హిందూ ధర్మంలో కర్పూరానికి ఎంతో విశిష్టత ఉంది. పవిత్రమైనదిగా కూడా భావిస్తాము. పూజ సమయంలో దీపారాధన చేయడంతో పాటు కర్పూరాన్ని కూడా తప్పక ఉపయోగిస్తాము. దేవుడికి హారతి ఇవ్వడానికే దీపాన్ని వెలిగిస్తే, పూజ చివరన కర్పూరంతో హారతి ఇస్తాము.

జ్యోతిష్యం, వాస్తు శాస్త్రం ప్రకారం చూసినట్లయితే, కర్పూరంతో చేసే కొన్ని పరిహారాలు అనేక విధాలుగా లాభాలను తీసుకువస్తాయి. కొన్ని ప్రభావవంతమైన పరిహారాలు నిలిచిపోయిన ధన ప్రవాహాన్ని మళ్లీ ప్రారంభించేందుకు సహాయం చేస్తాయి. అదృష్టం కూడా పెరుగుతుంది.
ప్రతికూల శక్తులు తొలగిపోతాయి
మత విశ్వాసాల ప్రకారం చూస్తే, కర్పూరాన్ని సరైన విధంగా ఉపయోగిస్తే ప్రతికూల శక్తులు తొలగిపోతాయి. ఐశ్వర్యం, శాంతి, సుఖసంతోషాలు, శ్రేయస్సు కలుగుతాయి. అటువంటి సులువైన పరిహారాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ కర్పూర పరిహారాలను మీరు కూడా పాటిస్తున్నారా?
స్నానం నీటిలో కలపండి
స్నానం చేసేటప్పుడు ఆ నీళ్లలో కొంచెం కర్పూరాన్ని కలపండి. ఆ నీటితో స్నానం చేయడం వలన అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా పనులు సాఫీగా సాగకపోతున్నట్లయితే ఈ పరిహారాన్ని మీరు కచ్చితంగా ప్రయత్నించండి. స్నానం చేసే నీళ్లలో కర్పూరాన్ని వేసి స్నానం చేయడం వలన మనసు, శరీరం రెండూ పవిత్రమవుతాయి. ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. గ్రహాలు కూడా మంచి ఫలితాలను తీసుకొస్తాయి.
కర్పూరం-లవంగాల పరిహారం
వెండి పాత్రలో కర్పూరం, లవంగాలను పెట్టి లక్ష్మీదేవికి సమర్పిస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఈ ఒక్క పరిహారం ఆర్థిక ఇబ్బందుల నుంచి సులువుగా గట్టెక్కించేలా చేస్తుంది. కొత్త ఆదాయ మార్గాల ద్వారా డబ్బు సంపాదించడానికి కూడా వీలవుతుంది.
ఇక్కడ కర్పూరాన్ని వెలిగిస్తే మంచిది
వాస్తు దోషాలు తొలగిపోవాలంటే మనీ ప్లాంట్ దగ్గర కర్పూరాన్ని వెలిగించండి. ఒకవేళ వెలిగించడం కుదరకపోతే కర్పూరాన్ని కుండీ పక్కన పెట్టండి. దీని వలన సానుకూల శక్తి పెరుగుతుంది. ఆర్థిక స్థిరత్వం మెరుగుపడుతుంది.
ఆర్థిక అభివృద్ధి
{{/usCountry}}వాస్తు దోషాలు తొలగిపోవాలంటే మనీ ప్లాంట్ దగ్గర కర్పూరాన్ని వెలిగించండి. ఒకవేళ వెలిగించడం కుదరకపోతే కర్పూరాన్ని కుండీ పక్కన పెట్టండి. దీని వలన సానుకూల శక్తి పెరుగుతుంది. ఆర్థిక స్థిరత్వం మెరుగుపడుతుంది.
ఆర్థిక అభివృద్ధి
{{/usCountry}}అప్పుల బాధలతో సతమతమవుతున్న వారు, వ్యాపారంలో అభివృద్ధి సాధించాలనుకునే వారు సాయంత్రం పూట కర్పూరాన్ని వెలిగిస్తే మంచిది. 108 సార్లు మహాలక్ష్మి మంత్రాన్ని జపించండి. ఇలా చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ధన, ధాన్యాలకు కొరత ఉండదు. అనేక విధాలుగా ప్రయోజనాలను పొందవచ్చు.
జపించాల్సిన మంత్రం: ఓం శ్రీ మహాలక్ష్మీ నమః
నిరాకరణ: ఈ వ్యాసంలో ఉన్న సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనదని మేము చెప్పము. మరిన్ని వివరాలు మరియు మరింత సమాచారం కోసం, సంబంధిత రంగంలో నిపుణుడిని సంప్రదించాలని నిర్ధారించుకోండి.