చాలామంది రకరకాల సమస్యలతో బాధపడుతుంటారు. సమస్యల నుంచి బయటపడడానికి రకరకాల పరిహారాలను కూడా పాటిస్తూ ఉంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పదేపదే సమస్యలు ఎదురవుతున్నట్లయితే చాలామంది శని ప్రభావం గురించి ఆలోచిస్తారు. శని మనం చేసే పనులను బట్టి ఫలితాలు ఇస్తాడు. మంచి పనులకు మంచి ఫలితాలు, చెడు పనులకు చెడు ఫలితాలు ఎదురవుతాయి. అలాగే ఏలినాటి శని ప్రభావం వల్ల కూడా చాలామంది ఇబ్బందులను ఎదుర్కొంటారు.

జ్యోతిష్యం ప్రకారం జూన్ 27 చాలా ప్రత్యేకమైన రోజు. ఈరోజు శని త్రయోదశి రావడం వల్ల శని ప్రభావంలో ఉన్న ఐదు రాశుల వారికి విశేష ప్రాధాన్యత సంతరించుకుంది. ఈరోజు శని త్రయోదశి వేళ ఏ రాశుల వారికి శుభాలు కలుగబోతున్నాయి? ఎవరికి ఎక్కువగా ప్రయోజనాలు కలుగుతాయి? ఇప్పుడు తెలుసుకుందాం.
చాలా ప్రత్యేకమైన శని త్రయోదశి
జ్యేష్ఠ మాసంలో శుక్లపక్ష త్రయోదశి శనివారం రోజు రావడంతో శని త్రయోదశిని జరుపుకుంటాము. శని త్రయోదశి నాడు శని దేవునిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తే ఎన్నో శుభ ఫలితాలను పొందడానికి వీలవుతుందని చెబుతారు. ప్రస్తుతం మూడు రాశుల వారికి ఏలినాటి శని, మరో రెండు రాశులకు అర్ధాష్టమ శని నడుస్తోంది. అందువల్ల ఈ ఐదు రాశుల వారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.
1.మేష రాశి
మేష రాశి వారు శని ప్రభావం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లయితే ఈ శని త్రయోదశిని సద్వినియోగం చేసుకోవడం మంచిది. ఈ కింది పరిహారాలను పాటిస్తే మీకు మంచి ఫలితాలు ఎదురవుతాయి. కెరీర్, వ్యాపారంలో ఎక్కువ శ్రమ పడాల్సి వస్తున్నా, ఫలితాలు ఆలస్యంగా వస్తున్నా, అపార్థాలు ఎదురవుతున్నా ఓర్పుతో వ్యవహరించడం మంచిది. ఈరోజు మీకు శుభ ఫలితాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి శని పరిహారాలను పాటించండి.
2.సింహ రాశి
సింహ రాశి వారు శని ప్రభావంలో ఉన్నారు. కాబట్టి మానసిక ఒత్తిడి, ఆత్మవిశ్వాసం తగ్గడం లాంటివి ఎదురవుతాయి. అలాంటప్పుడు శని దేవుడికి సంబంధించిన పరిహారాలను పాటించడం మంచిది. ఉద్యోగ ఒత్తిడి, అనారోగ్య సమస్యల నుంచి కూడా బయటపడడానికి ఇది అద్భుతమైన అవకాశం. ఈ రాశి వారు క్రమశిక్షణతో ఉండడం, అవసరమైన వారికి సాయం చేయడం వంటివి శుభ ఫలితాలను ఇస్తాయి.
3.ధనుస్సు రాశి
{{/usCountry}}సింహ రాశి వారు శని ప్రభావంలో ఉన్నారు. కాబట్టి మానసిక ఒత్తిడి, ఆత్మవిశ్వాసం తగ్గడం లాంటివి ఎదురవుతాయి. అలాంటప్పుడు శని దేవుడికి సంబంధించిన పరిహారాలను పాటించడం మంచిది. ఉద్యోగ ఒత్తిడి, అనారోగ్య సమస్యల నుంచి కూడా బయటపడడానికి ఇది అద్భుతమైన అవకాశం. ఈ రాశి వారు క్రమశిక్షణతో ఉండడం, అవసరమైన వారికి సాయం చేయడం వంటివి శుభ ఫలితాలను ఇస్తాయి.
3.ధనుస్సు రాశి
{{/usCountry}}ధనుస్సు రాశి వారికి శని ప్రభావం వల్ల అనుకోని ఖర్చులు పెరుగుతాయి. పనుల్లో ఆటంకాలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. ఆందోళన, అస్థిరత కూడా ఉండొచ్చు. ఈ సమయంలో ఓర్పుతో ఉండాలి. దైవభక్తి కూడా ముఖ్యం.
4.కుంభ రాశి
కుంభ రాశి వారికి శని ప్రభావం వల్ల ఎంత కష్టపడినా పనులు ఆలస్యంగా పూర్తవడం, నిర్ణయాల్లో అయోమయం, జీవితంలో ఒడిదుడుకులు వంటివి ఉండొచ్చు. అలాంటప్పుడు క్రమశిక్షణతో ఉండాలి. సహాయం చేసే అలవాటును పెంచుకోవాలి. అలాగే ఈ శని త్రయోదశి నాడు కింద ఉన్న పరిహారాలను పాటిస్తే మంచిది.
5.మీన రాశి
మీన రాశి వారికి కూడా శని ప్రభావం ఉంది. ఆర్థిక విషయాల్లో ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. అందుకోసం ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు వంటివి చేస్తే మంచిది.
శని దోష నివారణకు ఈ పరిహారాలను పాటించండి
- శని త్రయోదశి సాయంత్రం శని దేవుని ఆలయానికి వెళ్లి ఆవాల నూనెను సమర్పించండి.
- నూనె సమర్పించేటప్పుడు శని దేవుడి కళ్లల్లో కాకుండా పాదాల వైపు చూడాలి.
- "ఓం శనైశ్చరాయ నమః" మంత్రాన్ని జపిస్తూ ఏడు లేదా 11 ప్రదక్షిణలు చేయండి.
- రావి చెట్టు కింద ఆవాల నూనెతో దీపాన్ని వెలిగిస్తే కూడా మంచి ఫలితం ఉంటుంది.
- హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే కూడా శని అనుగ్రహాన్ని పొందవచ్చు.
- నల్ల నువ్వులు, నల్ల మినుములు, ఇనుప పాత్రలు, నల్ల బట్టలు వంటివి దానం చేస్తే కూడా ఈ రాశుల వారికి బాగా కలిసొస్తుంది.
- తీవ్రమైన శని దోషంతో బాధపడుతున్నట్లయితే శివలింగానికి నీళ్లు, నల్ల నువ్వులను సమర్పించి మహా మృత్యుంజయ మంత్రాన్ని 108 సార్లు జపించండి.