రాహువు సంచారంతో ఈ 3 రాశులకు పట్టిందల్లా బంగారమే.. ఊహించని ధనలాభాలు!
రాహువు మాయ, ఆకస్మిక పరిణామాలు, కోరికలకు కారకుడిగా పరిగణించబడతాడు. ప్రస్తుతం కుంభరాశిలో సంచరిస్తున్న రాహువు 2026 డిసెంబర్ 5 వరకు అక్కడే కొనసాగనున్నట్లు పేర్కొనబడింది. ఈ సంచారం వల్ల కొన్ని రాశుల వారికి ఆర్థిక లాభాలు, కెరీర్లో పురోగతి, వ్యాపార అభివృద్ధి కలిగే అవకాశాలున్నాయి.
జ్యోతిష్య శాస్త్రంలో రాహువును మాయా గ్రహంగా, అకస్మాత్తుగా జరిగే పరిణామాలు మరియు లౌకిక కోరికలకు కారకుడిగా భావిస్తారు. సాధారణంగా రాహువు ఎప్పుడూ వ్యతిరేక దిశలో సంచరిస్తుంటాడు. ప్రస్తుతం శని ఆధిపత్యం ఉన్న కుంభరాశిలో రాహువు సంచరిస్తున్నాడు. జ్యోతిష్య నిపుణుల గణాంకాల ప్రకారం, డిసెంబర్ 5, 2026 వరకు రాహువు ఇదే కుంభరాశిలో పయనించనున్నాడు.

రాహువు సంచార వేళ శుభ ఫలితాలు అందితే కెరీర్, వ్యాపార రంగాల్లో ఊహించని ప్రగతి కనిపిస్తుంది. అలాగే ఆర్థికంగా మంచి నిలదొక్కుకునే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో కుంభరాశిలో రాహువు సంచారం వల్ల ఏయే రాశుల వారికి విశేషమైన ధనలాభం, అదృష్టం కలగబోతున్నాయో వివరంగా చూద్దాం.
రాహువు అనుగ్రహంతో ఈ రాశులకు లాభాలు
ధనుస్సు రాశి:
శని కుంభరాశిలో రాహువు సంచారం ధనుస్సు రాశి వారికి అత్యంత లాభదాయకంగా మారుతుందని జ్యోతిష్య నిపుణులు పేర్కొంటున్నారు. ఈ కాలంలో వీరికి ఎక్కడి నుంచో ధనాగమనం ఉంటుంది. సొంతంగా వ్యాపారం నిర్వహించే వారికి మంచి లాభాలు అందడంతో పాటు ప్రముఖుల నుంచి శుభవార్తలు వింటారు. రోజంతా సానుకూల శక్తితో ఉత్సాహంగా గడుపుతారు. ముఖ్యంగా ప్రతి రంగంలోనూ వీరి ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది.
మేష రాశి:
మేష రాశి జాతకులకు కుంభరాశిలో రాహు సంచారం ఎంతో ప్రయోజనకరంగా నిలవనుంది. ఈ కాలంలో వీరికి ఊహించని విధంగా భారీగా ధనలాభం కలిగే అవకాశం ఉంది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న న్యాయపరమైన వివాహాలు లేదా కోర్టు కేసుల్లో అనుకూల తీర్పులు వచ్చి విజయం సాధిస్తారు. ఉద్యోగ, వ్యాపార నిమిత్తం ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఈ ప్రయాణాలు వీరికి భవిష్యత్తులో మంచి ఫలితాలను ఇస్తాయి.
కన్యా రాశి:
కన్యా రాశి వారికి రాహువు కదలికలు ఎంతో శుభప్రదమైన ఫలితాలను ఇస్తాయి. వీరికి ఆర్థిక పరిస్థితి క్రమంగా బలపడుతుంది. గతంలో స్థిరాస్తులు లేదా ఇతర రంగాల్లో చేసిన పెట్టుబడులు ఇప్పుడు మంచి లాభాలను అందించి ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేస్తాయి. అయితే ఆరోగ్య విషయంలో మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.
రాహువు అశుభ ప్రభావాల నుంచి రక్షణ పొందడానికి పరిహారాలు
జ్యోతిష్య శాస్త్రంలో రాహువును ఛాయా గ్రహంగా వర్ణిస్తారు. రాహువు సంచార సమయంలో ఎదురయ్యే ప్రతికూల ప్రభావాల నుంచి ఉపశమనం పొందడానికి అమ్మవారి ఆరాధన చేయడం చాలా మంచిది. భక్తులు నిష్టతో శ్రీ దుర్గా చాలీసా పఠించడం ద్వారా రాహువు దోషాల నుంచి ఉపశమనం పొందవచ్చు.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


