మీన రాశిలో శని సంచారం - ఈ 3 రాశులకు మలుపు తిరగనున్న కాలం..!
2026 శని సాడే సతి ప్రభావంతో కుంభం, మీనం, మేష రాశుల జీవితాల్లో కీలక మార్పులు రానున్నాయి. ఏ రాశికి ఉపశమనం లభిస్తుంది..? ఎవరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సమగ్రంగా తెలుసుకోండి.
వేద జ్యోతిష్య శాస్త్రంలో శని దేవుడి గోచారానికి, ముఖ్యంగా 'సాడే సతి' కాలానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. సాధారణంగా సాడే సతి అనగానే ప్రతి ఒక్కరిలో ఒక రకమైన భయం, ఆందోళన కనిపిస్తాయి. అయితే జ్యోతిష్య పండితులు మాత్రం దీనిని పూర్తిగా అశుభ కాలంగా భావించకూడదని స్పష్టం చేస్తున్నారు. సాడే సతి అనేది మనిషికి జీవిత సత్యాలను నేర్పించే ఒక పాఠం వంటిది. కష్టపడి పనిచేయడం, క్రమశిక్షణతో మెలగడం, సహనం వహించడం వంటి మహత్తర గుణాలను శని దేవుడు ఈ సమయంలోనే అలవాటు చేస్తారు. అనేకమంది తమ కెరీర్‌లో అత్యున్నత శిఖరాలను చేరుకోవడం, ఆర్థికంగా బలాన్ని పుంజుకోవడం, సమాజంలో కొత్త గుర్తింపు సాధించడం కూడా ఈ సాడే సతి కాలంలోనే జరుగుతుందని విశ్లేషిస్తున్నారు.

ప్రస్తుతం శని దేవుడు మీన రాశిలో సంచరిస్తున్న నేపథ్యంలో... కుంభం, మీనం, మేష రాశుల వారు సాడే సతిలోని వేర్వేరు దశలను ఎదుర్కొంటున్నారు. ఏ రాశిపై ఎలాంటి ప్రభావం ఉండబోతోందో ఇక్కడ తెలుసుకోండి…..
కుంభ రాశి :
కుంభ రాశి వారికి ప్రస్తుతం సాడే సతి చివరి దశ (మూడో దశ) నడుస్తోంది. ఇన్నాళ్లూ ఎదుర్కొన్న సవాళ్లు, మానసిక ఒత్తిళ్లు ఇప్పుడు క్రమంగా తొలగిపోతాయి. మీరు పడిన కష్టానికి తగిన ప్రతిఫలం లభించే సమయం ఆసన్నమైంది. ఉద్యోగం, వ్యాపార రంగాల్లో పరిస్థితులు గతంలో కంటే చాలా మెరుగ్గా మారతాయి. అయితే ఎలాంటి ఆతురుతకూ లోనుకాకుండా, పెద్ద నిర్ణయాలు తీసుకునేటప్పుడు కాస్త ఆలోచించి ముందడుగు వేయడం మంచిది.
మీన రాశి :
మీన రాశి వారికి సాడే సతిలో అత్యంత కీలకమైన రెండో దశ నడుస్తోంది. జ్యోతిష్య ప్రకారం ఈ దశ కాస్త తీవ్రమైన ప్రభావ చూపిస్తుంది. పని ప్రదేశంలో ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాల్లో అడుగడుగునా వివేచనాత్మకంగా వ్యవహరించాల్సి ఉంటుంది. అనవసరమైన నష్టాలు రాకుండా చూసుకోవాలి. ధైర్యం, ఓపిక కోల్పోకుండా నిరంతరం శ్రమించే వారికి శని దేవుడు తప్పకుండా శుభ ఫలితాలనే అందిస్తారు.
మేష రాశి :
మేష రాశి వారికి సాడే సతి తొలి దశ ప్రారంభమైంది. ఈ సమయంలో ఏదైనా కొత్త పని లేదా ప్రాజెక్ట్ ప్రారంభించే ముందు పక్కా ప్రణాళికతో ముందుకు సాగడం అత్యంత ఆవశ్యకం. రాబోయే రోజుల్లో ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నందున, బడ్జెట్ పరిమితులను పాటిస్తే మంచిది. కుటుంబంలోనూ, ఆఫీసులోనూ సంయమనంతో వ్యవహరిస్తే అనేక అనవసర సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు.
ఉపశమనం ఎప్పుడు…?
సాడే సతి బాధల నుంచి ఉపశమనం లభించే సమయం అందరికీ ఒకేలా ఉండదు. వ్యక్తిగత జన్మకుండలి, జాతకంలో శని దేవుడి స్థానం, ప్రస్తుతం నడుస్తున్న మహాదశ, అంతర్దశలపై ఇది ఆధారపడి ఉంటుంది. అయినప్పటికీ, రాబోయే గోచార మార్పుల్లో శని దేవుడు ముందడుగు వేసే కొద్దీ... మొదటగా కుంభ రాశి వారికి సాడే సతి నుంచి పూర్తిగా విముక్తి లభిస్తుంది. ఆ తర్వాత వరుసగా రాబోయే సంవత్సరాల్లో మీన రాశి, మేష రాశి వారు కూడా ఈ ప్రభావం నుంచి బయటపడతారు.
పాటించాల్సిన జాగ్రత్తలు, పరిహారాలు:
- ఎంతటి కష్టమైన పరిస్థితి ఎదురైనా స్వయంకృషినే నమ్ముకోవాలి. పని నుంచి వెనకడుగు వేయకూడదు.
- ఎవరినీ మోసం చేయడం గానీ, ఇతరు పట్ల దారుణంగా ప్రవర్తించడం గానీ చేయవద్దు.
- అనవసరమైన అప్పులు లేదా రుణాలు తీసుకోకుండా జాగ్రత్త పడటం శ్రేయస్కరం.
- ప్రతి శనివారం పేదలకు, అవసరంలో ఉన్నవారికి తోచిన సహాయం అందించడం మంచిది.
- శనిదేవుని ఆలయంలో ఆవనూనెతో దీపం వెలిగించడం వల్ల ఉపశమనం కలుగుతుంది.
- ప్రతిరోజూ లేదా శనివారాల్లో హనుమాన్ చాలీసా, శని స్తోత్రం పఠించడం వల్ల శని దోష తీవ్రత తగ్గుతుంది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

