చాలామంది వాస్తు ప్రకారం పాటిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం అనుసరిస్తే ఇంట్లో శుభ ఫలితాలు కలుగుతాయని, సానుకూల శక్తి కూడా వ్యాపిస్తుందని నమ్ముతారు. ప్రతికూల శక్తికి దూరంగా ఉండవచ్చని భావిస్తారు.

చాలామంది మొక్కల విషయంలో కూడా వాస్తు నియమాలను పాటిస్తూ ఉంటారు. ఇంట్లో కొన్ని మొక్కలు ఉండడం వల్ల సానుకూల శక్తి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అలాగే, కొన్ని మొక్కలు ఇంట్లో ఉంటే అశుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి వస్తుందని, ప్రతికూల శక్తి వల్ల ఇబ్బందులు కలుగుతాయని నమ్ముతారు.
హిందూ ధర్మంలో శమీ వృక్షానికి ఉన్న ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ వృక్షానికి శనిదేవుడు, శివుడితో సంబంధం ఉందని అంటారు. వాస్తు ప్రకారం శమీ వృక్షానికి ప్రత్యేక స్థానం ఉంది. అయితే, శమీ వృక్షం ఇంట్లో ఉండేటప్పుడు కొన్ని నియమాలను కచ్చితంగా పాటించేలా చూసుకోవాలి. మొక్క నాటేటప్పుడు సరైన దిశతో పాటు ముఖ్యమైన విషయాలను కూడా గుర్తుపెట్టుకోవాలి.
ఇంట్లో శమీ మొక్కను ఏ దిశలో నాటితే మంచిది?
ఇంట్లో శమీ మొక్క ఉండడం వల్ల అద్భుతమైన ఫలితాలను చూడొచ్చని నమ్ముతారు. ఈ మొక్కను బాల్కనీలో లేదా టెర్రస్ పైన కూడా నాటవచ్చు. అయితే, ఏ దిశలో నాటుతున్నారనేది ముఖ్యం.
తూర్పు దిశ: వాస్తు శాస్త్రం ప్రకారం చూసినట్లయితే, ఇది ఉత్తమ దిశ. ఈ దిశలో శమీ చెట్టును నాటడం శుభ ఫలితాలను తీసుకువస్తుందని, సానుకూల శక్తి కూడా రెట్టింపు అవుతుందని నమ్ముతారు. అయితే, తగినంత సూర్యరశ్మి ఉండేలా మాత్రం చూసుకోవాలి.
దక్షిణ దిశ: ఇంటి బాల్కనీ లేదా టెర్రస్‌పై ఈ మొక్కను నాటేటప్పుడు దక్షిణ దిశ అనుకూలంగా ఉంటుంది.
ఈశాన్య దిశ: ఈశాన్య దిశలో కూడా శమీ మొక్కను నాటవచ్చు. వాస్తు ప్రకారం, ఈ దిశలో ఈ మొక్క ఉండడం వల్ల ఉత్తమ ఫలితాలను చూడొచ్చని నమ్ముతారు. తగినంత గాలి, సూర్యరశ్మి తగిలేలా మాత్రం చూసుకోవాలి.
{{/usCountry}}ఈశాన్య దిశ: ఈశాన్య దిశలో కూడా శమీ మొక్కను నాటవచ్చు. వాస్తు ప్రకారం, ఈ దిశలో ఈ మొక్క ఉండడం వల్ల ఉత్తమ ఫలితాలను చూడొచ్చని నమ్ముతారు. తగినంత గాలి, సూర్యరశ్మి తగిలేలా మాత్రం చూసుకోవాలి.
{{/usCountry}}మేడ మీద, బాల్కనీలో లేదా ప్రధాన ద్వారం సమీపంలో మొక్కను నాటవచ్చు. మొక్కకు సూర్యరశ్మి తగిలేలా చూసుకోండి. చెట్టు చుట్టూ పరిశుభ్రతను పాటించండి.
శనివారం దీపారాధన చేయండి
శమీ మొక్క దగ్గర శనివారం నాడు దీపారాధన చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలను చూడొచ్చని నమ్ముతారు. దీపారాధన చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఏలినాటి శని, అర్ధాష్టమ శని ఉన్నవారు కూడా ఈ పరిహారాన్ని పాటిస్తే మంచిదని భావిస్తారు. శనిదేవుని అనుగ్రహం కలిగి, శని దోషాల నుంచి బయటపడడానికి వీలవుతుందని నమ్ముతారు.
శమీ ఆకులను సమర్పించండి
శివుడికి శమీ ఆకులను సమర్పిస్తే ఉత్తమ ఫలితాలను చూడొచ్చని నమ్ముతారు. అలాగే, కుటుంబ బంధాలు దృఢంగా మారతాయని విశ్వసిస్తారు. సుఖ సంతోషాలు, ఐశ్వర్యం కలగడానికి కూడా వీలవుతుందని భావిస్తారు.