శూల యోగం: జూన్ నెలలో ఈ 4 రాశులకు కష్టాలు.. తస్మాత్ జాగ్రత్త.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే?
2026 జూన్ 14న ఏర్పడే శూల యోగం ప్రభావంతో కొన్ని రాశుల వారి జీవితాల్లో ఒడిదుడుకులు తప్పవు. ఆర్థికం, ఆరోగ్యం, కెరీర్ విషయంలో మిథున, కన్య వంటి రాశుల వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి.
గ్రహాల గమనం, గ్రహాల కలయిక మన జీవితంలో ఎంతో ప్రభావాన్ని చూపిస్తాయి. కొన్ని యోగాలు అదృష్టాన్ని తీసుకొస్తే, కొన్ని యోగాలు సవాళ్లను తీసుకొస్తాయి. అశుభ యోగాల్లో ఒకటైన శూల యోగం జూన్ నెలలో రాబోతోంది. జూన్ 14వ తేదీన మధ్యాహ్నం 1 గంట 15 నిమిషాలకు శూల యోగం ప్రారంభం అవ్వబోతోంది. ఇది తర్వాత రోజు జూన్ 15 ఉదయం 8 గంటల 56 నిమిషాల వరకు ఉంటుంది.

శూల యోగం
పేరులో ఉన్నట్లే శూల యోగం శూలంలా గుచ్చుకునే అవకాశం ఉంది. ఈ యోగం 12 రాశుల వారిపై ప్రభావం చూపిస్తుంది. కానీ కొన్ని రాశుల వారికి మాత్రం ప్రతికూల ప్రభావాలు ఎదురయ్యే అవకాశం ఉంది.
ఈ యోగం ముగిసిన తర్వాత కూడా కొన్ని రోజుల పాటు ఆ ప్రభావం కొనసాగుతుంది. ఈ రాశుల వారికి కెరీర్, ఆర్థికపరంగా, వ్యక్తిగతపరంగా కూడా ఇబ్బందులు రావచ్చు. మరి ఆ దురదృష్ట రాశులు ఎవరు? శూల యోగంతో ఏ రాశి వారికి నష్టాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
జూన్ నెలలో శూల యోగం.. వారికి సమస్యలు.. తస్మాత్ జాగ్రత్త!
కన్య రాశి
కన్యా రాశి వారికి ఈ యోగం కారణంగా నిరాశ ఎదురవచ్చు. ఎంత కష్టపడినా గుర్తింపు రాకపోవచ్చు. అసంతృప్తి కలగవచ్చు. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. ఆఫీస్‌లో, వ్యాపారంలో చికాకులు ఎక్కువగా ఉండొచ్చు. శారీరక సమస్యలు, ముఖ్యంగా కాళ్ల నొప్పులు తీవ్రంగా బాధపడే అవకాశం ఉంది. పనిచేసే ప్రదేశంలో పొరపాటు చిన్నదైనా సరే పెద్ద నష్టం కలుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది.
మిథున రాశి
ఈ రాశి వారికి జూన్ నెలలో శూల యోగం వలన కష్టంగా ఉండొచ్చు. అనవసరమైన పనుల వలన ఇబ్బంది పడాల్సి ఉంటుంది. శారీరక, మానసిక అలసట ఎక్కువగా ఉంటుంది. పెద్దల ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండడం మంచిది. పెట్టుబడులు పెడితే నష్టాలు రావచ్చు. చూసుకోండి.
కుంభ రాశి
కుంభ రాశి వారికి ఈ యోగం వలన సమస్యలు రావచ్చు. విపరీతమైన కోపం, చిరాకు ఉండొచ్చు. మానసిక స్థితి వలన చుట్టుపక్కల వారితో గొడవలు కూడా జరిగే అవకాశం ఉంది. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. ఇంట్లో పిల్లలు లేదా కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా చూసుకోవాలి. మిమ్మల్ని మీరు ఆందోళనకు గురి చేసుకోవద్దు. ఈ సమయంలో మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. ఇష్ట దైవాన్ని ప్రార్థించండి. సహనాన్ని మాత్రం కోల్పోవద్దు.
ధనస్సు రాశి
ఈ రాశి వారికి శూల యోగం వలన ఇబ్బందులు ఉండొచ్చు. బంధాల విషయంలో తొందరపడకండి. వ్యాపారంలో కూడా నష్టాలు ఉండొచ్చు. ఆర్థికపరంగా సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఒత్తిడి పెరగవచ్చు. చేతిలో డబ్బులు లేని పరిస్థితి కూడా ఉండొచ్చు. చూసుకోవాలి. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండండి.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


