...
...
Next Story

శని సంచారం ఈ 3 రాశులకు మంచి రోజులు.. 5 నెలల పాటు డబ్బు, ఆనందం, విజయాలతో పాటు ఎన్నో!

మే 17న శని నక్షత్ర సంచారం జరగనుంది. ఉత్తరాభాద్రపద నక్షత్రం నుంచి రేవతి నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. అక్టోబర్ 17 వరకు అదే రాశిలో ఉంటాడు. ఈ ఐదు నెలలు కొన్ని రాశుల వారికి శుభఫలితాలు కలగబోతున్నాయి. శని రేవతి నక్షత్రంలోకి అడుగుపెట్టడంతో కొన్ని రాశుల వారు ఊహించని విధంగా లాభాలు పొందుతారు.

Published on: Feb 11, 2026, 10:00:38 IST
Advertisement

గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. అలాగే నక్షత్రాలను కూడా మారుస్తూ ఉంటాయి. శని దేవుడు న్యాయదేవుడు. మనం చేసే పనులను బట్టి ఫలితాలను ఇస్తాడు. జ్యోతిష్యంలో శని కర్మఫలదాతగా, న్యాయాధిపతిగా పరిగణించబడతాడు. సూర్యభగవానుడి పుత్రుడు శని, మకర రాశి మరియు కుంభ రాశులకు అధిపతి.

శని నక్షత్ర సంచారంలో మార్పు.. ఐదు రాశుల వారికి ఊహించని లాభాలు (pinterest)
శని నక్షత్ర సంచారంలో మార్పు.. ఐదు రాశుల వారికి ఊహించని లాభాలు (pinterest)

శని ప్రభావం కారణంగా జీవితంలో కఠిన శ్రమ, సవాళ్లు, క్రమశిక్షణ వంటివి ఎదురవుతాయి. ఏలినాటి శని, శనిదోషాలు జాతకంలో ఎంతో తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయి. శని చాలా నెమ్మదిగా కదిలే గ్రహం. ప్రస్తుతం మీనరాశిలో శని సంచారం చేస్తున్నాడు.

శని సంచారం

2027 వరకు శని ఇదే రాశిలో తన సంచారాన్ని చేస్తాడు. అయితే మే 17న శని నక్షత్ర సంచారం జరగనుంది. ఉత్తరాభాద్రపద నక్షత్రం నుంచి రేవతి నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. అక్టోబర్ 17 వరకు అదే రాశిలో ఉంటాడు. ఈ ఐదు నెలలు కొన్ని రాశుల వారికి శుభఫలితాలు కలగబోతున్నాయి.

శని రేవతి నక్షత్రంలోకి అడుగుపెట్టడంతో కొన్ని రాశుల వారు ఊహించని విధంగా లాభాలు పొందుతారు. కెరీర్‌లో సక్సెస్‌ను అందుకుంటారు. ఆర్థికపరంగా బాగుంటుంది. శుభవార్తలు వింటారు. ఆదాయం పెరుగుతుంది. మరి ఈ శని నక్షత్ర సంచారంతో ఏ రాశుల వారికి బాగా కలిసి రాబోతోంది? ఎవరు ఎలాంటి లాభాలను పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం.

శని నక్షత్ర సంచారంలో మార్పు.. ఐదు రాశుల వారికి ఊహించని లాభాలు

1.సింహ రాశి:

సింహ రాశి వారికి ఇది శుభ ఫలితాలను తీసుకొస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారి ఒత్తిడి తగ్గిపోతుంది. వ్యాపారస్తులకు కూడా బాగా కలిసి వస్తుంది. భాగస్వామి నుంచి సర్‌ప్రైజ్ బహుమతిని పొందుతారు. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా ఇది శుభ సమయం. చాలా రోజులుగా పడుతున్న శ్రమకు తగ్గ ఫలితాలను చూస్తారు. విద్యార్థులు పరీక్షల్లో ఉత్తీర్ణులవుతారు.

2.ధనస్సు రాశి:

ఈ రాశి వారు ఐదు నెలల పాటు అద్భుతమైన లాభాలను పొందుతారు. పెండింగ్‌లో ఉన్న పనులన్నీ పూర్తి అవుతాయి. కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. సోదరుల నుంచి ప్రేమ లభిస్తుంది. ఆనందంగా ఉంటారు. విదేశీ ప్రయాణాలు చేయాలనుకునే వారికి కూడా ఇది శుభ సమయం. శని అనుగ్రహంతో పెండింగ్‌లో ఉన్న పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks