జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారానికి చాలా ప్రాధాన్యత ఉంది. గ్రహాల కలయిక వల్ల ఏర్పడే యోగాలు మానవ జీవితాలపై, రాశుల ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపుతాయి. అక్టోబర్ 19 నుంచి ప్రారంభమైన ఈ కొత్త వారంలో ఆకాశంలో అరుదైన గ్రహ స్థితి నెలకొంది.

ఈ వారంలో లక్ష్మీ నారాయణ రాజయోగం, హంస రాజయోగం, మాళవ్య రాజయోగం, గురు మంగళ యోగం, బుధాదిత్య రాజయోగం వంటి శక్తివంతమైన యోగాలు ఏర్పడుతున్నాయి. ఈ అద్భుతమైన రాజయోగాల ప్రభావంతో పాటు వివిధ రాశుల సంచారం కారణంగా రాబోయే ఏడు రోజులు కొందరికి అత్యంత అనుకూలంగా మారనున్నాయి.
ఈ వారంలోని గ్రహాల స్థితిగతులు
ప్రస్తుత వారంలో గ్రహాల గమనాన్ని పరిశీలిస్తే.. గురు, మంగళ గ్రహాలు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాయి. చంద్రుడు మకరం, కుంభం, మీనం, మేష రాశులలో ప్రయాణిస్తాడు. అలాగే బుధుడు, సూర్యుడు, శుక్రుడు తుల రాశిలో సంచరిస్తుండగా.. శని మీన రాశిలో, రాహువు కుంభ రాశిలో, కేతువు సింహ రాశిలో కొలువుదీరారు.
ఈ గ్రహాల కలయిక వల్ల ప్రముఖ జ్యోతిష్యులు పండిట్ నరేంద్ర ఉపాధ్యాయ అంచనా ప్రకారం మేషం, సింహం, తుల, కుంభం, మీన రాశుల వారికి ఈ వారం తిరుగులేని లాభాలు కలగనున్నాయి.
మేష, సింహ రాశుల వారికి అద్భుతమైన కాలం
మేష రాశి వారికి అక్టోబర్ 19 నుంచి 25 వరకు ఉన్న ఈ వారం ఆర్థికంగా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. డబ్బు రాకపోకలు మెరుగుపడటంతో పాటు కొత్త ఆదాయ మార్గాలు కనుచూపు మేరలో కనిపిస్తాయి. వ్యాపార రంగంలోనూ కీలక నిర్ణయాలు తీసుకునేందుకు ఈ సమయం అనుకూలంగా ఉంది.
సింహ రాశి
సింహ రాశి వారికి ఈ వారం వ్యాపార పరంగా శుభవార్తలు అందే అవకాశం ఉంది. ఉద్యోగ, వ్యాపారాల్లో ముఖ్యమైన ముందడుగు వేస్తారు. ఎప్పటినుంచో ఆగుతూ వస్తున్న పనులకు మోక్షం లభిస్తుంది.
తులా రాశి
{{/usCountry}}సింహ రాశి వారికి ఈ వారం వ్యాపార పరంగా శుభవార్తలు అందే అవకాశం ఉంది. ఉద్యోగ, వ్యాపారాల్లో ముఖ్యమైన ముందడుగు వేస్తారు. ఎప్పటినుంచో ఆగుతూ వస్తున్న పనులకు మోక్షం లభిస్తుంది.
తులా రాశి
{{/usCountry}}తులా రాశి వారికి ఈ వారం కుటుంబ సభ్యుల నుంచి పూర్తి సహకారం లభిస్తుంది. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. కొత్త వృత్తిపరమైన అవకాశాలతో పాటు వ్యాపారంలో ఊహించని విజయాలు సొంతమవుతాయి.
కుంభ రాశి
ఈ రాశి వారు తమ కెరీర్ మీద మరింత శ్రద్ధ పెడతారు. వృత్తి జీవితంలో కొత్త బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించి ప్రశంసలు అందుకుంటారు.
మీన రాశి
ఈ రాశి జాతకులు ఈ వారం ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. అయితే, ఏ పనిలోనైనా మంచి ఫలితాలు రావాలంటే మాటతీరులో సంయమనం, మధురత పాటించడం చాలా ముఖ్యం అని పండితులు సూచిస్తున్నారు.