Saturn Mars Conjunction: మీన రాశిలో శని, కుజుల కలయికతో వీళ్ళకు నష్టాలు.. ఈ పరిహారాలతో ఉపశమనం!

ఏప్రిల్ 2న కుజుడు మీన రాశిలోకి ప్రవేశిస్తాడు. మీన రాశిలోకి కుజుడు ప్రవేశించిన వెంటనే శనితో సంయోగం చెందుతాడు. ఈ రెండు గ్రహాలు సంయోగం చెందినప్పుడు కొన్ని రాశుల వారికి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. మరి ఈ రెండు గ్రహాల కలయిక వలన ఏ రాశి వారు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

Published on: Mar 21, 2026 5:00 PM IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి సంచారంలో మార్పు చేస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వస్తే, అది అన్ని రాశుల వారిపై ప్రభావం చూపిస్తుంది. కొన్ని సార్లు శుభ ఫలితాలు కలిగితే, కొన్నిసార్లు అశుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కుజుడు కూడా ఎప్పటికప్పుడు తన రాశులను మారుస్తూ ఉంటాడు. కుజుడి సంచారంలో మార్పు వస్తే, అది 12 రాశుల వారి జీవితంలో చాలా మార్పులను తీసుకొస్తుంది.

మీన రాశిలో శని, కుజుల సంయోగం.. ఈ రాశుల వారికి నష్టాలను కలిగించే అవకాశం ఉంది (pinterest)
మీన రాశిలో శని, కుజుల సంయోగం.. ఈ రాశుల వారికి నష్టాలను కలిగించే అవకాశం ఉంది (pinterest)

ఏప్రిల్ 2న కుజుడు మీన రాశిలోకి ప్రవేశిస్తాడు. మీన రాశిలోకి కుజుడు ప్రవేశించిన వెంటనే శనితో సంయోగం చెందుతాడు. ఈ రెండు గ్రహాలు సంయోగం చెందినప్పుడు కొన్ని రాశుల వారికి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. మరి ఈ రెండు గ్రహాల కలయిక వలన ఏ రాశి వారు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

శని, కుజుల కలయిక:

ద్రిక్ పంచాంగం ప్రకారం, కుజుడు ఏప్రిల్ 2న మీన రాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత మే 11 మధ్యాహ్నం 12:47 వరకు ఇదే రాశిలో సంచారం చేస్తాడు. ఈ సమయంలో శనితో సుమారు 40 రోజులు పాటు సంయోగం జరుగుతుంది. ఇది కొన్ని రాశుల వారికి సమస్యలను తీసుకొస్తుంది. కాబట్టి ఏప్రిల్ 2 నుంచి మే 11 వరకు ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉంటే మంచిది. లేకపోతే చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

మీన రాశిలో శని, కుజుల సంయోగం.. ఈ రాశుల వారికి నష్టాలను కలిగించే అవకాశం ఉంది.. జాగ్రత్తగా ఉండాలి

1.మేష రాశి:

మేష రాశి వారికి రెండు గ్రహాల సంయోగం వలన ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. ఈ సమయంలో ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. పనిలో ఇబ్బందులు, ఆటంకాలు వస్తాయి. కాబట్టి సహనంతో వ్యవహరించడం మంచిది. అలాగే ఈ సమయంలో మీకు బద్ధకం పెరుగుతుంది, ఎనర్జీ తగ్గిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. హనుమాన్ చాలీసాను ప్రతి రోజూ చదివితే మంచి ఫలితాలను చూడవచ్చు.

2.కన్య రాశి:

కన్య రాశి వారికి కూడా ఈ రెండు గ్రహాల వలన ఇబ్బందులు వస్తాయి. ఈ సమయంలో ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. వాదనలు పెరుగుతాయి. భార్యాభర్తల మధ్య చికాకులు ఉంటాయి. ఆర్థిక పరంగా కూడా నష్టపోయే అవకాశం ఉంది. ప్రతిరోజూ యోగా, ధ్యానం చేయడం వలన ప్రశాంతత ఉంటుంది, సంతోషంగా ఉండొచ్చు.

3.మీన రాశి:

మీన రాశి వారికి రెండు గ్రహాల కలయిక వలన మిశ్రమ ఫలితాలు ఎదురవుతాయి. ఈ సమయంలో ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. ఎనర్జీని పెంచుకోవడానికి ధ్యానం చేయండి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. ప్రతి మంగళవారం నాడు ఆంజనేయస్వామిని ఆరాధించండి.

4.వృశ్చిక రాశి:

వృశ్చిక రాశి వారికి రెండు గ్రహాల కలయిక వలన సమస్యలు రావచ్చు. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన ఖర్చులు చేయవద్దు. ప్రేమ జీవితంలో, వైవాహిక జీవితంలో సమస్యలు రావచ్చు. పిల్లలకు కూడా ఇబ్బందులు ఉండొచ్చు. హనుమాన్ చాలీసాను ఉదయం, సాయంత్రం చదివితే శుభ ఫలితాలు కలుగుతాయి.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More