...
...
Next Story

Puja room Vastu: పూజ గదిలో ఈ 5 వస్తువులు ఉంటే శుభ ఫలితాలు తగ్గుతాయట.. వాస్తు నిపుణుల సూచనలు

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో సానుకూల శక్తి పెరగాలంటే పూజ గదిని పరిశుభ్రంగా, పవిత్రంగా ఉంచడం ఎంతో ముఖ్యం. తెలియక చేసే కొన్ని చిన్న పొరపాట్లు కూడా ప్రతికూల శక్తిని పెంచి, ప్రశాంతత, ఆర్థిక స్థిరత్వం, కుటుంబ సుఖసంతోషాలపై ప్రభావం చూపుతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

Published on: Jul 7, 2026, 14:00:05 IST
Advertisement

వాస్తు ప్రకారం పాటించడం వలన ఇంట్లోకి సానుకూల శక్తి వ్యాపిస్తుంది. ప్రతికూల శక్తి తొలగిపోతుంది. వాస్తు నియమాలను పాటించడం వల్ల శుభ ఫలితాలను చూడవచ్చు. అయితే, వాస్తు ప్రకారం కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాలి.

Puja room Vastu: పూజ గదిలో ఈ 5 వస్తువులు ఉంటే శుభ ఫలితాలు తగ్గుతాయట.. వాస్తు నిపుణుల సూచనలు (pinterest)
Puja room Vastu: పూజ గదిలో ఈ 5 వస్తువులు ఉంటే శుభ ఫలితాలు తగ్గుతాయట.. వాస్తు నిపుణుల సూచనలు (pinterest)

చాలా మంది తెలియక పూజ గదిలో కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. కానీ ఇలాంటి తప్పులు చేయడం వల్ల నష్టాలు కలుగుతాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. పొరపాటున కూడా పూజ గదిలో కొన్ని వస్తువులను ఉంచకూడదు. ఇవి ఆర్థిక సమస్యలను, ప్రతికూల శక్తులను తీసుకొస్తాయి. వాస్తు ప్రకారం సానుకూల శక్తి తగ్గి, ప్రతికూల శక్తి పెరుగుతుంది. ప్రశాంతత, సంపద, సంతోషంపై కూడా ప్రభావం పడుతుంది. చాలా సార్లు తెలియక చాలా మంది ఈ తప్పులు చేస్తూ ఉంటారు. ఇకపై అలాంటి పొరపాట్లు చేయకుండా చూసుకోండి.

వాస్తు ప్రకారం పూజ గదిలో పొరపాటున కూడా ఈ ఐదు వస్తువులను ఉంచకండి

1.విరిగిపోయిన ఫోటోలు లేదా విగ్రహాలు:

విరిగిపోయిన ఫోటోలు లేదా విగ్రహాలు పూజ గదిలో ఉండకూడదు. ఇవి ప్రతికూల శక్తికి కారణమవుతాయి. సానుకూల శక్తిని తగ్గిస్తాయి. కాబట్టి, పొరపాటున కూడా ఇవి ఉండకుండా చూసుకోండి.

2.పదునైన వస్తువులు:

పూజ గదిలో కత్తి, కత్తెర, సూదులు, పిన్నులు వంటి పదునైన వస్తువులు పెట్టకూడదు. ఇవి కూడా ప్రతికూల శక్తికి కారణమవుతాయి. కోపం, అస్థిరత్వానికి సంకేతంగా భావిస్తారు. కాబట్టి, వీటిని వంటగదిలో లేదా మరేదైనా సురక్షితమైన ప్రదేశంలో ఉంచడం మంచిది.

3.శంఖాలు:

ఎండిపోయిన పూలను ఎప్పటికప్పుడు దేవుడి గది నుంచి తొలగించాలి. ఇవి ప్రతికూల శక్తికి కారణమవుతాయి. సానుకూల శక్తిని తగ్గించి, అభివృద్ధికి కూడా అడ్డుపడతాయని నమ్మకం.

5.కాలిన అగ్గిపుల్లలు:

కాలిన అగ్గిపుల్లలను కూడా పూజ గదిలో ఉంచకూడదు. వీటిని ఎప్పటికప్పుడు తొలగించాలి. ఇవి కూడా ప్రతికూల శక్తికి కారణమవుతాయి. సానుకూల శక్తిని తగ్గించి, సమస్యలు వచ్చే అవకాశాన్ని పెంచుతాయని వాస్తు శాస్త్రం సూచిస్తోంది.

నిరాకరణ: ఈ వ్యాసంలో ఉన్న సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనదని మేము చెప్పము. మరిన్ని వివరాలు మరియు మరింత సమాచారం కోసం, సంబంధిత రంగంలో నిపుణుడిని సంప్రదించాలని నిర్ధారించుకోండి.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks