Vastu: పొరపాటున కూడా ఈ దిశలో డబ్బులు పెట్టకండి, ఎంతో నష్టం వస్తుంది!
కొంతమంది బీరువాలను వాస్తు ప్రకారం పెడుతుంటారు, కానీ కొంత మంది కుదరక మరో చోట బీరువాలో డబ్బులు వంటి వాటిని పెడుతూ ఉంటారు. అయితే నిజానికి వాస్తు ప్రకారం డబ్బుని ఉంచడం వలన సకల సంతోషాలు కలుగుతాయి, ఆర్థిక ఇబ్బందులు ఉండవు, ఆర్థిక స్థిరత్వం ఉంటుంది, సుఖసంతోషాలు, సిరిసంపదలు కలుగుతాయి.
చాలామంది వాస్తు ప్రకారం పాటిస్తారు. వాస్తు ప్రకారం పాటించడం వలన ప్రతికూల శక్తి తొలగిపోయి, సానుకూల శక్తి వ్యాపిస్తుంది. అయితే చాలా మంది తెలియక చేసే కొన్ని పొరపాట్ల వలన ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. కానీ వాస్తు ప్రకారం పాటించడం వలన వాస్తు దోషాలు లేకుండా సంతోషంగా ఉండొచ్చు. ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో బీరువాలు చివరగా పెడుతూ ఉంటారు.

కొంతమంది బీరువాలను వాస్తు ప్రకారం పెడుతుంటారు, కానీ కొంత మంది కుదరక మరో చోట బీరువాలో డబ్బులు వంటి వాటిని పెడుతూ ఉంటారు. అయితే నిజానికి వాస్తు ప్రకారం డబ్బుని ఉంచడం వలన సకల సంతోషాలు కలుగుతాయి, ఆర్థిక ఇబ్బందులు ఉండవు, ఆర్థిక స్థిరత్వం ఉంటుంది, సుఖసంతోషాలు, సిరిసంపదలు కలుగుతాయి. అయితే మరి ఎలాంటి తప్పులు చేయకూడదు. డబ్బుని ఏ దిశలో ఉంచితే ఇబ్బందులు కలుగుతాయి వంటి ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.
ఇంట్లో డబ్బులు పెట్టేటప్పుడు ఈ పొరపాట్లు చేయకండి:
ఉత్తర దిశలో ఉంటే శుభఫలితాలను పొందవచ్చు
బీరువా లేదా లాకర్‌ని ఉత్తరం వైపు పెట్టండి. ఈ దిశలో ఉండడం వలన సకల సంతోషాలు కలుగుతాయి, ఆర్థిక ఇబ్బందులు ఉండవు, ధన ప్రవాహం ఇంట్లో ఉంటుంది. ఇది కుబేరుడి దిశ. ఈ దిశలో డబ్బులు పెడితే డబ్బుకి లోటు ఉండదు.
పడమర, దక్షిణం:
బీరువాను పడమర లేదా దక్షిణం వైపు పెట్టకూడదు. ఇలా ఉన్నట్లయితే సమస్యలు వస్తాయి. లాకర్ తెరవగానే ఉత్తరం లేదా తూర్పు వైపుకి తెరుచుకోవడం మంచిది. దీని వలన ధనాన్ని బయటకు పంపుతున్నట్లు ఉండదు.
తూర్పు వైపు పెట్టొచ్చు:
బీరువా లేదా లాకర్‌ని తూర్పు వైపు పెడితే మంచిది. ఈ దిశలో బీరువా ఉంటే పడమర వైపుకి తలుపులు తెరుచుకుంటాయి. దీంతో సంపదని ఆకర్షించవచ్చు.
డబ్బు నిలకడగా ఉండాలంటే ఇలా చేయండి:
- బీరువాలో ఎప్పుడూ కూడా ఎంతోకొంత డబ్బు ఉండేటట్లు చూసుకోండి. అలా చేస్తేనే డబ్బు నిలకడగా ఉంటుంది.
- బీరువాలో పెట్టే వస్తువులను క్రమబద్ధంగా పెట్టుకోవాలి. అలా చేస్తే సానుకూల శక్తి వ్యాపిస్తుంది.
- బీరువా లేదా లాకర్‌ని ఇంట్లో పెట్టేటప్పుడు లక్ష్మీదేవి ఫోటో లేదా విగ్రహాన్ని పెట్టండి. కుబేర యంత్రం, శ్రీయంత్రం పెడితే కూడా మంచిదే.
- బీరువాలో చెత్తచెదారం, పాత బిల్లులు, పనికిరాని సామాన్లు పెట్టొద్దు. ఇవి ప్రతికూల శక్తిని ఆకర్షించి సానుకూల శక్తిని తొలగిస్తాయి.
- బీరువా కొనుగోలు చేసేటప్పుడు బ్రౌన్ కలర్, క్రీమ్ కలర్, పసుపు రంగు బీరువాలు కొనుగోలు చేస్తే మంచిది.
- బాత్రూం లేదా టాయిలెట్ గోడకు ఆనుకుని బీరువాను పెట్టకూడదు.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


