జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా ఛాయా గ్రహాలైన రాహు-కేతువుల గమనం మానవ జీవితాలపై, దేశ ప్రపంచ పరిస్థితులపై తీవ్ర ప్రభావం చూపుతుందని నమ్ముతారు.

సాధారణంగా ఈ రెండు గ్రహాలు దాదాపు 18 నెలల పాటు ఒకే రాశిలో సంచరించి ఆ తర్వాత వేరే రాశిలోకి మారుతుంటాయి. ఈ క్రమంలోనే 2026 సంవత్సరం ముగిసే సమయానికి ఈ రెండు శక్తివంతమైన గ్రహాలు తమ స్థానాలను మార్చుకోబోతున్నాయి. ఈ కీలక పరిణామం 2026 డిసెంబర్ 5న జరగనుంది. జ్యోతిష్య నిపుణుల అంచనాల ప్రకారం ఈ రాశి మార్పు అన్ని రాశులపై విభిన్నమైన ప్రభావాలను చూపనుంది.
డిసెంబర్ 5న రాహు-కేతువుల మహా సంచారం
ఖగోళ, జ్యోతిష్య గణనల ప్రకారం 2026 డిసెంబర్ 5వ తేదీ రాత్రి 10:32 నిమిషాలకు రాహువు, కేతువులు ఏకకాలంలో రాశులు మారుతున్నారు. ఇప్పటివరకు కుంభరాశిలో సంచరిస్తున్న రాహువు ఇకపై మకర రాశిలోకి అడుగుపెడతారు. అలాగే, సింహరాశిలో ఉన్న కేతువు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు. జ్యోతిష్య శాస్త్రంలో రాహువును భౌతిక కోరికలు, అంతులేని మహత్కాక్షలు, సాంకేతికత మరియు ఆకస్మిక మార్పులకుకారకుడిగా చూస్తారు. మరోవైపు కేతువును ఆధ్యాత్మికత, ఆత్మపరిశీలన, వైరాగ్యం మరియు మోక్షకారకుడిగా పేర్కొంటారు. ఈ ఇద్దరు గ్రహాల గమనం మానవుల ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేయగల శక్తిని కలిగి ఉంటుంది.
కర్కాటక రాశిపై కేతువు ప్రభావం
కేతువు సంచారం కర్కాటక రాశిలోకి జరగబోతోంది. ఈ కాలంలో ఈ రాశి వారు తమ వ్యక్తిగత జీవితం, కుటుంబ బాధ్యతలు మరియు మానసిక ప్రశాంతతపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఏర్పడుతుంది. దైనందిన జీవితంలో ఎదురయ్యే అనుభవాల ఆధారంగా కొందరు తమ జీవిత ప్రాధాన్యతలను మార్చుకోవాలని యోచిస్తారు. కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపాలని భావించినప్పటికీ, అంతర్గతంగా కొన్ని విషయాలపై స్పష్టత కొరవడే అవకాశం ఉంది. కాబట్టి ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయడం చాలా ముఖ్యం.
మకర రాశిలో రాహువు ప్రవేశం - ఫలితాలు
మకర రాశికి నవగ్రహాలలో కర్మ సిద్ధాంతాన్ని శాసించే శని భగవానుడు అధిపతిగా వ్యవహరిస్తారు. ఈ రాశి క్రమశిక్షణ, కష్టపడే తత్త్వం, బాధ్యతలకు ప్రతీకగా నిలుస్తుంది. అలాంటి మకరంలోకి రాహువు ప్రవేశించడం వల్ల ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి భవిష్యత్ ప్రణాళికలపై కొత్త ఆలోచనలు కలుగుతాయి.
{{/usCountry}}మకర రాశికి నవగ్రహాలలో కర్మ సిద్ధాంతాన్ని శాసించే శని భగవానుడు అధిపతిగా వ్యవహరిస్తారు. ఈ రాశి క్రమశిక్షణ, కష్టపడే తత్త్వం, బాధ్యతలకు ప్రతీకగా నిలుస్తుంది. అలాంటి మకరంలోకి రాహువు ప్రవేశించడం వల్ల ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి భవిష్యత్ ప్రణాళికలపై కొత్త ఆలోచనలు కలుగుతాయి.
{{/usCountry}}కెరీర్‌లో ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి కొందరు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. అయితే, ఏవైనా కీలకమైన వ్యాపార లేదా ఆర్థిక నిర్ణయాలు తీసుకునే సమయంలో ఆవేశానికి పోకుండా, పూర్తి వ్యూహాత్మక మరియు ఆచరణాత్మక దృక్పథాన్ని అనుసరించాలని జ్యోతిష్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.