...
...
Next Story

కుంభంలో రాహు-చంద్రుల కలయిక...సెప్టెంబర్ 23 నుంచి ఈ 3 రాశులవారికి ధనవర్షం! అదృష్టం మీవైపే

సెప్టెంబర్ 23న కుంభరాశిలోకి చంద్రుడు ప్రవేశించనున్నాడు. ఇప్పటికే అక్కడ ఉన్న రాహువుతో కలిసి ఏర్పడే గ్రహాల సంయోగం… మూడు రాశుల వారి జాతకాన్ని మార్చబోతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

Published on: Sep 22, 2026, 07:51:56 IST
Advertisement

జ్యోతిష్య శాస్త్రంలో చంద్రుడి సంచారానికి అత్యంత ప్రాధాన్యం ఉంది. జాతకంలో చంద్రుడి స్థానం శుభకరంగా ఉన్నప్పుడు వ్యక్తికి మానసిక ప్రశాంతత, సకల సుఖాలు లభిస్తాయి. అదే సమయంలో చంద్రుడు ప్రతికూల స్థానంలో ఉంటే మనశ్శాంతి కరువై అనేక సమస్యలు చుట్టుముడతాయి. మనస్కారకుడైన చంద్రుడు అతి తక్కువ సమయంలోనే ఒక రాశి నుంచి మరొక రాశికి సంచారం చేస్తుంటారు. ప్రస్తుతం మకరరాశిలో ఉన్న చంద్ర దేవుడు త్వరలోనే తన స్థానాన్ని మార్చుకోనున్నారు.

కుంభరాశిలోకి చంద్రుడు
కుంభరాశిలోకి చంద్రుడు

వైదిక పంచాంగం ప్రకారం 2026 సెప్టెంబర్ 23న చంద్రుడు శనిదేవుడి స్వంత రాశి అయిన కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. అయితే ఇప్పటికే కుంభరాశిలో రాహువు ఉన్నాడు. చంద్రుడి ఈ సంచారంతో కుంభరాశిలో రాహువు, చంద్రుల కలయిక ఏర్పడనుంది. ఈ రెండు గ్రహాల సంయోగం సెప్టెంబర్ 26 ఉదయం 5:32 గంటల వరకు కొనసాగుతుంది.

చంద్రుడి సంచారం కారణంగా మొత్తం 12 రాశుల వారి జీవితాల్లో మార్పులు చోటుచేసుకున్నప్పటికీ, ప్రఖ్యాత జ్యోతిష్య పండితులు నరేంద్ర ఉపాధ్యాయ్ తెలిపిన వివరాల ప్రకారం ఈ సమయం మూడు నిర్దిష్ట రాశుల వారికి అత్యంత శ్రేష్ఠంగా మారబోతోంది. ఆ అదృష్ట రాశులు ఏవో, వారికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం….

మేష రాశి

కుంభరాశిలో రాహువు, చంద్రుల కలయిక మేష రాశి వారికి అత్యంత లాభదాయకంగా ఉండబోతోంది. ఈ సంచార ప్రభావంతో కుటుంబంలో ఆనంద నిలయాలు వెల్లివిరుస్తాయి. ఇంటా బయటా ప్రశాంత వాతావరణం నెలకొనడమే కాకుండా, భావోద్వేగ స్థిరత్వం లభిస్తుంది. జీవితంలో సానుకూల మార్పులను స్పష్టంగా గమనిస్తారు. ముఖ్యంగా కుటుంబ అభివృద్ధి, గృహ అవసరాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకోవడానికి ఇది సరైన సమయం. ప్రతి పనిలోనూ పురోగతి కనిపిస్తుంది.

కన్యా రాశి

ధనుస్సు రాశి వారికి కూడా ఈ సంచారం ఎంతో శ్రేయస్సస్కరం. సుదీర్ఘకాలంగా రాకుండా నిలిచిపోయిన బకాయిలు లేదా డబ్బు ఈ సమయంలో మీ చేతికి అందుతుంది. నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. ఆస్తులు కొనుగోలు చేయడం, ఇల్లు నిర్మించడం లేదా గృహ మరమ్మతులు చేపట్టడం వంటి పనులకు ఇది సరైన సమయం. కుటుంబ సంబంధాలు మరింత బలపడతాయి.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks