జ్యోతిష్య శాస్త్రంలో శని, రాహువుల గ్రహ స్థానాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. సాధారణంగా రాహువు, శని పేర్లు వినగానే చాలామంది ఆందోళన చెందుతుంటారు. అయితే ప్రతీసారి ఇవి ప్రతికూల ఫలితాలనే ఇవ్వవు. సరైన స్థానాల్లో సంచరించినప్పుడు మానసిక, ఆర్థిక జీవితాల్లో ఊహించని సానుకూల మార్పులను, విశేష పురోగతిని తీసుకువస్తాయి. రాబోయే డిసెంబర్ నెలలో రాహువు, శనుల కలయిక ప్రాధాన్యత సంతరించుకోనుంది.

జ్యోతిష్య నిపుణుడు పండిట్ నరేంద్ర ఉపాధ్యాయ్ ప్రకారం,,,.. ప్రస్తుతం కుంభరాశిలో సంచరిస్తున్న రాహువు డిసెంబర్ 5వ తేదీ రాత్రి మకర రాశిలోకి ప్రవేశించనున్నాడు. మకరం శని దేవునికి చెందిన రాశి కావడం వల్ల ఈ గ్రహ పరివర్తనపై శని దేవుని ప్రభావం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. శని రాశిలోకి రాహువు రాక మూడు రాశుల వారి జాతకాలను సానుకూలంగా మార్చబోతోంది. ముఖ్యంగా సింహం, వృశ్చికం, మీన రాశుల వారికి ఈ గ్రహ సంచారం విశేష ప్రయోజనాలను అందించనుంది.
1. సింహ రాశి
మకర రాశిలో రాహువు సంచారం సింహ రాశి వారికి సరికొత్త అవకాశాలను తెచ్చిపెడుతుంది. ఉద్యోగ రంగంలో చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఆశించిన అవకాశాలు, పదోన్నతులు ఇప్పుడు లభిస్తాయి. మీ కష్టానికి తగిన అద్భుతమైన ప్రతిఫలం లభించడంతో పాటు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే విషయంలో ఉన్న అయోమయం, గందరగోళం తొలగిపోయి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. గతంలో మీరు చేసిన కృషికి ఇప్పుడు ఆశించిన ప్రతిఫలం అందుతుంది.
2. వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి ఈ సంచారం వల్ల నిలిచిపోయిన పనులు వేగవంతమవుతాయి. ఉద్యోగం, వ్యాపారం రెండింటిలోనూ ముందుకు సాగడానికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. ఎక్కువ కాలంగా మీరు చేస్తున్న శ్రమకు తగిన మంచి ఫలితాలు అందుతాయి. డబ్బుకు సంబంధించిన ఇబ్బందులు తొలగిపోయి ఆర్థిక ఉపశమనం లభిస్తుంది. చేపట్టే పనుల్లో విజయాలు లభించడంతో ఉత్సాహంగా పనిచేస్తారు. అయితే ఈ సమయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా, నిలకడగా వ్యవహరించడం మంచిది.
3. మీన రాశి
మీన రాశి వారికి రాహువు గ్రహ మార్పుతో తీపి వార్తలు అందుతాయి. దీర్ఘకాలంగా వేధిస్తున్న సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. కెరీర్‌కు సంబంధించి శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే మరింత మెరుగ్గా మారి స్థిరత్వం లభిస్తుంది. ఆశించిన పనులు సకాలంలో పూర్తి కావడంతో మానసిక ప్రశాంతత లభిస్తుంది. పెద్ద నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం శ్రేయస్కరం.
చేయాల్సిన పరిహారాలు…
- ప్రతి శనివారం రావి చెట్టు కింద ఆవనూనెతో దీపం వెలిగించి పూజించాలి.
- పెద్దలను గౌరవిస్తూ, ఎవరిపైనా ఈర్ష్య, అసూయలు పెంచుకోకుండా ఉండాలి.
- మీ సామర్థ్యం మేరకు నిరుపేదలకు, అవసరంలో ఉన్నవారికి సహాయం చేయాలి.