త్వరలో శక్తివంతమైన నవపంచమ రాజయోగం, ఈ రాశుల వారి దశ తిరిగిపోతుంది!

గ్రహాల సంచారంలో మార్పు వస్తే అది 12 రాశుల వారి జీవితాల్లో అనేక మార్పులను తీసుకొస్తుంది. కొన్నిసార్లు శుభ ఫలితాలు ఎదురైతే, కొన్నిసార్లు అశుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 17న బుధుడు, గురువు 120 డిగ్రీల దూరంలో ఉంటారు. దీంతో నవ పంచమ రాజయోగం ఏర్పడుతుంది. 

Published on: Jan 21, 2026, 08:00:25 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గ్రహాలు కాలానుగుణంగా వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వస్తే అది 12 రాశుల వారి జీవితాల్లో అనేక మార్పులను తీసుకొస్తుంది. కొన్నిసార్లు శుభ ఫలితాలు ఎదురైతే, కొన్నిసార్లు అశుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 17న బుధుడు, గురువు 120 డిగ్రీల దూరంలో ఉంటారు. దీంతో నవ పంచమ రాజయోగం ఏర్పడుతుంది. ఈ యోగం అన్ని రాశుల వారిపై ప్రభావం చూపిస్తుంది. కానీ కొన్ని రాశుల వారు మాత్రం ఎక్కువగా లాభాలను పొందుతారు.

త్వరలో శక్తివంతమైన నవపంచమ రాజయోగం, ఈ రాశుల వారి దశ తిరిగిపోతుంది (pinterest)
త్వరలో శక్తివంతమైన నవపంచమ రాజయోగం, ఈ రాశుల వారి దశ తిరిగిపోతుంది (pinterest)

నవ పంచమ రాజయోగం ఐదు రాశుల వారికి అనేక లాభాలు.. డబ్బు, ఆనందంతో పాటు ఎన్నో అవకాశాలను అందిస్తుంది

1.మేష రాశి

మేష రాశి వారికి నవ పంచమ రాజయోగం ప్రభావంతో కెరీర్‌లో మంచి మార్పులు వస్తాయి. ప్రమోషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. కొత్త ఉద్యోగం కోసం చూస్తున్న వారికి ఇది శుభ సమయం. ఆర్థికపరంగా కూడా బాగుంటుంది. పూర్వీకుల నుంచి ఆస్తిని పొందుతారు. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారస్తులకు కూడా ఇది శుభ సమయం.

2.మిథున రాశి

మిథున రాశి వారికి ఈ సంచారం, ఈ గ్రహాల కలయిక శుభ ఫలితాలను అందిస్తుంది. ఎప్పటి నుంచో రావాల్సిన డబ్బు మీ చేతికి వస్తుంది. ఇది మీకు బంగారు కాలం. ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే కూడా బాగా కలిసి వస్తుంది. ఎడ్యుకేషన్, రీసెర్చ్ రంగాల్లో పనిచేసే వారికి కూడా బాగా కలిసి వస్తుంది.

3.సింహ రాశి

సింహ రాశి వారికి ఈ రాజయోగం అనేక విధాలుగా లాభాలను కలిగిస్తుంది. ఊహించని విధంగా ఆర్థిక లాభాలను పొందుతారు. కొత్త స్టార్టప్‌ను ప్లాన్ చేస్తున్న వారికి కూడా బాగా కలిసి వస్తుంది. ఇల్లు, కార్లు కొనుగోలు చేస్తారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. కష్ట పరిస్థితుల్లో కూడా సులువుగా బయటపడతారు.

4.తులా రాశి

తులా రాశి వారికి ఈ రెండు గ్రహాల కలయిక అనేక లాభాలను కలిగిస్తుంది. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. ఉద్యోగస్తులకు కూడా ఇది శుభ సమయం. ఆర్థికపరంగా కూడా బాగుంటుంది. కష్టమైన పనులను కూడా సులువుగా పూర్తి చేస్తారు. సక్సెస్‌ను అందుకుంటారు.

5.ధనస్సు రాశి

ధనస్సు రాశి వారికి ఇది అద్భుతమైన సమయం. ఈ రాశి వారు సంతోషంగా ఉంటారు. కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. విదేశీ ప్రయాణాలు పూర్తి చేస్తారు. ప్రశాంతంగా ఉంటారు. సంతోషం పెరుగుతుంది. మానసిక ఒత్తిడి దూరం అవుతుంది.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More