జ్యోతిష్య శాస్త్రంలో రాహువు సంచారానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఆగస్ట్ 1న రాహువు కుజుడికి చెందిన ధనిష్ఠ నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నాడు. దీని వల్ల రాహువు, కుజుల కలయికతో శక్తివంతమైన ప్రభావం ఏర్పడనుంది. ఇంతకాలం తన సొంత నక్షత్రంలో సంచరించిన రాహువు, ఇప్పుడు కుజ నక్షత్రంలోకి అడుగుపెడుతుండటంతో కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు వస్తే, మరికొన్ని రాశుల వారు తీవ్ర హెచ్చరికలు ఎదుర్కొవాల్సి వస్తుంది. ముఖ్యంగా కొన్ని రాశుల వారికి ఇది అంగారక యోగాన్ని తెచ్చిపెట్టనుంది. అసలు రాహువు అంటే ఏమిటి? ఈ నక్షత్ర మార్పు ఎలాంటి ప్రభావం చూపుతుందో వివరంగా చూద్దాం.
రాహువు అంటే ఏమిటి? దాని ప్రభావం ఎలా ఉంటుంది?

జ్యోతిష్య శాస్త్రంలో రాహువు, కేతువులను ఛాయా గ్రహాలుగా పరిగణిస్తారు. జీవితంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రశాంతంగా సాగిపోవాలంటే ఈ రెండు గ్రహాల స్థితులను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. పౌరాణిక కథల ప్రకారం, సముద్ర మధనం సమయంలో అమృతం పంచే తరుణంలో రాహువు తల భాగాన్ని శ్రీహరి వేరు చేయగా, ఆ తల భాగమే రాహువుగా మారింది. కాగా మొండెం భాగం కేతువుగా శ్రీహరి పాదాల చెంత చేరి మోక్షాన్ని పొందింది.
రాహువును వాయు తత్వానికి ప్రతీకగా భావిస్తారు. ఇది నేరుగా మనిషి ఆలోచనలు, మెదడును ప్రభావితం చేస్తుంది. రాహువు ఏ గ్రహంతో జతకడితే, ఆ గ్రహం యొక్క మంచి గుణాలను గ్రహించి, తన స్వభావాన్ని వాటికి అంటిస్తుంది.
రాహు-కుజుల కలయిక: అంగారక యోగం ప్రభావం
కుజుడి నక్షత్రంలోకి రాహువు ప్రవేశించడం వల్ల అత్యంత ప్రభావవంతమైన 'అంగారక యోగం' ఏర్పడుతుంది. ఈ యోగం కారణంగా మనుషుల్లో కోపం, దూకుడు స్వభావం విపరీతంగా పెరుగుతాయి.
చిన్న విషయాలకే ఉద్రిక్తతకు గురికావడం, మొండి పట్టుదల ప్రదర్శించడం జరుగుతుంది. అంతేకాకుండా అనుకోని ప్రమాదాలు, శస్త్రచికిత్సలు (సర్జరీలు) జరిగే అవకాశం కూడా మెండుగా ఉంటుంది. కుటుంబంలోనూ ప్రశాంతత కరువై, నిరంతరం అశాంతి నెలకొంటుంది.
ఏ రాశుల వారికి ఈ గోచరం వల్ల అదృష్టం వస్తుంది?
ఈ రాశుల మార్పు ప్రతి ఒక్కరికీ చెడు చేస్తుందని అనుకోవడానికి లేదు. కొన్ని రాశుల వారికి రాహువు నక్షత్ర మార్పు అద్భుతమైన లాభాలను తెచ్చిపెడుతోంది:
{{/usCountry}}ఈ రాశుల మార్పు ప్రతి ఒక్కరికీ చెడు చేస్తుందని అనుకోవడానికి లేదు. కొన్ని రాశుల వారికి రాహువు నక్షత్ర మార్పు అద్భుతమైన లాభాలను తెచ్చిపెడుతోంది:
{{/usCountry}}కుంభ రాశి: ఈ రాశి వారికి రాహువు గోచరం ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తుంది. జీవితంలో ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తున్న శుభవార్తలు వింటారు. కమ్యూనికేషన్, రీసెర్చ్ రంగాల్లో పనిచేసే వారికి ఊహించని లాభాలు అందుతాయి.
తులా రాశి: తులా రాశి వారికి పెట్టుబడుల ద్వారా భారీ లాభాలు దక్కే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది.
మిథున రాశి: సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఉద్యోగంలో ఊహించని ఉన్నతితో పాటు కొత్త బాధ్యతలు మీ చేతికి వస్తాయి.
మేష రాశి: ఆర్థిక పరిస్థితి బలోపేತమవుతుంది. గతంలో మీరు చేసిన సరైన ప్రణాళికలు ఇప్పుడు అకస్మాత్తుగా మంచి ఫలితాలను ఇచ్చి మిమ్మల్ని విజయతీరాలకు చేర్చుతాయి.