జ్యోతిష్య శాస్త్రంలో ప్రేమ, ఐశ్వర్యం, కీర్తి, కళలకు కారకుడైన శుక్ర గ్రహ సంచారానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. జాతకంలో శుక్రుడి అనుగ్రహం ఉంటే నిలిచిపోయిన పనులు కూడా వేగంగా పూర్తవుతాయి. ప్రస్తుతం శుక్రుడు తన స్వక్షేత్రమైన తులా రాశిలో సంచరిస్తూ…. తన నక్షత్ర గమనాన్ని మార్చుకున్నాడు.

హిందూ పంచాంగం ప్రకారం…. అక్టోబర్ 24వ తేదీ మధ్యాహ్నం 3:11 గంటలకు శుక్రుడు కుజ గ్రహానికి చెందిన చిత్రా నక్షత్రంలోకి ప్రవేశించాడు. ఈ నక్షత్రంలో శుక్రుడి సంచారం డిసెంబర్ 5వ తేదీ ఉదయం వరకు, అంటే దాదాపు 42 రోజుల పాటు కొనసాగనుంది.
ప్రముఖ జ్యోతిష్య నిపుణుడు పండిట్ నరేంద్ర ఉపాధ్యాయ్ తెలిపిన వివరాల ప్రకారం…. ఈ నక్షత్ర మార్పు వల్ల 4 రాశుల వారికి అపారమైన ఆర్థిక లాభాలతో పాటు సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆ అదృష్ట రాశుల వివరాలు ఇక్కడ తెలుసుకోండి….
కుంభ రాశి
చిత్తా నక్షత్రంలో శుక్రుడి సంచారం కుంభ రాశి వారికి ఎంతో మేలు చేస్తుంది. ఈ సమయంలో వీరి ప్రేమ జీవితం చాలా అందంగా, ఆహ్లాదకరంగా మారుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి బ్యాంక్ బ్యాలెన్స్ గణనీయంగా పెరుగుతుంది. వ్యాపార రంగంలో ఉన్నవారికి కొత్త కాంట్రాక్టులు లభించి భారీ లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
మిథున రాశి
మిథున రాశి జాతకులకు శుక్రుడి నక్షత్ర మార్పు అత్యంత అనుకూల ఫలితాలను ఇస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడిపేందుకు విహారయాత్రలకు వెళ్లే అవకాశం ఉంది. ఊహించని విధంగా ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. వ్యక్తిగత జీవితంలో ఒక ప్రత్యేకమైన అనుభూతి లేదా మలుపు చోటుచేసుకుంటుంది.
తులా రాశి
స్వక్షేత్రమైన తులా రాశిలోనే శుక్రుడు సంచరిస్తూ నక్షత్ర మార్పు చెందడం ఈ రాశి వారికి విశేషమైన ప్రయోజనాలను కలిగిస్తుంది. ముఖ్యంగా కళారంగం, సృజనాత్మక రంగాల్లో ఉన్నవారు మంచి శుభవార్తలు వింటారు. నిలిచిపోయిన సొమ్ము చేతికి అంది ఆర్థిక పరిస్థితి చాలా బలంగా మారుతుంది.
మకర రాశి
{{/usCountry}}స్వక్షేత్రమైన తులా రాశిలోనే శుక్రుడు సంచరిస్తూ నక్షత్ర మార్పు చెందడం ఈ రాశి వారికి విశేషమైన ప్రయోజనాలను కలిగిస్తుంది. ముఖ్యంగా కళారంగం, సృజనాత్మక రంగాల్లో ఉన్నవారు మంచి శుభవార్తలు వింటారు. నిలిచిపోయిన సొమ్ము చేతికి అంది ఆర్థిక పరిస్థితి చాలా బలంగా మారుతుంది.
మకర రాశి
{{/usCountry}}మకర రాశి వారికి ఈ 42 రోజుల కాలం సానుకూల వాతావరణాన్ని తెస్తుంది. జీవితంలో ఆశావాదం, ఉత్సాహం పెరుగుతాయి. భాగస్వామితో శృంగారం, అనుబంధం మరింత బలపడతాయి. విభిన్న మార్గాల ద్వారా ఆదాయం పెరిగి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది.