ఆస్ట్రాలజీ ప్రకారం నవగ్రహాల్లో న్యాయాధిపతిగా, కర్మఫల దాతగా భావించే శని దేవుని కదలికలకు జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. మనుషులు చేసే పనులు, కష్టపడే తత్వాన్ని బట్టి ఫలితాలను ఇచ్చే శని దేవుడు త్వరలోనే తన నక్షత్ర గమనాన్ని మార్చుకోబోతున్నాడు. ప్రస్తుతం రేవతి నక్షత్రంలో సంచరిస్తున్న శని భగవానుడు, త్వరలోనే తన సొంత నక్షత్రమైన ఉత్తరాభాద్రపద (ఉత్తరాభాద్ర) నక్షత్రంలోకి ప్రవేశించనున్నారు.

హిందూ పంచాంగం ప్రకారం…. రాబోయే అక్టోబర్ 9వ తేదీ రాత్రి 07:28 గంటలకు శని దేవుడు రేవతి నక్షత్రం నుంచి ఉత్తరాభాద్రపద నక్షత్రంలోకి అడుగుపెడతారు. ఉత్తరాభాద్రపద నక్షత్రానికి అధిపతి స్వయంగా శని దేవే కావడం ఇక్కడ విశేషం. ఈ సంవత్సరం ముగిసే వరకు, అంటే దాదాపు 83 రోజుల పాటు శని భగవానుడు తన సొంత నక్షత్రంలోనే కొనసాగుతాడు.
ప్రముఖ జ్యోతిష్య నిపుణులు పండిట్ నరేంద్ర ఉపాధ్యాయ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ 83 రోజుల కాలంలో శని నక్షత్ర సంచారం మొత్తం 12 రాశులపైనా ప్రభావం చూపినప్పటికీ, ప్రత్యేకంగా 5 రాశుల జాతకులకు మాత్రం బంగారం లాంటి భవిష్యత్తును, అపారమైన సంపదను అందించబోతోంది.
మిథున రాశి:
శని దేవుని నక్షత్ర మార్పు మిథున రాశి వారికి ఎంతో మేలు చేస్తుంది. వ్యాపారం, ఉద్యోగాల్లో మీరు చేపట్టే ప్రతి పనిలోనూ అద్భుత విజయం సాధిస్తారు. అనుకోని మార్గాల ద్వారా ఆర్థిక లాభాలు పొందే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దీర్ఘకాలంగా నిలిచిపోయిన పనులు వేగవంతమవుతాయి.
తులారాశి:
తులారాశి వారికి శని సంచారం అత్యంత అనుకూల ఫలితాలను ఇస్తుంది. వీరు కొద్దిగా కష్టపడినా ఊహించని స్థాయిలో మంచి ఫలితాలు లభిస్తాయి. గత కొంతకాలంగా వేధిస్తున్న ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభించి, ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.
మకర రాశి:
శని నక్షత్ర పరివర్తనం మకర రాశి వారికి శుభయోగాలను మోసుకొస్తుంది. ఆర్థికంగా బలోపేతమయ్యే సూచనలు ఉన్నాయి. విదేశాలకు వెళ్లాలని ప్రయత్నిస్తున్న వారికి అనుకూల సమయం లభిస్తుంది. అయితే మీ ఆరోగ్యం పట్ల కొద్దిగా శ్రద్ధ వహించడం మంచిది.
కన్యారాశి:
{{/usCountry}}శని నక్షత్ర పరివర్తనం మకర రాశి వారికి శుభయోగాలను మోసుకొస్తుంది. ఆర్థికంగా బలోపేతమయ్యే సూచనలు ఉన్నాయి. విదేశాలకు వెళ్లాలని ప్రయత్నిస్తున్న వారికి అనుకూల సమయం లభిస్తుంది. అయితే మీ ఆరోగ్యం పట్ల కొద్దిగా శ్రద్ధ వహించడం మంచిది.
కన్యారాశి:
{{/usCountry}}కన్యారాశి జాతకులకు శని దేవుని కృప వల్ల అద్భుతమైన సమయం ప్రారంభమవుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా సమయాన్ని గడుపుతారు. వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు పడ్డ కష్టానికి తగిన ఫలితాలు అందుకొని విజయం సాధిస్తారు.
వృషభ రాశి:
వృషభ రాశి వారికి శని నక్షత్ర సంచారం సానుకూల మార్పులను తీసుకొస్తుంది. గత కొంతకాలంగా వెంటాడుతున్న ఆర్థిక ఇబ్బందులు, అప్పుల సమస్యలు క్రమంగా తొలగిపోతాయి. ఆదాయ మార్గాలు పెరిగి ఆర్థికంగా నిలదొక్కుకుంటారు.