శని జయంతి నాడు ఈ మూడు రాశులకు ఊహించని లాభాలు.. అందమైన ప్రేమ జీవితం, డబ్బు, ఇల్లు, వాహనాలు ఇలా ఎన్నో!
మే 16న శని జయంతి సందర్భంగా వృషభరాశిలో బుధాదిత్య రాజయోగం ఏర్పడబోతోంది. ఈ అరుదైన గ్రహ గమనం కారణంగా వృషభ, మకర, సింహ రాశుల వారికి అదృష్టం వరించనుంది. దీనికి సంబంధించిన పూర్తి జ్యోతిష్య విశ్లేషణ ఇక్కడ చదవండి.
ఈ ఏడాది శనిజయంతి మే 16, అనగా రేపు వచ్చింది. శని జయంతి నాడు గ్రహాల సంచారంలో మార్పు రాబోతోంది. దీంతో కొన్ని రాశుల వారికి విపరీతంగా కలిసి రాబోతోంది. శని జయంతి నాడు గ్రహాలకు రాజు సూర్యుడు, గ్రహాల యువరాజు బుధుడు సంయోగం చెందుతారు. ఈ రెండు గ్రహాల కలయిక వలన వృషభరాశిలో బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది.

బుధాదిత్య రాజయోగం
శని జయంతి వేళ బుధాదిత్య రాజయోగం ఏర్పడడం వలన 12 రాశుల వారి జీవితంలో అనేక మార్పులు వస్తాయి. కానీ కొన్ని రాశుల వారు మాత్రం విపరీతంగా లాభాలను పొందుతారు. మరి అదృష్ట రాశులు ఎవరో, వీరిలో మీరు ఒకరేమో చూసుకోండి.
శని జయంతి వేళ ఈ రాశులకు వారికి కలిసి రానున్న కాలం.. అదృష్టం, డబ్బుతో పాటు అనేక ప్రయోజనాలు
1.వృషభ రాశి
వృషభ రాశి వారికి శని జయంతి వేళ శుభ ఫలితాలు కలగబోతున్నాయి. బుధాదిత్య రాజయోగం ఏర్పడంతో ఎప్పటి నుంచో పూర్తి కాని పనులు సక్రమంగా పూర్తవుతాయి. వ్యాపారస్తులకు కూడా ఇది శుభ సమయం. శుభ ఫలితాలను పొందుతారు.
ఆర్థికంగా లాభాలను చూస్తారు. సేవింగ్స్ ఎక్కువగా చేస్తారు. మీ ప్రేమ జీవితం మధురంగా మారుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొత్త ఇల్లు లేదా వాహనం కోసం కలలు కంటున్న వారి కలలు నిజమవుతాయి. ప్రయాణాలు కూడా విజయవంతంగా పూర్తవుతాయి.
2.మకర రాశి
మకర రాశి వారికి ఈ శని జయంతి శుభ ఫలితాలను తీసుకు వస్తుంది. ఈ రాశి వారు ప్రేమ జీవితంలో చక్కటి మార్పులను చూస్తారు. మీ మాట ఇతరులను ప్రభావితం చేస్తుంది. కొత్త పనిని మొదలు పెట్టడానికి కూడా ఇదే శుభ సమయం.
శనిజయంతి వేళ కాంపిటేటివ్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారికి కూడా ఇది శుభ సమయం. ఈ రాశి వారు మానసిక ప్రశాంతతను కూడా పొందుతారు. మతపరమైన కార్యక్రమాల్లో ఆసక్తి చూపిస్తారు. ఈ రాశి వారికి నాయకత్వ లక్షణాలు కూడా పెరుగుతాయి. అన్ని విధాలుగా మంచి మార్పులను చూస్తారు.
3.సింహ రాశి
సింహ రాశి వారికి శని జయంతి బాగా కలిసి వస్తుంది. కష్టానికి ఫలితం చూస్తారు. జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి. అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది. విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి. ఉద్యోగస్తుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
కొత్త బాధ్యతలను చేపడతారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. పాత టాస్కులను కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. వివిధ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


