గమనం మార్చనున్న శనిదేవుడు - ఈ 5 రాశులపై ప్రభావం ఎలా ఉంటుందంటే..?

సుమారు నాలుగున్నర నెలల తిరోగమనం తర్వాత డిసెంబర్ 11న మీన రాశిలో శని ప్రత్యక్ష గమనంలోకి రానున్నాడు. ఈ మార్పు మేషం, కుంభం, మీనం సహా ఐదు రాశుల జీవితాలపై ప్రభావం చూపనుంది.

Published on: Nov 14, 2026, 11:58:13 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

జ్యోతిష్య శాస్త్రంలో కర్మఫల దాతగా, న్యాయదేవతగా పిలిచే శనిదేవుడి గమనంలో కీలక మార్పు చోటుచేసుకోబోతోంది. సుమారు నాలుగున్నర నెలలుగా తిరోగమన (వక్ర) స్థితిలో సంచరిస్తున్న శని గ్రహం త్వరలోనే ప్రత్యక్ష (మార్గ) గమనంలోకి రానుంది.

గమనం మార్చనున్న శనిదేవుడు
గమనం మార్చనున్న శనిదేవుడు

డిసెంబర్ 11న మీన రాశిలోనే శని తన గమనాన్ని మార్చుకుంటాడు. ఈ గ్రహ కదలికకు జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. శని గమనంలో వచ్చే ఈ మార్పు ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితులు, కుటుంబ జీవితంలో కీలక పరిణామాలకు దారితీస్తుందని జ్యోతిష్య పండితులు విశ్వసిస్తున్నారు.

ముఖ్యంగా ప్రస్తుతం మేషం, కుంభం, మీన రాశుల వారికి ఏలినాటి శని నడుస్తోంది. మరోవైపు సింహ, ధనుస్సు రాశుల వారు అర్ధాష్టమ, అష్టమ శని (ధయ్యా) ప్రభావంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో డిసెంబర్‌లో శని ప్రత్యక్ష గమనంలోకి రావడం ఈ ఐదు రాశుల వారికి అత్యంత కీలకంగా మారనుంది.

శని దేవుడు జూలై 27, 2026న మీన రాశిలో తిరోగమన ప్రయాణాన్ని ప్రారంభించాడు. డిసెంబర్ 11, 2026 తెల్లవారుజామున 5 గంటలకు తిరోగమనం వీడి ప్రత్యక్ష కదలికను మొదలుపెడతాడు. అంటే సుమారు 137 రోజుల పాటు శని వక్ర గమనంలో ఉన్నాడు. అయితే ఈ సమయంలో శని తన రాశిని మార్చుకోడు, మీన రాశిలోనే కొనసాగుతాడు.

జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం…. శని ఎవరికైనా వారి కర్మలకు అనుగుణంగానే ఫలితాలను ఇస్తాడు. తిరోగమన స్థితిలో ఉన్నప్పుడు పాత పనులు, అసంపూర్తిగా మిగిలిపోయిన బాధ్యతలు మళ్లీ తెరపైకి వస్తాయి. అదే శని ప్రత్యక్ష గమనంలోకి వచ్చినప్పుడు నిలిచిపోయిన పనులన్నీ వేగవంతమవుతాయని పండితులు చెబుతున్నారు.

ప్రస్తుతం మేషం, కుంభం, మీన రాశులపై ఏలినాటి శని ప్రభావం ఉంది. కాబట్టి శని కదలికలో వచ్చే ఈ మార్పు ఈ మూడు రాశుల వారికి ఎంతో ముఖ్యం.

మేష రాశి :

ఈ రాశి వారు తమ వృత్తి, ఆర్థిక స్థితిగతులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన సమయం ఇది. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. అనవసర ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. గతంలో నిలిచిపోయిన పాత పనులను పూర్తి చేసే మంచి అవకాశం లభిస్తుంది.

