...
...
Next Story

శివ పురాణం: శివరాత్రి నాడు ఈ 5 పాటిస్తే మహాలక్ష్మీ అనుగ్రహం, అక్షయ పుణ్య ప్రాప్తి కలుగుతాయి!

శివరాత్రి నాడు కొన్ని పరిహారాలను పాటిస్తే శివుడు మిక్కిలి సంతోషిస్తాడు. శివరాత్రి నాడు శివుడిని ఆరాధించి, ఉపవాసం ఉండి, సాయంత్రం జాగరణ చేస్తే అద్భుతమైన ఫలితాలను చూడొచ్చు. ధనప్రాప్తి కలగడానికి, ఉద్యోగం లేదా వ్యాపారంలో పురోగతి, పదోన్నతులు కలగడానికి ఏం చేయాలి, ఎలాంటి పరిహారాలను పాటించాలో తెలుసుకుందాం.

Published on: Feb 12, 2026, 12:00:58 IST
Advertisement

ప్రతి ఒక్కరు ఆనందంగా ఉండాలని, మంచి ఫలితాలు కలగాలని, చేపట్టిన పనుల్లో ఆటంకాలు కలగకుండా ఉండాలని భగవంతుని ఆరాధిస్తారు. శివరాత్రి చాలా విశేషమైన రోజు. హిందూ ధర్మం ప్రకారం శివరాత్రి చాలా ముఖ్యమైన పండుగ. శివుడిని ఆ రోజు ఆరాధించడం వలన శివ అనుగ్రహాన్ని పొందడానికి వీలవుతుంది. భక్తిశ్రద్ధలతో ఒక పువ్వు సమర్పించినా కూడా శివుని అనుగ్రహాన్ని పొందడానికి వీలవుతుంది.

శివరాత్రి 2026

శివ పురాణం: శివరాత్రి నాడు ఈ 5 పాటిస్తే మహాలక్ష్మీ అనుగ్రహం, అక్షయ పుణ్య ప్రాప్తి (pinterest)
శివ పురాణం: శివరాత్రి నాడు ఈ 5 పాటిస్తే మహాలక్ష్మీ అనుగ్రహం, అక్షయ పుణ్య ప్రాప్తి (pinterest)

శివరాత్రి నాడు కొన్ని పరిహారాలను పాటిస్తే పరమశివుడు మిక్కిలి సంతోషిస్తాడు. శివుని అనుగ్రహంతో సమస్యలన్నీ తీరి ఆనందంగా ఉండొచ్చు. శివరాత్రి నాడు శివుడిని ఆరాధించి, ఉపవాసం ఉండి, సాయంత్రం జాగరణ చేస్తే అద్భుతమైన ఫలితాలను చూడొచ్చు. అలాగే ధనప్రాప్తి కలగడానికి, ఉద్యోగం లేదా వ్యాపారంలో పురోగతి, పదోన్నతులు కలగడానికి ఏం చేయాలి, ఎలాంటి పరిహారాలను పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ధన ప్రాప్తి కలగాలంటే పరమేశ్వరుడిని ఇలా ఆరాధించండి:

శివరాత్రి నాడు ధన ప్రాప్తి కలగాలంటే శివాలయంలో దీపాన్ని పెట్టండి. శివ పురాణం ప్రకారం చూసినట్లయితే, కుబేరుడు గత జన్మలో శివలింగం దగ్గర వెలుగొందాడు. అందుకే తర్వాత జన్మలో దేవతల కోశాధికారిగా మారిపోయాడు. కాబట్టి కచ్చితంగా శివరాత్రి నాడు శివలింగం దగ్గర దీపం పెట్టండి. దీంతో ఆర్థిక ఫలితాలను చూస్తారు. ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి సుఖసంతోషాలను పొందవచ్చు.

ఉద్యోగం, వ్యాపారంలో కలిసి రావాలంటే ఈ పరిహారాన్ని పాటించండి:

శివరాత్రి నాడు స్పటిక లింగాన్ని ఇంట్లో పెట్టి, నీరు, పాలు, నెయ్యి, పెరుగు, తేనె, పంచదారతో అభిషేకం చేయండి. ఇలా పంచామృతాలతో శివుడిని పూజిస్తే శివానుగ్రహం కలుగుతుంది. అలాగే శివ పంచాక్షరి మంత్రమైన “ఓం నమశివాయ” అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఉద్యోగులకు పదోన్నతులు, వ్యాపారస్తులకు పురోగతి వస్తుంది.

దరిద్రం తొలగిపోయి ఆనందంగా ఉండాలంటే ఇలా చేయండి:

శివరాత్రి నాడు ఆహార ధాన్యాలు, డబ్బులు దానం చేయండి. పేదలకు, అవసరమైన వారికి సహాయం చేయడం వలన పాపాలన్నీ తొలగిపోయి అక్షయ పుణ్య ప్రాప్తి కలుగుతుంది. శివాలయంలో చక్కెరను దానం చేస్తే కూడా మంచి జరుగుతుంది. కష్టాలన్నీ తొలగిపోతాయి.

హనుమాన్ చాలీసా పఠించండి:

శివరాత్రి నాడు హనుమాన్ చాలీసాను పఠించడం వలన పరమేశ్వరుని అనుగ్రహం కలుగుతుంది. చేపట్టిన పనుల్లో ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి.

బిల్వ వృక్షం దగ్గర దానం:

బిల్వ వృక్షం కింద నిలబడి పాయసం లేదా నెయ్యిని దానం చేయండి. మహాలక్ష్మి ప్రత్యేక అనుగ్రహం కలుగుతుంది. ఆటంకాలు తొలగిపోతాయి. పనుల్లో విజయం ఉంటుంది.

ఈ నామాలతో పూజించండి

“ఓం భవాయ దేవాయ నమః”,

“ఓం శర్వాయ దేవాయ నమః”,

“ఓం ఈశానాయ దేవాయ నమః”,

“ఓం పశుపతయే దేవాయ నమః”,

“ఓం రుద్రాయ దేవాయ నమః”,

“ఓం ఉగ్రాయ దేవాయ నమః”,

“ఓం భీమాయ దేవాయ నమః”,

“ఓం మహా తే దేవాయ నమః”

ఈ ఎనిమిది నామాలను చదివి తామర, గన్నేరు పుష్పాలను శివుడికి సమర్పించండి. ఆ తరవాత ధూప, దీప, నైవేద్యాలను కూడా శివునికి సమర్పిస్తే ఆ శివయ్య ప్రత్యేక అనుగ్రహం కలుగుతుంది.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe