...
...
Next Story

Three planets Conjunction: కర్కాటక రాశిలో మూడు గ్రహాల కూటమి.. ఈ 4 రాశులకు లక్కీ ఛాన్స్!

జూన్ నెలలో కర్కాటక రాశిలో గురు, శుక్ర, కుజ గ్రహాల అరుదైన కలయిక జరగబోతోంది. ఈ త్రిగ్రహ కూటమి వల్ల వృషభం, కర్కాటకం సహా 4 రాశులకు ఊహించని లాభాలు కలగనున్నాయి.

Published on: Jun 5, 2026, 13:30:22 IST
Advertisement

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల మార్పులకు, కలయికలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. జూన్ నెలలో సరిగ్గా ఇలాంటి అద్భుతమైన గ్రహాల జాతర జరగబోతోంది. దేవగురువు బృహస్పతి (గురుడు) ఇప్పటికే కర్కాటక రాశిలో ఉండగా.. ఇప్పుడు ఆయనతో పాటు మరో రెండు కీలక గ్రహాలు తోడవబోతున్నాయి. ఒకే రాశిలో ఈ ప్రధాన గ్రహాలు కలిసి ఉండటం వల్ల కొన్ని రాశుల వారికి తిరుగులేని రాజయోగాలు పట్టనున్నాయి.

కర్కాటక రాశిలో గ్రహాల సందడి

Three planets Conjunction: కర్కాటక రాశిలో మూడు గ్రహాల కూటమి.. ఈ 4 రాశులకు లక్కీ ఛాన్స్!
Three planets Conjunction: కర్కాటక రాశిలో మూడు గ్రహాల కూటమి.. ఈ 4 రాశులకు లక్కీ ఛాన్స్!

చంద్రుడి సొంత రాశి అయిన కర్కాటకంలో గురుడు ఉచ్ఛ స్థితిలో ఉంటూ అందరికీ మేలు చేస్తున్నారు. జూన్ 8న శుక్ర గ్రహం కూడా ఈ రాశిలోకి ప్రవేశించనుంది. ఆ తర్వాత జూన్ 21న అంగారకుడు (కుజుడు) కూడా కర్కాటకంలోకి అడుగుపెడతాడు. ఈ విధంగా ఒకే రాశిలో గ్రహాల బలం పెరగడం వల్ల ఏయే రాశుల వారికి అదృష్టం కలిసి రాబోతుందో, ఎవరికి ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

మీన రాశి

మీన రాశి వారికి జూన్ నెలలో జరిగే ఈ గ్రహాల కలయిక వల్ల పెళ్లి గడియలు దగ్గరపడతాయి. వివాహ ప్రయత్నాల్లో ఉన్న వారికి అనుకూలమైన శుభవార్తలు అందుతాయి. అయితే మీరు తీసుకునే కొన్నినిర్ణయాల్లో కాస్త రిస్క్ ఉంటుంది, కాబట్టి ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. మీ సొంత నిర్ణయాలే మీ భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి. గురుడి అనుగ్రహం వల్ల ఆర్థిక లాభాలు ఉంటాయి. బుధ గ్రహ సంచారం కూడా మీకు అనుకూలంగా ఉండటం వల్ల కెరీర్ లో ఊహించని పురోగతి సాధిస్తారు.

కర్కాటక రాశి

కన్యా రాశి వారికి కూడా ఈ గ్రహాల కలయిక వల్ల అద్భుతమైన యోగాలు ఉన్నాయి. విదేశాలకు వెళ్లాలనే మీ ప్రయత్నాలు ఫలించి, విదేశీ ప్రయాణాల లాభాలు పొందుతారు. దూర ప్రయాణాల వల్ల వ్యాపారంలో మంచి లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగ రంగంలో ఉన్న వారికి గత కొంతకాలంగా వేధిస్తున్న మానసిక టెన్షన్లు సగానికి పైగా తగ్గిపోతాయి. కార్యాలయంలో మీరు పూర్తి చేసిన టాస్క్ లకు మంచి ప్రశంసలు దక్కుతాయి. కొందరికి అవార్డులు లేదా పదోన్నతులు లభించే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి.

వృషభ రాశి

వృషభ రాశి వారికి ఈ గ్రహాల యోగం ఎంతో ఉత్తమంగా ఉంటుంది. శుక్రుడి అనుగ్రహం వల్ల మీ సంపద పెరుగుతుంది. భౌతిక సుఖాలు, విలాసవంతమైన వస్తువులను సమకూర్చుకుంటారు. గురుడి శుభ దృష్టి వల్ల కెరీర్ లో అద్భుతమైన ఎదుగుదలను చూస్తారు. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఈ సమయం మీకు ఎంతో అనుకూలంగా ఉంది కాబట్టి, పనులను సరైన పద్ధతిలో ప్లాన్ చేసుకుని గరిష్ట లాభాలను సొంతం చేసుకోవడానికి ప్రయత్నించండి.

గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం సాధారణ నమ్మకాలు, జ్యోతిష్య ఆధారంగా రాసినది మాత్రమే. దీనిని పూర్తిగా ధృవీకరించడం లేదు. మరింత సమాచారం కోసం సంబంధిత నిపుణులను సంప్రదించगलరు.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks