రథసప్తమి వేళ సూర్య అనుగ్రహం కలగాలంటే, ఏ రాశుల వారు వేటిని దానం చెయ్యాలి? పన్నెండు రాశుల వారి కోసం పరిహారాలు ఇవిగో!

జనవరి 25, ఆదివారం అనగా ఈరోజు రథసప్తమి. ప్రతి సంవత్సరం మాఘ మాసం శుక్లపక్ష సప్తమి నాడు రథసప్తమి వస్తుంది. దీనిని సూర్య సప్తమి లేదా సూర్య జయంతి అని కూడా అంటారు. ఈ రథసప్తమికి మీరు కూడా సూర్యుని అనుగ్రహాన్ని పొందాలనుకుంటున్నారా? అయితే మీరు మీ రాశి ప్రకారం వీటిని దానం చేయడం మంచిది. 

Published on: Jan 24, 2026, 16:30:48 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రథసప్తమి నాడు సూర్యుని అనుగ్రహం కలగాలని చాలామంది వివిధ రకాల పరిహారాలను పాటిస్తారు. హిందూ పంచాంగం ప్రకారం చూసినట్లయితే, ప్రతి సంవత్సరం మాఘ మాసం శుక్లపక్ష సప్తమి నాడు రథసప్తమి వస్తుంది. దీనిని సూర్య సప్తమి లేదా సూర్య జయంతి అని కూడా అంటారు. ఈ రథసప్తమికి మీరు కూడా సూర్యుని అనుగ్రహాన్ని పొందాలనుకుంటున్నారా? అయితే మీరు మీ రాశి ప్రకారం వీటిని దానం చేయడం మంచిది.

రథసప్తమి వేళ సూర్య అనుగ్రహం కలగాలంటే, ఏ రాశుల వారు వేటిని దానం చెయ్యాలి? (pinterest)
రథసప్తమి వేళ సూర్య అనుగ్రహం కలగాలంటే, ఏ రాశుల వారు వేటిని దానం చెయ్యాలి? (pinterest)

జనవరి 25, ఆదివారం అనగా ఈరోజు రథసప్తమి. జ్యోతిష శాస్త్రం ప్రకారం చూసినట్లయితే, రథసప్తమి నాడు సూర్యుని ఆరాధించాలి. దాంతో బాధలన్నీ తొలగిపోయి ఆనందంగా ఉండొచ్చు. అలాగే రథసప్తమి నాడు మీ రాశిని బట్టి ఈ వస్తువులను కచ్చితంగా దానం చేసేలా చూసుకోవాలి. మరి ఏ రాశి వారు వేటిని దానం చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం.

రథసప్తమి వేళ ఏ రాశుల వారు వేటిని దానం చెయ్యాలో తెలుసుకుందాం

మేష రాశి

మేష రాశి వారు రథసప్తమి నాడు బెల్లం, వస్త్రాలను దానం చేయడం మంచిది. అలా చేయడం వలన ఆనందం, శ్రేయస్సు కలుగుతాయి.

వృషభ రాశి

వృషభ రాశి వారు రథసప్తమి నాడు పంచదార, పాలు, బియ్యం, తెల్లని నువ్వులు, తెల్లని వస్త్రాలు వంటి దానాలు చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. ఆనందంగా ఉండొచ్చు.

మిథున రాశి

సూర్య అనుగ్రహం కలగాలంటే మిథున రాశి వారు రథసప్తమి నాడు డబ్బును దానం చేయడం మంచిది. ఇలా చేయడం వలన ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికి కూడా వీలవుతుంది.

కర్కాటక రాశి

ఈ రాశి వారు రథసప్తమి నాడు సూర్య అనుగ్రహం కలగాలంటే తెల్లని వస్త్రాలు, వెండి, తెల్ల నువ్వులు, బియ్యం వంటి దానాలు చేస్తే మంచిది. పసుపు పాలను కూడా దానం చేయడం మంచిది.

సింహ రాశి

సింహ రాశి వారు రథసప్తమి నాడు గోధుమలు, తేనె, బెల్లం వంటి దానాలు చేయడం మంచిది. అలాగే పేదలకు దుప్పట్లు దానం చేస్తే కూడా మంచి లాభం కలుగుతుంది.

కన్య రాశి

కన్య రాశి వారు రథసప్తమి నాడు గోశాలలో డబ్బును దానం చేయడం మంచిది. అలాగే పచ్చని రంగులో ఉండే దుస్తులను దానం చేస్తే కూడా విశేష ఫలితాన్ని పొందవచ్చు.

తులా రాశి

తులా రాశి వారు బియ్యం, వస్త్రాలు, పంచదార, దుప్పట్లు వంటివి దానం చేయడం మంచిది. ఈ విధంగా పాటించడం వలన వైవాహిక జీవితం కూడా బాగుంటుంది.

వృశ్చిక రాశి

ఈ రాశి వారు వేరుశెనగ, బెల్లం, ఎరుపు రంగు వస్త్రాలు, నువ్వులు వంటివి దానం చేస్తే మంచిది.

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారికి సూర్య అనుగ్రహం కలగాలంటే శనగపిండి, వస్త్రాలు వంటి దానాలు చేయడం మంచిది. ఇలా చేస్తే ఐశ్వర్యం కలుగుతుంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది.

మకర రాశి

మకర రాశి వారు సూర్య జయంతి వేళ సూర్యుని అనుగ్రహం కోసం నల్ల నువ్వులు, దుప్పట్లు, నూనె వంటివి దానం చేస్తే మంచిది. దుప్పట్లు కూడా దానం చేయవచ్చు.

కుంభ రాశి

కుంభ రాశి వారు రథసప్తమి నాడు ఖిచిడీ, నువ్వులు, ఉసిరి, పప్పు, నల్లని వస్త్రాలు వంటి దానాలు చేస్తే విశేష ఫలితాన్ని పొందడానికి వీలవుతుంది. సూర్య అనుగ్రహంతో ఆనందంగా ఉండొచ్చు.

మీన రాశి

మీన రాశి వారు పసుపు, ఆవాలు, శెనగపప్పు, వస్త్రాలు, నువ్వులు వంటివి దానం చేస్తే మంచిది. దీంతో సూర్య అనుగ్రహం కలిగి ఆనందంగా ఉండొచ్చు.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More