కుంభ రాశి:

కుంభ రాశి వారు ఆర్థిక లావాదేవీల విషయంలో చాలా అప్రమత్తంగా వ్యవహరించాలి. కుటుంబ బాధ్యతలు పెరిగే సూచనలు ఉన్నాయి. ఉద్యోగంలో ఎంత కష్టపడినా ఆశించిన ఫలితం దక్కడానికి కొంత సమయం పట్టవచ్చు. ఈ కాలంలో సహనం కోల్పోకుండా ఉండటం ఎంతో ముఖ్యం.

మీన రాశి:

శని మీన రాశిలోనే సంచరిస్తుండటంతో, ఈ రాశి వారిపై ప్రత్యక్ష ప్రభావం ఉంటుంది. కార్యాలయంలో కొత్త బాధ్యతలు మీ భుజాలపై పడతాయి. డబ్బు విషయంలో ఆచితూచి వివేకంతో నిర్ణయాలు తీసుకోవాలి. కుటుంబ సభ్యులతో సంబంధాలను మరింత మెరుగుపరుచుకోవడంపై దృష్టి సారించండి.

ప్రస్తుతం సింహ, ధనుస్సు రాశుల వారు శని ధయ్యా ప్రభావాన్ని ఎదుర్కొంటున్నారు. శని ప్రత్యక్ష సంచార సమయంలో ఈ రెండు రాశుల వారు వృత్తి, కుటుంబ విషయాల్లో ఓర్పుతో వ్యవహరించాలని జ్యోతిష్యులు సూచిస్తున్నారు.

  • సింహ రాశి : ఉద్యోగంలో పని ఒత్తిడి ఎక్కువవుతుంది. ఉన్నతాధికారులతో మాట్లాడేటప్పుడు, చర్చలు జరిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారంలో ఏదైనా కొత్త నిర్ణయం తీసుకునే ముందు పూర్తి సమాచారాన్ని సేకరించడం ఉత్తమం. ఆర్థిక విషయాల్లో పక్కా బడ్జెట్ వేసుకొని ముందుకు సాగడం మంచిది.
  • ధనుస్సు రాశి : ధనుస్సు రాశి వారు ఈ సమయంలో కుటుంబ జీవితానికి, వృత్తిపరమైన పనులకు మధ్య సమతుల్యత సాధించాలి. ఉద్యోగంలో కొన్ని కొత్త బాధ్యతలు దక్కే అవకాశం ఉంది. వ్యాపారంలో పాత పరిచయాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఖర్చులను నియంత్రించుకోవడం చాలా అవసరం.

శని తన గమనాన్ని మార్చుకోవడంతో ఏలినాటి శని…. అర్ధాష్టమ శని దోషాలు తొలగిపోతాయా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. దీనికి సమాధానం 'కాదు' అనే చెప్పాలి. శని ప్రత్యక్ష గమనంలోకి వచ్చినంత మాత్రాన ఏలినాటి శని గానీ, ధయ్యా గానీ ముగిసిపోవు. శని ఒక రాశి నుంచి మరో రాశిలోకి మారినప్పుడు మాత్రమే వీటి ప్రభావం మారుతుంది. శని ప్రస్తుతం మీన రాశిలో ఉన్నాడు, జూన్ 3, 2027న మేష రాశిలోకి ప్రవేశిస్తాడు. కాబట్టి అప్పటివరకు మేషం, కుంభం, మీన రాశులకు ఏలినాటి శని కొనసాగుతుంది.

జ్యోతిష్య నమ్మకాల ప్రకారం….. శని గమనంలో వచ్చే ఈ మార్పు మనిషి తన పాత పనులను సమీక్షించుకోవడానికి, బాధ్యతలను మరింత మెరుగ్గా నిర్వర్తించడానికి ఒక చక్కని అవకాశాన్ని ఇస్తుంది. అందువల్ల ఈ సమయంలో సహనం, క్రమశిక్షణ, కష్టపడే తత్వంతో ముందుకు సాగడం ఎంతో అవసరం.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More