువ ప్రేమ చూపించడం, కూతుర్లను మెచ్చుకోకపోవడం, వారి కష్టాన్ని గుర్తించకపోవడం వంటివి చేస్తూ ఉంటారు.

పిల్లలపై ప్రతి తల్లిదండ్రులకీ కూడా ప్రేమ ఉంటుంది. అయితే ఈ నక్షత్రాల్లో పుట్టిన అబ్బాయిలు మాత్రం పిల్లలనే ప్రపంచంగా భావిస్తారు. వారికి ఎలాంటి కష్టం వచ్చినా తట్టుకోలేరు. ఈ నక్షత్రాల్లో పుట్టిన అబ్బాయిలు పిల్లలపై అమితమైన ప్రేమను చూపిస్తారు, ఎక్కువ శ్రద్ధ పెడతారు. మరి ఆ నక్షత్రాల్లో మీరు ఒకరేమో చూసుకోండి.
ఈ నక్షత్రాలలో పుట్టిన అబ్బాయిలు పిల్లలకు మంచి తండ్రులు అవుతారు, అమితంగా ప్రేమిస్తారు
పునర్వసు నక్షత్రం
పునర్వసు నక్షత్రంలో పుట్టిన అబ్బాయిలు మంచి తండ్రులుగా పేరు తెచ్చుకుంటారు. కుటుంబమే వీరికి మొదటి స్థానం. అందుకని కుటుంబానికి ఎప్పుడూ తోడుగా ఉంటారు. కుటుంబానికి ఏ కష్టం వచ్చినా సహించలేరు. పిల్లల గురించి ఎక్కువ ఆలోచిస్తారు. వాళ్ల సంతోషం కోసం దేనినైనా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటారు. పిల్లల భవిష్యత్తు గురించి కూడా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. వారి విద్య, వారికి మంచి అలవాట్లు కలగడానికి ట్రై చేస్తూ ఉంటారు.
మృగశిర నక్షత్రం
మృగశిర నక్షత్రంలో పుట్టిన అబ్బాయిలు మంచి మనసును కలిగి ఉంటారు. ఈ నక్షత్రంలో పుట్టిన అబ్బాయిలు వారి కన్నా బిడ్డలపై ఎక్కువ ప్రేమను చూపిస్తారు. పిల్లలకు ఎప్పుడూ మంచి విలువలను నేర్పుతారు. తప్పు చేసినా కూడా కోపం రాదు. ఎల్లప్పుడూ పిల్లల్ని అర్థం చేసుకుంటారు. వారు ఏం కావాలనుకుంటున్నారు అనేది చెప్పకపోయినా ఈ తండ్రులకు అర్థమైపోతుంది. పిల్లలకు మంచి స్నేహితులుగా ఉంటారు.
హస్త నక్షత్రం
హస్త నక్షత్రంలో పుట్టిన అబ్బాయిలు ఎంతో క్రమశిక్షణతో ఉంటారు. వీరి మనసు కూడా చాలా గొప్పది. పిల్లలతో స్నేహితులుగా ఉంటారు. ఎప్పుడూ వారితో ఆటలు ఆడుతూ కలిసిపోతూ ఉంటారు. పిల్లల సృజనాత్మకతను పెంచడానికి ముందుంటారు. వారు అందుకున్న చిన్న విజయాలైనా పెద్దగా సెలబ్రేట్ చేయడానికి ఇష్టపడతారు. పిల్లలు తప్పు చేసినా కూడా ఓర్పుతో క్షమిస్తారు. మరీ పెద్ద తప్పు చేస్తే మాత్రం కాస్త దండించిన తర్వాత మళ్లీ పిల్లల మనసును మార్చి సంతోషంగా ఉంచుతారు.
రేవతి నక్షత్రం
{{/usCountry}}హస్త నక్షత్రంలో పుట్టిన అబ్బాయిలు ఎంతో క్రమశిక్షణతో ఉంటారు. వీరి మనసు కూడా చాలా గొప్పది. పిల్లలతో స్నేహితులుగా ఉంటారు. ఎప్పుడూ వారితో ఆటలు ఆడుతూ కలిసిపోతూ ఉంటారు. పిల్లల సృజనాత్మకతను పెంచడానికి ముందుంటారు. వారు అందుకున్న చిన్న విజయాలైనా పెద్దగా సెలబ్రేట్ చేయడానికి ఇష్టపడతారు. పిల్లలు తప్పు చేసినా కూడా ఓర్పుతో క్షమిస్తారు. మరీ పెద్ద తప్పు చేస్తే మాత్రం కాస్త దండించిన తర్వాత మళ్లీ పిల్లల మనసును మార్చి సంతోషంగా ఉంచుతారు.
రేవతి నక్షత్రం
{{/usCountry}}రేవతి నక్షత్రంలో పుట్టిన అబ్బాయిలకు ఎంతో ఓర్పు ఉంటుంది. ఎప్పుడూ పిల్లలకు ఎక్కువ కేర్ చూపిస్తారు. వారు పిల్లల కలలను సొంత కలలుగా భావిస్తారు. వాటిని నెరవేర్చడానికి చూస్తారు. పిల్లలు మంచిగా, నిజాయితీగా ఉండడానికి హెల్ప్ చేస్తారు. పిల్లలు ఉన్నత స్థాయికి చేరుకోవడానికి నిరంతరం కృషి చేస్తూనే ఉంటారు.