...
...
Next Story

సెప్టెంబర్ తొలి వారంలో ఈ 5 రాశులకు అదృష్టమే అదృష్టం.. డబ్బు, ఉద్యోగం, ప్రమోషన్లు!

సెప్టెంబర్ 1 నుంచి కీలకమైన గ్రహ సంచారాలు చోటుచేసుకోవడంతో కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసిరానుంది. శని-గురువుల కలయికతో నవపంచమ రాజయోగం, బుధుడి కన్యారాశి ప్రవేశం, సెప్టెంబర్ 2న శుక్రుడి తులా రాశి ప్రవేశం వంటి మార్పులు ఈ వారం ఫలితాలను ప్రభావితం చేయనున్నాయి.

Published on: Sep 1, 2026, 09:30:40 IST
Advertisement

ఆకాశంలో మారుతున్న గ్రహాల గమనం మానవ జీవితాలపై, ముఖ్యంగా జాతక చక్రాలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. సెప్టెంబర్ నెల ప్రారంభమే కొన్ని కీలక గ్రహాల సంచారాలతో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. సెప్టెంబర్ 1న శని-గురుల కలయికతో నవపంచమ రాజయోగం ఏర్పడుతుండగా, అదే రోజు గ్రహాల రాకుమారుడైన బుధుడు కన్యారాశిలోకి ప్రవేశిస్తున్నారు. ఇక సెప్టెంబర్ 2న శుక్రుడు తన స్వక్షేత్రమైన తులా రాశిలోకి అడుగుపెట్టనున్నారు.

సెప్టెంబర్ తొలి వారంలో ఈ 5 రాశులకు అదృష్టమే అదృష్టం.. డబ్బు, ఉద్యోగం, ప్రమోషన్లు! (AI)
సెప్టెంబర్ తొలి వారంలో ఈ 5 రాశులకు అదృష్టమే అదృష్టం.. డబ్బు, ఉద్యోగం, ప్రమోషన్లు! (AI)

ఈ వరుస గ్రహ మార్పుల కారణంగా సెప్టెంబర్ మొదటి వారం ద్వాదశ రాశుల వారందరికీ ఎంతో కీలకంగా మారనుంది. ముఖ్యంగా కొన్ని ప్రత్యేక రాశుల వారికి ఈ సమయం ఎటువంటి అడ్డంకులు లేకుండా కెరీర్‌లో అగ్రస్థానానికి చేరేలా, ఆర్థికంగా తిరుగులేని పురోగతి సాధించేలా అద్భుతమైన అవకాశాలను తెచ్చిపెడుతోంది. నిపుణుల విశ్లేషణ ప్రకారం ఆ అదృష్ట రాశుల విశేషాలు ఇక్కడ చూద్దాం.

మేష రాశి:

మేష రాశి వారికి సెప్టెంబర్ తొలి వారం పేరుప్రతిష్టలను, కీర్తి ప్రతిష్టలను తెచ్చిపెడుతుంది. సమాజంలో హోదా మరింత పెరుగుతుంది. అనుకున్న పనులను అనుకున్న సమయానికి పూర్తి చేసి ప్రశంసలు అందుకుంటారు. పెట్టుబడులు పెట్టేందుకు ఇది సరైన సమయం. అదృష్టం తోడు నిలవడంతో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. ఉద్యోగస్తులకు ఎదురుచూస్తున్న ప్రమోషన్లు లేదా హోదాలో మార్పులు లభించే అవకాశం ఉంది. ఉపాధి కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు మంచి శుభవార్త వినపడుతుంది. వ్యాపారస్తులు స్థిరాస్తులు లేదా నూతన వాహనాలు కొనుగోలు చేసే సూచనలున్నాయి.

వృషభ రాశి:

వృషభ రాశి జాతకులకు ఈ వారం ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న శుభవార్తలు అందుతాయి. పోటీ పరీక్షలకు ప్రిపేరవుతున్న విద్యార్థులకు శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. చేసే ప్రయాణాలు విశేషమైన లాభాలను చేకూరుస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నతాధికారుల నుంచి అండదండలు లభిస్తాయి. అయితే, చిన్నపాటి మానసిక ఒత్తిడి లేదా ఆందోళన ఉండే అవకాశం ఉంది. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం మంచిది. సానుకూల దృక్పథంతో ముందుకు వెళ్తే తిరుగు ఉండదు.

కర్కాటక రాశి:

కన్య రాశి వారికి ఈ ఏడాదే అత్యంత అనుకూలమైన సమయాల్లో ఇది ఒకటి. కుటుంబ సభ్యులతో కలిసి చేసే ప్రయాణాలు ఆహ్లాదకరంగా సాగుతాయి. ప్రధాన ఆదాయ వనరులతో పాటు అదనపు ఆదాయ మార్గాలు కూడా ఏర్పడతాయి. కుటుంబంలో పండగ వాతావరణం నెలకొంటుంది. వ్యాపార విస్తరణకు అడుగులు పడతాయి. ఉద్యోగం మారాలని ప్రయత్నించే వారికి ఆఫర్లు తలుపు తడతాయి. బాస్‌ల మన్ననలు పొందడంతో ఆత్మస్థైర్యం పెరుగుతుంది.

ధనుస్సు రాశి:

ధనుస్సు రాశి వారికి విజయాల వారం ఇది. ఆశించిన శుభవార్తలు మనసుకు ఉత్సాహాన్నిస్తాయి. ఆదాయం మెరుగ్గా ఉన్నప్పటికీ, ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉండే అవకాశం ఉంది కాబట్టి ఆర్థిక నిర్వహణపై దృష్టి పెట్టాలి. వ్యాపారస్తులకు లాభాల శాతంలో భారీ పెరుగుదల కనిపిస్తుంది. ఇతరుల మాటలను నమ్మి మోసపోకుండా ఉండటం చాలా ముఖ్యం. కుటుంబంలో నెలకొన్న చిన్నపాటి సమస్యలు సర్దుమణుగుతాయి. నిలిచిపోయిన పనులు ఒక్కొక్కటిగా పూర్తవుతాయి.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe