మహావిష్ణువుని భక్తిశ్రద్ధలతో ఆరాధించడం వలన అనేక ప్రయోజనాలను పొందవచ్చు. లక్ష్మీదేవి అనుగ్రహం కలగడంతో పాటు ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతి, కుటుంబంలో సుఖశాంతులు కలుగుతాయి. అలాగే పాపాలు తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది. సంతాన సౌభాగ్యం కలుగుతుంది.

గ్రహ దోషాల ప్రభావం నుంచి కూడా బయటపడడానికి వీలవుతుంది. అంతేకాదు, విష్ణువుని భక్తిశ్రద్ధలతో ఆరాధించడం వలన ఆధ్యాత్మిక పురోగతి కలుగుతుంది. మోక్షప్రాప్తికి మార్గం కూడా లభిస్తుంది. అయితే, రేపు తొలి ఏకాదశి వేళ విష్ణువుని ఆరాధించేటప్పుడు వీటిని కచ్చితంగా గుర్తుపెట్టుకొని పాటించడం మంచిది.
రేపే తొలి ఏకాదశి.. తొలి ఏకాదశి విశిష్టత తెలుసుకోండి
రేపు తొలి ఏకాదశి. దీనిని దేవశయనీ ఏకాదశి లేదా ఆషాఢ శుక్ల ఏకాదశి అని కూడా అంటారు. హరిశయనీ ఏకాదశి అని కూడా దీనికి పేరు. ఈ రోజు విష్ణువు క్షీరసాగరంలో యోగనిద్రలోకి ప్రవేశిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. చాతుర్మాసం కూడా తొలి ఏకాదశి నుంచే మొదలవుతుంది.
తొలి ఏకాదశి విశిష్టత
రేపు తొలి ఏకాదశి నాడు ఉపవాసం ఉండడం వలన విష్ణువు అనుగ్రహం కలుగుతుంది. అలాగే విష్ణు సహస్రనామం, విష్ణు అష్టోత్తర శతనామావళి, "ఓం నమో నారాయణాయ నమః" మంత్రాన్ని జపిస్తే అద్భుతమైన ఫలితాలను చూడొచ్చు. తులసి దళాలతో విష్ణువుకు అర్చన చేయడం వలన విష్ణువు ప్రత్యేక అనుగ్రహం లభిస్తుంది. చాతుర్మాస్య దీక్షలను రేపటి నుంచి మొదలుపెడతారు.
అలాగే దానధర్మాలు, అన్నదానం, గోసేవ, భగవన్నామ స్మరణ చేయడం వలన ఎంతో విశిష్టమైన ఫలితాలను పొందడానికి వీలవుతుంది. అంతేకాదు, ఐశ్వర్యం, ఆరోగ్యం, సుఖశాంతులు ఇలా అనేక విధాలుగా లాభాలను తొలి ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం ద్వారా పొందవచ్చు.
విష్ణు ఆరాధనలో తప్పక జపించాల్సిన మంత్రం
"ఓం నమో నారాయణాయ నమః" లేదా "ఓం నమో భగవతే వాసుదేవాయ నమః".
ఈ మంత్రాన్ని భక్తిశ్రద్ధలతో జపిస్తే విష్ణు కటాక్షం, లక్ష్మీ అనుగ్రహం కలుగుతాయి. మనశ్శాంతి, ధనసమృద్ధి, కుటుంబ సుఖ శాంతులు లభిస్తాయి.
విష్ణు పూజకు అత్యంత శుభప్రదమైన రోజులు
{{/usCountry}}ఈ మంత్రాన్ని భక్తిశ్రద్ధలతో జపిస్తే విష్ణు కటాక్షం, లక్ష్మీ అనుగ్రహం కలుగుతాయి. మనశ్శాంతి, ధనసమృద్ధి, కుటుంబ సుఖ శాంతులు లభిస్తాయి.
విష్ణు పూజకు అత్యంత శుభప్రదమైన రోజులు
{{/usCountry}}అన్ని ఏకాదశులు, తొలి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి, గురుపౌర్ణమి, శ్రావణమాసంలో వచ్చే గురువారాలు, ప్రతి గురువారం, శ్రీరామనవమి, శ్రీకృష్ణ జన్మాష్టమి, కార్తీకమాసం, ధనుర్మాసం.
ఈ రాశుల వారికి ఎప్పుడూ విష్ణు అనుగ్రహం ఉంటుంది
జ్యోతిష్యం ప్రకారం విష్ణు ఆరాధన అందరికీ శుభప్రదమే. కానీ కొన్ని రాశుల వారికి విష్ణువు నుంచి ప్రత్యేక అనుగ్రహం కలుగుతుంది. వృషభ రాశి, మిథున రాశి, కర్కాటక రాశి, కన్యా రాశి, తులా రాశి, ధనస్సు రాశి, మీన రాశికి విష్ణు అనుగ్రహం ఎప్పుడూ ఎక్కువగా ఉంటుంది. విష్ణువుని ఆరాధించడం వలన ఈ రాశుల వారు మరిన్ని శుభఫలితాలను పొందడానికి వీలవుతుంది.
విష్ణు పూజలో తప్పక ఉపయోగించాల్సిన పుష్పాలు
విష్ణువుకు పుష్పాలు అంటే ఎంతో ఇష్టం. విష్ణువుని ఆరాధించేటప్పుడు ఖచ్చితంగా వీటిని సమర్పించేటట్లు చూడండి. మొదటగా విష్ణువుకు చాలా ఇష్టమైనవి తులసి దళాలు. కచ్చితంగా తులసి దళాలతో విష్ణువుని పూజించండి. అలాగే కమలపూలు, మల్లెపూలు, సంపంగి పూలు, పారిజాత పూలు, తెల్ల కలువ పూలు, చామంతి పూలు, నందివర్ధనం పూలు, మొగలి పువ్వులు కూడా విష్ణువుకు ఎంతో ఇష్టం.
విష్ణువుకు ఈ నైవేద్యాలు సమర్పించండి
విష్ణువుకు చక్కెర పొంగలి, పరమాన్నం, పులిహోర, దద్దోజనం, పంచామృతం, వెన్న, పాలు, అరటిపండ్లు, బెల్లం-నెయ్యితో చేసిన ప్రసాదాలను నైవేద్యంగా సమర్పించవచ్చు.