...
...
Next Story

కుంభరాశిలో అరుదైన సంయోగం - ఈ 3 రాశుల వారికి అకస్మాత్తుగా కలసిరానున్న అదృష్టం!

అక్టోబర్ 21న కుంభరాశిలో చంద్రుడు ప్రవేశించడంతో రాహువుతో అరుదైన సంయోగం ఏర్పడింది. శని అధిపత్యంలో ఏర్పడే ఈ కూటమి వల్ల మేషం, కన్య, ధనుస్సు రాశుల వారికి ఆకస్మిక ధనలాభం, ఉద్యోగంలో పురోగతి లభించనుంది.

Published on: Oct 21, 2026, 13:14:40 IST
Advertisement

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారానికి, వాటి కలయికలకు అత్యంత ప్రాధాన్యత ఉంది. హిందూ పంచాంగం ప్రకారం, అక్టోబర్ 21న తెల్లవారుజామున 4 గంటలకు చంద్రుడు శనిదేవుడి స్వక్షేత్రమైన కుంభరాశిలోకి ప్రవేశించాడు. అక్టోబర్ 23 వరకు చంద్రుడు ఇదే రాశిలో పయనిస్తాడు. వేద జ్యోతిష్యాల ప్రకారం మనస్సుకు, భావోద్వేగాలకు చంద్రుడు కారకుడు కాగా, క్రమశిక్షణకు, మనం చేసే కర్మలకు శనిదేవుడు అధిపతి.

రాహు నక్షత్రంలో శుక్రుడు
రాహు నక్షత్రంలో శుక్రుడు

అయితే…… కుంభరాశిలో ఇప్పటికే మాయా గ్రహమైన రాహువు ఉన్నాడు. చంద్రుడి రాకతో ఇప్పుడు కుంభరాశిలో రాహు-చంద్రుల సంయోగం ఏర్పడింది. జ్యోతిష్య పండితులు నరేంద్ర ఉపాధ్యాయ్ తెలిపిన వివరాల ప్రకారం….. ఈ కలయిక వ్యక్తి ఆలోచనా సరళి, ప్రవర్తన, వ్యక్తిత్వంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. సాధారణంగా రాహువు పేరు వినగానే ప్రతికూల ఫలితాలు, అశుభాలు జరుగుతాయని అంతా భావిస్తుంటారు.

కానీ… రాహువుతో చంద్రుడు కలిసిన ప్రతిసారి చెడు మాత్రమే జరుగుతుందనడంలో నిజం లేదు. శని క్షేత్రమైన కుంభంలో ఏర్పడిన ఈ యుతి వల్ల కొన్ని రాశుల వారికి ఊహించని శుభ ఫలితాలు లభిస్తాయి. ముఖ్యంగా మూడు రాశుల వారి జాతకం ఈ సమయంతో పూర్తిగా మారబోతోంది. ఆ అదృష్ట రాశుల వివరాలు ఇవే…

మేష రాశి:

రాహువు ఆకస్మిక పరిణామాలకు, ఊహించని సంఘటనలకు కారకుడని పండితులు వివరిస్తున్నారు. కాబట్టి ఈ గ్రహం ఏ రాశిపై ప్రభావం చూపించినా తక్షణ ఫలితాలను ఇస్తుంది.

  • రాహు-చంద్రుల ప్రభావంతో మేష రాశి వారికి ఆకస్మికంగా ఒక మంచి వార్త అందుతుంది.
  • ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారికి ఇది అత్యుత్తమ సమయం. వ్యాపార రంగంలో ఉన్నవారికి అనుకూల మార్పులు కనిపిస్తాయి.
  • కాలంగా వేధిస్తున్న మానసిక భారం తగ్గుతుంది. నిలిచిపోయిన పాత బాకీలు లేదా చేతికి రావాల్సిన డబ్బు హఠాత్తుగా అందుతుంది. చేపట్టిన ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.

కన్యా రాశి :

ధనుస్సు రాశి వారికి రాహు-చంద్ర కూటమి అత్యంత ప్రయోజనకరంగా మారింది.

  • ఎక్కడైనా డబ్బు చిక్కుకుపోయి రాదని వదిలేసుకుంటే, అది అకస్మాత్తుగా మీ చేతికి తిరిగొస్తుంది.
  • ఆఫీసులో పని ఒత్తిడి తగ్గి ఉపశమనం లభిస్తుంది. పైఅధికారులతో సంబంధాలు మెరుగుపడటమే కాకుండా మీ పనికి తగిన గుర్తింపు లభిస్తుంది.
  • అదృష్టం పూర్తిగా మీ పక్షాన నిలుస్తుంది. కుటుంబంలో ఉన్న పాత గొడవలు, సమస్యలు తొలగిపోయి ప్రశాంతత లభిస్తుంది. వ్యాపార పరిస్థితి మునుపటి కంటే చాలా మెరుగ్గా మారుతుంది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks