ఈ నక్షత్రాల్లో పుట్టిన అబ్బాయిలకు ఓర్పు ఎక్కువ, గొప్ప తండ్రులు అవుతారు!

నక్షత్రాలను బట్టి కూడా చాలా విషయాలను చెప్పవచ్చు. ఈ నక్షత్రాల్లో పుట్టిన అబ్బాయిలు మంచి తండ్రులు అవుతారు. ప్రతి ఒక్క తండ్రి కూడా మంచి తండ్రి అవ్వాలని అనుకుంటారు. ఈ నక్షత్రాల్లో పుట్టిన అబ్బాయిలకు ఓర్పు ఎక్కువ. వీరి మనసు కూడా చాలా గొప్పది. పిల్లలతో స్నేహితులుగా ఉంటారు.

Published on: Nov 27, 2025, 12:15:15 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రాశుల ఆధారంగా చాలా విషయాలను చెప్పవచ్చు. అలాగే నక్షత్రాలను బట్టి కూడా చాలా విషయాలను చెప్పవచ్చు. ఈ నక్షత్రాల్లో పుట్టిన అబ్బాయిలు మంచి తండ్రులు అవుతారు. ప్రతి ఒక్క తండ్రి కూడా మంచి తండ్రి అవ్వాలని అనుకుంటారు. కానీ అది అందరికీ సాధ్యం కాదు. ఎంత చేసినా కూడా కొంత మంది ఏదో ఒక కారణం వలన తక్కువ ప్రేమ చూపించడం, కూతుర్లను మెచ్చుకోకపోవడం, వారి కష్టాన్ని గుర్తించకపోవడం వంటివి చేస్తూ ఉంటారు.

ఈ నక్షత్రాల్లో పుట్టిన అబ్బాయిలకు ఓర్పు ఎక్కువ, గొప్ప తండ్రులు అవుతారు (pinterest)
ఈ నక్షత్రాల్లో పుట్టిన అబ్బాయిలకు ఓర్పు ఎక్కువ, గొప్ప తండ్రులు అవుతారు (pinterest)

పిల్లలపై ప్రతి తల్లిదండ్రులకీ కూడా ప్రేమ ఉంటుంది. అయితే ఈ నక్షత్రాల్లో పుట్టిన అబ్బాయిలు మాత్రం పిల్లలనే ప్రపంచంగా భావిస్తారు. వారికి ఎలాంటి కష్టం వచ్చినా తట్టుకోలేరు. ఈ నక్షత్రాల్లో పుట్టిన అబ్బాయిలు పిల్లలపై అమితమైన ప్రేమను చూపిస్తారు, ఎక్కువ శ్రద్ధ పెడతారు. మరి ఆ నక్షత్రాల్లో మీరు ఒకరేమో చూసుకోండి.

ఈ నక్షత్రాలలో పుట్టిన అబ్బాయిలు పిల్లలకు మంచి తండ్రులు అవుతారు, అమితంగా ప్రేమిస్తారు

పునర్వసు నక్షత్రం

పునర్వసు నక్షత్రంలో పుట్టిన అబ్బాయిలు మంచి తండ్రులుగా పేరు తెచ్చుకుంటారు. కుటుంబమే వీరికి మొదటి స్థానం. అందుకని కుటుంబానికి ఎప్పుడూ తోడుగా ఉంటారు. కుటుంబానికి ఏ కష్టం వచ్చినా సహించలేరు. పిల్లల గురించి ఎక్కువ ఆలోచిస్తారు. వాళ్ల సంతోషం కోసం దేనినైనా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటారు. పిల్లల భవిష్యత్తు గురించి కూడా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. వారి విద్య, వారికి మంచి అలవాట్లు కలగడానికి ట్రై చేస్తూ ఉంటారు.

మృగశిర నక్షత్రం

మృగశిర నక్షత్రంలో పుట్టిన అబ్బాయిలు మంచి మనసును కలిగి ఉంటారు. ఈ నక్షత్రంలో పుట్టిన అబ్బాయిలు వారి కన్నా బిడ్డలపై ఎక్కువ ప్రేమను చూపిస్తారు. పిల్లలకు ఎప్పుడూ మంచి విలువలను నేర్పుతారు. తప్పు చేసినా కూడా కోపం రాదు. ఎల్లప్పుడూ పిల్లల్ని అర్థం చేసుకుంటారు. వారు ఏం కావాలనుకుంటున్నారు అనేది చెప్పకపోయినా ఈ తండ్రులకు అర్థమైపోతుంది. పిల్లలకు మంచి స్నేహితులుగా ఉంటారు.

హస్త నక్షత్రం

హస్త నక్షత్రంలో పుట్టిన అబ్బాయిలు ఎంతో క్రమశిక్షణతో ఉంటారు. వీరి మనసు కూడా చాలా గొప్పది. పిల్లలతో స్నేహితులుగా ఉంటారు. ఎప్పుడూ వారితో ఆటలు ఆడుతూ కలిసిపోతూ ఉంటారు. పిల్లల సృజనాత్మకతను పెంచడానికి ముందుంటారు. వారు అందుకున్న చిన్న విజయాలైనా పెద్దగా సెలబ్రేట్ చేయడానికి ఇష్టపడతారు. పిల్లలు తప్పు చేసినా కూడా ఓర్పుతో క్షమిస్తారు. మరీ పెద్ద తప్పు చేస్తే మాత్రం కాస్త దండించిన తర్వాత మళ్లీ పిల్లల మనసును మార్చి సంతోషంగా ఉంచుతారు.

రేవతి నక్షత్రం

రేవతి నక్షత్రంలో పుట్టిన అబ్బాయిలకు ఎంతో ఓర్పు ఉంటుంది. ఎప్పుడూ పిల్లలకు ఎక్కువ కేర్ చూపిస్తారు. వారు పిల్లల కలలను సొంత కలలుగా భావిస్తారు. వాటిని నెరవేర్చడానికి చూస్తారు. పిల్లలు మంచిగా, నిజాయితీగా ఉండడానికి హెల్ప్ చేస్తారు. పిల్లలు ఉన్నత స్థాయికి చేరుకోవడానికి నిరంతరం కృషి చేస్తూనే ఉంటారు.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More