చాలామంది శని పేరు చెప్తే భయపడిపోతారు. కానీ శని మనం చేసే పనులను బట్టి ఫలితాలను ఇస్తాడు. మంచి చేసిన వారికి మంచి ఫలితాలను, చెడు చేసిన వారికి చెడు ఫలితాలను అందిస్తాడు. శనివారం శని మహారాజుకి ఎంతో ఇష్టమైన రోజు. ఈ రోజున దేవుని ప్రసన్నం చేసుకోవడానికి భక్తులు వివిధ పూజలు, పరిహారాలను పాటిస్తూ ఉంటారు.

ఏలినాటి శని, అర్ధాష్టమ శని వంటి ప్రభావాల నుంచి బయట పడడానికి శనివారం ప్రత్యేక పూజలు చేస్తారు. మతపరమైన విశ్వాసాల ప్రకారం, శనివారం నాడు శని దేవుని శాస్త్రోక్తంగా పూజించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే శనికి ఇష్టమైన పూలను కూడా శనివారం నాడు సమర్పించడం మంచిదేనా? దేవుడికి ఇష్టమైన పూల గురించి ఎప్పుడూ తెలుసుకుందాం.
శని దేవుడికి ఈ పూలంటే మహా ప్రీతికరం.. వీటిని శనివారం నాడు సమర్పించండి
అపరాజిత పూలు
శని దేవుడికి ఎంతో ఇష్టమైన ఈ పువ్వులను కచ్చితంగా శనివారం సమర్పించండి. ఈ నీలిరంగు పువ్వుని శనిదేవుడికి సమర్పించడం వలన శని దేవుడు ప్రసన్నమవుతాడు. శనివారం లేదా శని జయంతి వంటి ప్రత్యేక దినాల్లో శనిదేవుడికి 5, 7 లేదా 11 అపరాజిత పూలను సమర్పించండి. శని అనుగ్రహం కలుగుతుంది.
మందార పూలు
మందార పూలు కూడా శని దేవుడికి ఎంతో ప్రీతికరమైనవిగా భావిస్తారు. శనివారం నాడు శని దేవుడికి మందారం పూలను కచ్చితంగా సమర్పించండి. శని దోషం నుంచి ఉపశమనం కలిగి సంతోషంగా ఉండొచ్చు. మందారం పూలు సాధారణంగా ఎరుపు రంగులో ఉంటాయి. వీటిని అనేక దేవతామూర్తులకు సమర్పిస్తారు. శనిదేవుడికి కూడా మందార పూలను సమర్పించండి. గ్రహ శాంతి కూడా కలుగుతుంది. పూజతో పాటు సంయమనం, దానం, సేవ, సాయం చేయడం వంటివి కూడా పాటించండి.
శమీ పూలు
శనిదేవుడికి శమి పూలను కూడా సమర్పించడం మంచిదే. అలాగే శమి ఆకులు, శమి వేర్లను కూడా సమర్పిస్తూ ఉంటారు. వీటిని సమర్పించడం వలన శని బాధల నుంచి బయటపడే, శని అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది. కష్టాల నుంచి బయటపడొచ్చు. ఆర్థిక పరిస్థితి కూడా బాగుంటుంది.
శమి వృక్షానికి శని దేవుడితో ప్రత్యేక సంబంధం
{{/usCountry}}శనిదేవుడికి శమి పూలను కూడా సమర్పించడం మంచిదే. అలాగే శమి ఆకులు, శమి వేర్లను కూడా సమర్పిస్తూ ఉంటారు. వీటిని సమర్పించడం వలన శని బాధల నుంచి బయటపడే, శని అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది. కష్టాల నుంచి బయటపడొచ్చు. ఆర్థిక పరిస్థితి కూడా బాగుంటుంది.
శమి వృక్షానికి శని దేవుడితో ప్రత్యేక సంబంధం
{{/usCountry}}శమి వృక్షానికి శని దేవుడితో ప్రత్యేక సంబంధం ఉంటుంది. కాబట్టి పూజించండి. దాని ఆకులను దేవుడికి సమర్పించండి. శమి చెట్టు కింద దీపారాధన చేయండి. దీంతో మంచి ఫలితాలను పొందవచ్చు. ప్రతికూల ప్రభావాల నుంచి కూడా బయటపడడానికి వీలవుతుంది.
జిల్లేడు పూలు
శనిదేవుడికి జిల్లేడు పూలను కూడా సమర్పించొచ్చు. వీటిని సమర్పించడం వలన మంచి ఫలితాలను చూడచ్చు. శివుడితో కూడా జిల్లేడు పూలతో సంబంధం ఉంటుంది. కాబట్టి శివుడికి కూడా ఈ పూలను సమర్పించవచ్చు.