గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను, నక్షత్రాలను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వస్తే అది అన్ని రాశుల వారిపై ప్రభావాన్ని చూపిస్తుంది. ఒక్కోసారి గ్రహాల కారణంగా శుభ ఫలితాలు కలిగితే, ఒక్కోసారి అశుభ ఫలితాలను చూడాల్సి ఉంటుంది.

రేపు శరద్ పౌర్ణమి. ఈ పౌర్ణమి వేళ కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి రాబోతోంది. కొన్ని గ్రహాల సంచారంలో మార్పు వలన ఈ శరద్ పూర్ణిమ నాడు కొన్ని రాశుల వారు భారీగా లాభాలను పొందుతారు. అక్టోబర్ 25, ఆదివారం నాడు వస్తున్న ఈ పౌర్ణమి కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని మోసుకొస్తుంది.
రేవతి నక్షత్రం, హర్షణ యోగం కలవనున్నాయి. దీంతో ఈ పౌర్ణమికి కొన్ని రాశుల వారికి బాగా కలిసి రాబోతోంది. అలాగే, తులా రాశిలో సూర్యుడు, బుధుడు, శుక్రుడు సంచరించడంతో త్రిగ్రహ యోగం కూడా ఏర్పడింది. ఈ గ్రహాల కారణంగా ఈ రాశుల వారు చక్కటి మార్పులను చూడొచ్చు. మరి ఆ అదృష్ట రాశులు ఎవరు? ఈ రాశుల్లో మీరు ఒకరేమో చూసుకోండి.
శరద్ పూర్ణిమ వేళ ఈ రాశుల వారికి విపరీతమైన లాభాలు! అదృష్ట రాశుల్లో మీరు ఉన్నారా?
1.మకర రాశి
మకర రాశి వారికి పౌర్ణమి అదృష్టాన్ని తీసుకురాబోతోంది. ప్రయోజనకరంగా ఉంటుంది. అదృష్టం తోడవడంతో పెండింగ్‌గా ఉన్న టాస్కులన్నింటినీ విజయవంతంగా పూర్తి చేస్తారు. అలాగే, ఉద్యోగులు, వ్యాపారులు ఫలితాలను చూస్తారు.
వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. పెళ్లి ఫిక్స్ అవుతుంది. ముఖ్యమైన శుభవార్తలను వింటారు. కుటుంబంలో ప్రశాంతత, సంతోషం ఉంటాయి. లక్ష్యాలను సాధించడానికి ఈ సమయం మీకు బాగా ఉపయోగపడుతుంది. ప్రేమ భాగస్వామితో అనుబంధం దృఢంగా ఉంటుంది.
2.కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి పౌర్ణమి అనేక విధాలుగా కలిసి వస్తుంది. ఆర్థికపరమైన లాభాలను కూడా చూస్తారు. మానసిక ప్రశాంతత, సానుకూలత పెరుగుతాయి. ఎప్పటి నుంచో పూర్తికాని పనులను ఈ సమయంలో విజయవంతంగా పూర్తి చేస్తారు.
కష్టానికి తగ్గ ఫలితం ఉంటుంది. వ్యాపారస్తులు విజయాలను అందుకుంటారు. ఆర్థికపరంగా కూడా ప్రయోజనాలు ఉంటాయి. సమస్యలు సులువుగా పరిష్కారమవుతాయి. ఉద్యోగులు ఆఫీసులో బాగా రాణిస్తారు. ఆదాయం కూడా పెరుగుతుంది.
3.కన్యా రాశి
{{/usCountry}}కష్టానికి తగ్గ ఫలితం ఉంటుంది. వ్యాపారస్తులు విజయాలను అందుకుంటారు. ఆర్థికపరంగా కూడా ప్రయోజనాలు ఉంటాయి. సమస్యలు సులువుగా పరిష్కారమవుతాయి. ఉద్యోగులు ఆఫీసులో బాగా రాణిస్తారు. ఆదాయం కూడా పెరుగుతుంది.
3.కన్యా రాశి
{{/usCountry}}కన్యా రాశి వారికి ఈ పౌర్ణమి అనేక విధాలుగా కలిసి వస్తుంది. జీవితంలో కొన్ని ముఖ్యమైన విషయాల్లో సానుకూల మార్పులను చూస్తారు. ప్రయత్నాల్లో విజయాన్ని అందుకుంటారు. సామాజిక రంగంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.
కుటుంబంలో ప్రశాంతత, సంతోషం పెరుగుతాయి. ఉద్యోగస్తులు కష్టానికి తగ్గ గుర్తింపును చూస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కెరీర్లో పురోగతి ఉంటుంది. ఇలా అనేక విధాలుగా ఈ రాశి వారికి కూడా కలిసి వస్తుంది.