...
...
Next Story

కర్కాటకంలోకి శుక్రుడి సంచారం - ఈ 4 రాశుల వారికి ఆర్థిక కష్టాలు, మానసిక ఒత్తిడి..!

జూన్ 8న శుక్ర గ్రహం కర్కాటక రాశిలోకి ప్రవేశించనుంది. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం…. ఈ సంచారం వల్ల మేషం, కన్య, ధనుస్సు, కుంభ రాశుల వారు కెరీర్, ఆర్థిక విషయాల్లో తీవ్ర సవాళ్లను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి.

Published on: Jun 4, 2026, 16:23:42 IST
Advertisement

జ్యోతిష్యశాస్త్రంలో నవగ్రహాల అన్నింటిలోనూ శుక్రుడికి అత్యంత కీలకమైన స్థానం ఉంది. మానవ జీవితంలో లభించే భోగభాగ్యాలు, విలాసాలు, అందం, సంపద, వైభవం, ఐశ్వర్యం మరియు ప్రేమకు శుక్ర గ్రహాన్నే కారకుడిగా భావిస్తారు. జాతకంలో శుక్రుడి అనుగ్రహం ఉంటే ఆ వ్యక్తి జీవితం సకల సుఖాలతో వర్ధిల్లుతుంది. ఈ క్రమంలోనే గ్రహాల కదలికల ప్రకారం, 2026 జూన్ 8వ తేదీన శుక్రుడు చంద్రుడి సొంత రాశి అయిన కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్నాడు. శుక్రుడి ఈ రాశి మార్పు మొత్తం 12 రాశిచక్రాలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది.

కర్కాటకంలోకి శుక్రుడి సంచారం
కర్కాటకంలోకి శుక్రుడి సంచారం

సాధారణంగా శుక్రుడిని శుభ గ్రహంగా పరిగణించినప్పటికీ…. జాతకంలో ఆయా గ్రహాల స్థితులు, సంచార సమయాన్ని బట్టి కొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు కూడా ఎదురవుతాయి. జ్యోతిష్య నిపుణుల అంచనాల ప్రకారం…. కర్కాటక రాశిలో శుక్రుడి సంచార కాలం కొన్ని రాశుల వారికి తీవ్ర అస్థిరతను కలిగిస్తుంది. ఈ సమయంలో కొన్ని రాశుల వారు కుటుంబంలో కలహాలు, పెరిగిన ఆర్థిక ఖర్చులు, ఉద్యోగ రంగంలో అనేక అడ్డంకులను ఎదుర్కోవాల్సి వస్తుంది. శుక్రుడి ఈ గోచార మార్పు వల్ల ఏయే రాశుల వారు జాగ్రత్తగా ఉండాలో ఇక్కడ తెలుసుకోండి….

  1. మేష రాశి : శుక్రుడి సంచారం కారణంగా మేష రాశి వారికి ఆదాయ మార్గాలు తగ్గుముఖం పడతాయి. అదే సమయంలో ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. దీనివల్ల మీ భౌతిక సౌకర్యాలు క్షీణించే అవకాశం ఉంది. కుటుంబ జీవితంలో లేదా వ్యాపార భాగస్వాములతో తీవ్రమైన విభేదాలు రావచ్చు. చిన్నపాటి విషయాలే పెద్ద గొడవలకు దారితీసే ప్రమాదం ఉంది. ఈ కాలంలో ఆరోగ్య రక్షణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఆహార నియమాలను పాటించకపోతే శారీరక శక్తి తగ్గి, నీరసంగా అనిపిస్తుంది.
  2. కన్యా రాశి : ఈ రాశి వారికి శుక్రుడి మార్పు వల్ల మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అయితే కొన్ని రంగాలలో మాత్రం అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి. ముఖ్యంగా ఉద్యోగం చేసే చోట మీపై కుట్రలు జరిగే ప్రమాదం ఉంది. ఆఫీసు రాజకీయాల వల్ల మీ ప్రతిష్ట దెబ్బతినవచ్చు. కాబట్టి కార్యాలయ వివాదాలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. ఎవరికీ డబ్బులు అప్పుగా ఇవ్వకూడదు, తిరిగి రావడం చాలా కష్టమవుతుంది. అత్యంత ఆప్తులతో సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉన్నందున మాట్లాడేటప్పుడు ఓపిక అవసరం.
  3. ధనుస్సు రాశి : ఈ సమయం ధనుస్సు రాశి వారికి సవాళ్లతో కూడుకుని ఉంటుంది. జీవిత భాగస్వామితో సఖ్యత లోపిస్తుంది. కుటుంబంలో సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి ముంచుకురావడం వల్ల మానసిక ఒత్తిడి తీవ్రమవుతుంది. విద్యార్థులకు కూడా ఈ కాలం ఒడిదుడుకులతో కూడి ఉంటుంది. అనుకున్న విజయాలు సాధించడం కోసం కఠినంగా శ్రమించాల్సి వస్తుంది. పెట్టుబడుల విషయంలో ఎలాంటి రిస్క్ తీసుకోకూడదు, లేనిపక్షంలో భారీ నష్టాలు చవిచూడాల్సి వస్తుంది.
  4. కుంభ రాశి : కుంభ రాశి వారికి ఉద్యోగ, వ్యాపార రంగాలలో తీవ్ర ఒత్తిడి పెరుగుతుంది. సహోద్యోగులు మీ కెరీర్‌ను దెబ్బతీయడానికి, మిమ్మల్ని కిందికి లాగడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి ఎవరితోనూ వాగ్వాదానికి దిగకండి. కుటుంబ అవసరాల నిమిత్తం అకస్మాత్తుగా పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇది మీ ఆర్థిక సమతుల్యతను దెబ్బతీస్తుంది. మానసిక ప్రశాంతత కరువవుతుంది కాబట్టి ప్రతి విషయంలోనూ సంయమనం పాటించాలి.

శుక్ర దోష నివారణకు అద్భుతమైన పరిహారాలు:

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe