జ్యోతిష్య శాస్త్రంలో విలాసాలు, ఐశ్వర్యం, భోగభాగ్యాలకు కారకుడైన శుక్ర గ్రహం తన నక్షత్ర సంచారాన్ని మార్చింది. శుక్రుడు స్వాతి నక్షత్రంలోకి ప్రవేశించాడు. స్వాతి నక్షత్రానికి అధిపతి నీడ గ్రహమైన రాహువు. శుక్ర, రాహువుల ఈ ప్రభావం కారణంగా మేషం నుంచి మీనం వరకు అన్ని రాశుల వారిపై ఎదో ఒక రకమైన ప్రభావం పడుతుంది.

అయితే ప్రముఖ జ్యోతిష్య పండితులు నరేంద్ర ఉపాధ్యాయ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నక్షత్ర మార్పు వల్ల ప్రధానంగా నాలుగు రాశుల వారికి విశేషమైన ధన యోగం పడుతోంది. వీరి ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడటమే కాకుండా, పెండింగ్‌లో ఉన్న పనులు వేగవంతం కానున్నాయి. ఆ నాలుగు రాశుల జాతకులకు కలగబోయే ప్రయోజనాలు ఇవే…
వృషభ రాశి
వృషభ రాశి వారికి శుక్ర-రాహువుల ప్రభావం అత్యంత సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఆర్థిక వ్యవహారాలు మీకు అనుకూలంగా మారుతాయి. ఉద్యోగస్తులు తమ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని, అధికారుల నుంచి ప్రశంసలను అందుకుంటారు. వ్యాపారంలో ఉన్నవారికి నూతన అవకాశాలు తలుపు తడతాయి. ముఖ్యంగా భాగస్వామ్య (పార్ట్‌నర్‌షిప్) వ్యాపారాలు చేసేవారికి లాభాలు మెండుగా ఉంటాయి. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు ఒక్కొక్కటిగా పూర్తవుతాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి ఆర్థిక స్థితి మునుపటి కంటే చాలా బలపడుతుంది. రావలసిన పాత బాకీలు, చేతికి అందాల్సిన డబ్బు అనుకోకుండా చేతికి అందుతుంది. ఆదాయానికి కొత్త మార్గాలు సుగమమవుతాయి. రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన వారికి, ఆస్తులు కొనాలనుకునే వారికి శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఇంట్లో సౌకర్యాలు, విలాసవంతమైన వస్తువుల కొనుగోలు పెరుగుతుంది. భాగస్వామితో అనుబంధం బలపడి, ప్రశాంతమైన సమయాన్ని గడుపుతారు. జీవితంలో ప్రతీదీ మళ్లీ సరైన దారిలోకి వస్తుంది.
తులారాశి
తులా రాశి అధిపతి శుక్రుడే కావడం, ఆ శుక్రుడి సంచారం స్వాతి నక్షత్రంలో జరగడంతో తులారాశి వారికి ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. ఉద్యోగంలో మెరుగైన ఆఫర్లు, కొత్త బాధ్యతలు లభించే సూచనలు ఉన్నాయి. ధన సంబంధిత సమస్యలు క్రమంగా తొలగిపోతాయి. కుటుంబ సభ్యులు, జీవిత భాగస్వామితో సంబంధాలు మరింత మధురంగా మారతాయి. మనస్సుకు ఎంతో సంతోషాన్నిచ్చే ఒక శుభవార్తను ఈ కాలంలో వింటారు.
కుంభ రాశి
{{/usCountry}}తులా రాశి అధిపతి శుక్రుడే కావడం, ఆ శుక్రుడి సంచారం స్వాతి నక్షత్రంలో జరగడంతో తులారాశి వారికి ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. ఉద్యోగంలో మెరుగైన ఆఫర్లు, కొత్త బాధ్యతలు లభించే సూచనలు ఉన్నాయి. ధన సంబంధిత సమస్యలు క్రమంగా తొలగిపోతాయి. కుటుంబ సభ్యులు, జీవిత భాగస్వామితో సంబంధాలు మరింత మధురంగా మారతాయి. మనస్సుకు ఎంతో సంతోషాన్నిచ్చే ఒక శుభవార్తను ఈ కాలంలో వింటారు.
కుంభ రాశి
{{/usCountry}}కుంభ రాశి వారికి రాబోయే రోజుల్లో ఆర్థిక ఇబ్బందుల నుంచి ఉపశమనం లభిస్తుంది. హఠాత్తుగా ధనలాభం కలిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అదనపు ఆదాయ వనరులు ఏర్పడి, బ్యాంకు బ్యాలెన్స్ పెంచుకోవడానికి మంచి అవకాశాలు లభిస్తాయి. నిలిచిపోయిన పనులు వేగం పుంజుకుంటాయి. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఆశించిన ప్రగతి కనిపిస్తుంది. కుటుంబంతో కలిసి ఆనందంగా గడిపే అవకాశాలు లభిస్తాయి.