చాలామంది స్త్రీలు రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. భర్త ఆదాయం పెరగక కొంత మంది స్త్రీలు ఇబ్బంది పడుతుంటే, అవమానాలు ఎదురై మరికొందరు, డబ్బు నిలవక మరి కొందరు, మనసు బాధగా కొందరికి ఉంటే, మరికొందరికి ఎక్కువ భయం ఉంటుంది. ఇలా ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది.

మరికొంత మంది ఇళ్లల్లో భార్యను సంతోషంగా ఉంచడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. భార్యను సంతోషంగా ఉంచితే ఆర్థిక అభివృద్ధి కూడా పెరుగుతుంది. అలాగే కొందరి ఇళ్లల్లో భర్త కోపం వలన ఇబ్బంది పడుతూ ఉంటారు. వీటన్నిటికీ అద్భుత పరిష్కారాలు ఇక్కడ ఉన్నాయి. ఈ సమస్యలతో పాటుగా శని దోషం కూడా తొలగిపోవడానికి ఈ మార్గాలను పాటించండి. ఇక మీ ఇంట సంతోషాలు వెల్లివిరుస్తాయి.
భర్త ఆదాయం రెట్టింపు కావాలంటే స్త్రీలు ఏం చేయాలి?
భర్త ఆదాయం రెట్టింపు అవ్వాలంటే స్త్రీలు ఈ పరిహారాలను పాటించడం మంచిది. ఇలా చేయడం వలన ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉండవు. సంతోషంగా ఉండొచ్చు. భర్త ఆదాయం పెరిగి అన్ని సమస్యలకు ఫుల్ స్టాప్ పడుతుంది.
భర్త సంపాదన పెరగాలంటే పెళ్లైన ప్రతి ఒక్క స్త్రీ కూడా తన పాపిట్లో కుంకుమ పెట్టుకోవాలి. భర్త సంపాదన పెరగడానికి ప్రతి స్త్రీ కూడా పంచమాంగల్యాలను ధరించాలి. అలాగే రోజూ ముఖానికి పసుపు రాసుకోవాలి.
భర్త సంపాదన పెరగడానికి, భర్త ఇంటి నుంచి వెళ్లిన వెంటనే బట్టలు ఉతకడం, ఇల్లు తుడవడం వంటివి చేయకూడదు.
భర్త పర్సులో ఐదు యాలకులను పెడితే లక్ష్మీ కటాక్షం కలిగి సంతోషంగా ఉండొచ్చు. ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి.
జీవితంలో ఎదురయ్యే చిన్న సమస్యలకు సులువైన పరిష్కారాలు
మనసు బాధగా ఉందా?
{{/usCountry}}భర్త పర్సులో ఐదు యాలకులను పెడితే లక్ష్మీ కటాక్షం కలిగి సంతోషంగా ఉండొచ్చు. ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి.
జీవితంలో ఎదురయ్యే చిన్న సమస్యలకు సులువైన పరిష్కారాలు
మనసు బాధగా ఉందా?
{{/usCountry}}మనసు బాధగా ఉంటే “శ్రీరామ జయరామ జయ జయ రామ” అని రోజు చదువుకోండి.
భయం ఎక్కువగా ఉందా?
రోజు భయపడుతున్నారా? భయం ఎక్కువగా ఉందా? అయితే “ఓం కాలభైరవాయ నమః” అనే మంత్రాన్ని జపించండి.
అవమానాలు ఎదురవుతున్నాయా?
మీకు ఏదో ఒక అవమానాలు ఎదురవుతున్నాయా? అయితే “ఓం రాహవే నమః” మంత్రాన్ని జపించండి.
డబ్బు నిలవట్లేదా?
డబ్బు నిలవాలంటే “ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః” అనే మంత్రాన్ని జపించండి. దీంతో లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సకల శుభాలు కలుగుతాయి. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు.
మీరు చేసే పనులు మధ్యలోనే ఆగిపోతున్నాయా?
అయితే “ఓం హనుమతే నమః” అనే మంత్రాన్ని జపించండి. అద్భుతమైన ఫలితాలను చూడొచ్చు.
భార్యను సంతోషంగా ఉంచాలా? అయితే ఈ మార్గాలను ఫాలో అవ్వండి
భార్య సంతోషంగా ఉంటే ఆర్థిక వృద్ధి ఉంటుంది. భార్య సంతోషంగా ఉంటే ఇల్లు అంతా కూడా సంతోషంగా ఉంటుంది. ఇంట్లో ఉన్న వాళ్లందరూ కూడా ఆనందంగా ఉంటారు.
భార్యకు గౌరవం ఇవ్వండి: గృహలక్ష్మిగా గౌరవించాలి. లేకపోతే లక్ష్మీదేవి ఆ ఇంట నిలవదు. సంపద తరిగిపోతుంది.
పుట్టింటిని గౌరవించండి: ఆమె తల్లిదండ్రులను, ఆమె పుట్టింటిని తక్కువ చేసి మాట్లాడటం మంచిది కాదు. దాని వలన సానుకూల శక్తి తగ్గిపోతుంది. కనుక వారికి గౌరవం ఇవ్వండి. సానుకూల శక్తిని పెంచుకోండి.
శుక్రుని అనుగ్రహం: శుక్రుని అనుగ్రహం ఉంటే సంతోషం, డబ్బు, విలాసాలకు లోటు ఉండదు. జ్యోతిష్యం ప్రకారం చూస్తే భార్య శుక్ర గ్రహానికి ప్రతీక. ఆమె సంతోషంగా ఉంటేనే కుటుంబ ఎదుగుదల కూడా ఉంటుంది.
నిర్ణయాల్లో భార్య సలహా తీసుకోండి: ఆర్థిక విషయాల్లో భార్య సలహా తీసుకోండి. అదృష్టం, విజయాలు కలుగుతాయి.
ఖర్చులకు స్వేచ్ఛ ఇవ్వండి: చిన్న చిన్న ఖర్చులకు ఆమెకు స్వేచ్ఛ ఇవ్వాలి. అప్పుడే సంపద పెరుగుతుంది. మీరు ఇద్దరూ కూడా సంతోషంగా ఉంటారు.
మీ భర్త కోపాన్ని తగ్గించాలా? అయితే ఈ చిన్న పనులు చేయండి.. భర్త మనసు మైనంలా కరిగిపోతుంది..
శనివారం నాడు 21 లవంగాలను కుడి చేతిలో వేసుకుని, మీ భర్త పేరును 21 సార్లు తలుచుకుని ఆ లవంగాలను పూజ గదిలో పెట్టండి. ఆదివారం ఆ లవంగాలను కర్పూరంతో పాటు వెలిగించండి. దీని ద్వారా భర్త కోపం తగ్గుతుంది. ఇంట్లో సానుకూల శక్తి కూడా వ్యాపిస్తుంది. లేదంటే మంగళవారం భర్త పేరును ఎరుపు రంగు పెన్నుతో రాసి హనుమంతుడి పాదాల దగ్గర పెట్టండి. ఆ హనుమాన్ అనుగ్రహంతో భర్త కోపం తగ్గుతుంది. ఇల్లు ప్రశాంతంగా మారుతుంది.