...
...
Next Story

రక్షాబంధన్ 2026: మేషం నుంచి మీనం వరకు.. రాశిని బట్టి రాఖీకి ఎలాంటి గిఫ్ట్ ఇవ్వాలో తెలుసా?

ఎప్పుడూ ఇచ్చే సాధారణ బహుమతుల కంటే, వారి వ్యక్తిత్వానికి, స్వభావాన్ని బట్టి బహుమతి ఇస్తే ఆ ఆనందమే వేరు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి రాశి వారికి కొన్ని ప్రత్యేక రుచులు, అభిరుచులు ఉంటాయి. మీ తోబుట్టువుల రాశిని బట్టి సరైన బహుమతిని ఎంపిక చేయడం ఎలాగో చూద్దాం.

Published on: Aug 24, 2026, 14:00:27 IST
Advertisement

రక్షాబంధన్ వచ్చేస్తోంది. ఆ రోజు మీరు మీ సోదరుడు లేదా సోదరికి మంచి బహుమతి ఇవ్వాలనుకుంటున్నారా? అయితే, రాశుల ఆధారంగా ఎవరికి ఏ బహుమతి ఇస్తే బాగుంటుందో తెలుసుకుందాం.

రక్షాబంధన్ రోజు రాశులను ఆధారంగా ఎలాంటి బహుమతి ఇస్తే మంచిదో చూద్దాం

మేష రాశి

రక్షాబంధన్ 2026: మేషం నుంచి మీనం వరకు.. రాశిని బట్టి రాఖీకి ఎలాంటి గిఫ్ట్ ఇవ్వాలో తెలుసా?
రక్షాబంధన్ 2026: మేషం నుంచి మీనం వరకు.. రాశిని బట్టి రాఖీకి ఎలాంటి గిఫ్ట్ ఇవ్వాలో తెలుసా?

మేష రాశి వారు ఉత్సాహంగా, చురుకుగా ఉండడానికి ఇష్టపడతారు. కొత్త విషయాలను ట్రై చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. వీరికి స్మార్ట్ వాచ్, స్పోర్ట్స్, ఫిట్‌నెస్ గ్యాడ్జెట్స్ లేదా ట్రావెల్ బ్యాగ్ లాంటివి బహుమతి కింద ఇస్తే మంచిది.

వృషభ రాశి

వృషభ రాశి వారికి మంచి పెర్ఫ్యూమ్, వాలెట్, వాచ్, హ్యాండ్‌బ్యాగ్ లేదా ప్రీమియం చాక్లెట్లు వంటివి బహుమతిగా ఇవ్వచ్చు.

మిథున రాశి

మిథున రాశి వారు కొత్త విషయాలు తెలుసుకోవడానికి, మాట్లాడడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. వీరికి మంచి పుస్తకాలు, హెడ్‌ఫోన్స్, డైరీ, గ్యాడ్జెట్స్ వంటివి ప్రిఫర్ చేయొచ్చు.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఫ్యామిలీ ఫోటో ఫ్రేమ్, వ్యక్తిగతంగా కస్టమైజేషన్ చేసిన బహుమతులు ఇస్తే బాగా ఇష్టపడతారు. అలాగే ఫోటో ఆల్బమ్, చేతితో తయారు చేసిన జ్ఞాపకాలు వంటివి ఇవ్వచ్చు.

సింహ రాశి

సింహ రాశి వారికి స్టైలిష్‌గా ఉండే వాచ్, సన్‌గ్లాసెస్, బ్రాండెడ్ పెర్ఫ్యూమ్స్ లేదా జువెలరీ వంటివి బహుమతిగా ఇవ్వచ్చు.

కన్యా రాశి

కన్యా రాశి వారికి ఆర్గనైజర్, ప్లానర్, బ్యాగ్, పుస్తకాలు, ఉపయోగకరమైన గ్యాడ్జెట్స్ ఇవ్వచ్చు. ఈ రాశి వారు క్రమశిక్షణకు, ఉపయోగకరమైన వస్తువులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.

తులా రాశి

ఈ రాశి వారికి పర్సనల్ గిఫ్ట్స్ ఇవ్వచ్చు. లెదర్ వాలెట్, పుస్తకాలు కూడా ఇష్టపడతారు.

ధనుస్సు రాశి

ఈ రాశి వారికి ట్రావెల్ బ్యాక్‌ప్యాక్, ట్రావెల్ యాక్సెసరీస్ వంటివి ఇవ్వచ్చు. కెమెరా యాక్సెసరీస్ కూడా నచ్చుతాయి.

మకర రాశి

మకర రాశి వారికి ఆఫీస్ బ్యాగ్, వాలెట్, లెదర్ గిఫ్ట్స్ మంచి గిఫ్ట్ కింద ఇవ్వచ్చు.

కుంభ రాశి

ఈ రాశి వారికి స్మార్ట్ గ్యాడ్జెట్స్, స్మార్ట్ లైట్ బహుమతిగా ఇస్తే ఎక్కువగా ఉపయోగిస్తారు.

మీన రాశి

మీన రాశి వారికి పెయింటింగ్స్, మీ ఊరికి సంబంధించిన బహుమతులు ఇవ్వచ్చు. పుస్తకాలు, ఫోటో ఫ్రేమ్స్ కూడా నచ్చుతాయి. హ్యాండ్‌మేడ్ గిఫ్ట్స్‌ను కూడా చూసి ఆనందిస్తారు.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe