...
...
Next Story

Shivaratri 2026: శివరాత్రి వేళ 3 ప్రధాన గ్రహాల కదలికలో మార్పు, 7 రాశులు వారు ధనవంతులవ్వచ్చు.. సంపద, ఆస్తులు ఇలా ఎన్నో!

ఈ ఏడాది మహాశివరాత్రి ఫిబ్రవరి 15, ఆదివారం నాడు వచ్చింది. ఆ రోజు కుజుడు శ్రవణ నక్షత్రం నుంచి ధనిష్ట నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. అలాగే చంద్రుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. బుధుడు శతభిషా నక్షత్రం నుంచి పూర్వభద్ర నక్షత్రానికి ప్రవేశిస్తాడు. గ్రహాల సంచారంలో మార్పుతో ఏడు రాశుల వారి జీవితంలో అనేక మార్పులు.

Published on: Feb 9, 2026, 13:30:40 IST
Advertisement

మహాశివరాత్రి చాలా విశేషమైన రోజు. ప్రతి ఏటా మాఘ మాసంలో వచ్చే కృష్ణపక్ష చతుర్దశి నాడు శివరాత్రిని జరుపుకుంటాము. ఈ ఏడాది ఫిబ్రవరి 15న శివరాత్రి వచ్చింది. ఆ రోజు కొన్ని పరిహారాలను పాటిస్తే శివుని అనుగ్రహం కలిగి ఆనందంగా ఉండొచ్చు. అయితే శివరాత్రి నాడు మూడు ముఖ్యమైన గ్రహాల సంచారంలో మార్పు రాబోతోంది. ఏడు రాశుల వారు ధనవంతులయ్యే అవకాశం ఉంది. మరి గ్రహాల సంచారంతో పాటు ఏ రాశుల వారు ధనవంతులవ్వబోతున్నారో తెలుసుకుందాం. మరి ఆ అదృష్ట రాశుల్లో మీరు ఉన్నారేమో చెక్ చేసుకోండి.

మహాశివరాత్రి నాడు మూడు ముఖ్యమైన గ్రహాల కదలికలో మార్పు

Shivaratri 2026: మహాశివరాత్రి వేళ 3 ప్రధాన గ్రహాల కదలికలో మార్పు, 7 రాశులు వారు ధనవంతులవ్వచ్చు (pinterest)
Shivaratri 2026: మహాశివరాత్రి వేళ 3 ప్రధాన గ్రహాల కదలికలో మార్పు, 7 రాశులు వారు ధనవంతులవ్వచ్చు (pinterest)

ఈ ఏడాది మహాశివరాత్రి ఫిబ్రవరి 15, ఆదివారం నాడు వచ్చింది. ఆ రోజు కుజుడు శ్రవణ నక్షత్రం నుంచి ధనిష్ట నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. అలాగే చంద్రుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. బుధుడు శతభిషా నక్షత్రం నుంచి పూర్వభద్ర నక్షత్రానికి ప్రవేశిస్తాడు. అలాగే బుధుడు దక్షిణం నుంచి ఉత్తరానికి తన ప్రయాణాన్ని మొదలుపెడతాడు.

ఇలా గ్రహాల సంచారంలో మార్పు రావడంతో ఏడు రాశుల వారి జీవితంలో అనేక మార్పులు రాబోతున్నాయి. ఈ రాశుల వారు ధనవంతులయ్యే అవకాశం కూడా ఉంది. శివయ్య ప్రత్యేక అనుగ్రహం కలిగి ఆనందంగా ఉంటారు. డబ్బుకు లోటు ఉండదు. సక్సెస్‌ను అందుకుంటారు. సంపద పెరుగుతుంది. ఇలా ఒకటేంటి, అనేక లాభాలు కలుగుతాయి.

మహాశివరాత్రి వేళ 3 ప్రధాన గ్రహాల కదలికలో మార్పు.. 7 రాశుల వారు ధనవంతులయ్యే అవకాశం!

1.మేష రాశి:

మేష రాశి వారికి ఈ శివరాత్రి బాగా కలిసి రాబోతోంది. ఈ రాశి వారు ధనవంతులయ్యే అవకాశం ఉంది. ఎప్పటి నుంచో పూర్తి కాని పనులు పూర్తవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. కష్టానికి తగ్గ ఫలితాన్ని చూస్తారు. ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే బాగా కలిసి వస్తుంది.

2.మిథున రాశి:

కర్కాటక రాశి వారు అనుకున్న వాటిని విజయవంతంగా పూర్తి చేస్తారు. శివరాత్రి వేళ శివయ్య అనుగ్రహం కలుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆర్థిక ఒత్తిడి తొలగిపోతుంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది.

4.సింహ రాశి:

సింహ రాశి వారికి శివరాత్రి వేళ బాగా కలిసి వస్తుంది. కెరీర్‌లో మంచి మార్పులు వస్తాయి. పేరు, ప్రతిష్టలు పెరుగుతాయి. పాత ఇన్వెస్ట్‌మెంట్లు, ఆస్తుల నుంచి భారీగా లాభాలు వస్తాయి. ధనవంతులయ్యే అవకాశం ఉంది.

5.తులా రాశి:

తులా రాశి వారికి ఇది అద్భుతమైన సమయం. శివరాత్రి వేళ ఈ రాశి వారు ఆనందంగా ఉంటారు. కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఆనందం రెట్టింపు అవుతుంది. ప్రేమ జీవితంలో ఆనందంగా ఉంటారు. కొత్త వ్యాపారాన్ని లేదా ఉద్యోగాన్ని మొదలుపెడితే బాగా కలిసి వస్తుంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది.

6.మకర రాశి:

ఈ రాశి వారికి ఆర్థికపరంగా బాగుంటుంది. పాత గొడవలు తొలగిపోతాయి. ప్రశాంతత, సంతోషం ఎక్కువ అవుతాయి. కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. మొత్తం మీద ఈ రాశి వారికి ఆనందం, సంపద, ప్రశాంతత ఉంటాయి.

7.మీన రాశి:

మీన రాశి వారికి శివరాత్రి వేళ బాగా కలిసి వస్తుంది. భారీగా లాభాలను పొందుతారు. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు కూడా ఇది శుభ సమయం. పాత అప్పులు తొలగిపోతాయి. భవిష్యత్తులో చక్కటి మార్పులను చూస్తారు. ధనవంతులు అయ్యే అవకాశం ఉంది.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks