...
...
Next Story

భార్యాభర్తల మధ్య ప్రేమ పెరగాలా? రోజ్ వాటర్‌తో ఈ సులభ పరిహారాలు చేయండి!

రోజ్ వాటర్‌ అంటే కేవలం సువాసన ఇచ్చేది మాత్రమే కాదు, మన బంధాలను కలిపి ఉంచే అద్భుత శక్తి దానికి ఉంది. లక్ష్మీదేవి, హనుమంతుడి అనుగ్రహంతో కుటుంబంలో శాంతిని ఎలా నింపాలో ఇక్కడ చదవండి.

Published on: May 30, 2026, 14:00:55 IST
Advertisement

మన భారతీయ సంప్రదాయంలో రోజ్ వాటర్‌ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాము. సౌందర్య సాధనంగానే కాదు, ప్రశాంతత, సానుకూల శక్తికి చిహ్నంగా కూడా భావిస్తాము. దీనిని ఉపయోగించడం వలన పరిసరాలు పవిత్రంగా మారుతాయి. ప్రతికూల శక్తి ప్రభావం తగ్గి, సానుకూల శక్తి ఏర్పడుతుంది.

భార్యాభర్తల మధ్య ప్రేమ పెరగాలా? రోజ్ వాటర్‌తో ఈ సులభ పరిహారాలు చేయండి (pinterest)
భార్యాభర్తల మధ్య ప్రేమ పెరగాలా? రోజ్ వాటర్‌తో ఈ సులభ పరిహారాలు చేయండి (pinterest)

ఎప్పుడైతే ఇంటి వాతావరణం ప్రశాంతంగా, సంతోషంగా ఉంటుందో, అప్పుడు భార్యాభర్తల మధ్య ప్రేమ కూడా పెరుగుతుంది. బంధం మధురంగా మారుతుంది. కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్థలు కూడా తగ్గిపోతాయి. విడిపోయిన బంధాలు మళ్లీ చిగురిస్తాయి. మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉండాలా? దంపతుల మధ్య గొడవలు, సమస్యలు లేకుండా ఉండాలంటే ఈ రోజ్ వాటర్ పరిహారాలను పాటిస్తే సరి.

భార్యాభర్తల మధ్య అనురాగం పెరగడానికి రోజ్ వాటర్‌తో పరిహారాలు

శుక్రవారం నాడు లక్ష్మీదేవి విగ్రహానికి రోజ్ వాటర్‌ను చల్లండి. ఇది చాలా శుభప్రదమైనది. అభిషేకం తర్వాత ఆ పన్నీరును ఇంటి నలుమూలలా చల్లండి. ఇలా చేయడం వలన సానుకూల శక్తి వ్యాపిస్తుంది. భార్యా భర్తల మధ్య దూరం తగ్గి, పరస్పర గౌరవం, ప్రేమ ఏర్పడతాయి. ప్రశాంతమైన, సామరస్యపూర్వకమైన ఇంటి వాతావరణాన్ని ఏర్పరచవచ్చు.

కుటుంబంలో సంతోషం, శాంతి

ఇంట్లో ఎప్పుడూ ఒత్తిడి, వాదనలు, అశాంతి ఉంటున్నట్లయితే ఈ రోజ్ వాటర్ పరిహారం అద్భుతంగా పని చేస్తుంది. ప్రతి రోజూ రాత్రి నిద్రపోయే ముందు ఇల్లంతా కొంచెం రోజ్ వాటర్‌ను స్ప్రే చేయండి. ఇది వాతావరణాన్ని మెరుగు పరుస్తుంది. ఇంట్లో ప్రతికూల శక్తి తగ్గుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, అనురాగాలు పెరుగుతాయి. కుటుంబ సమస్యలు తగ్గుతాయి. ఆనందం ఉంటుంది.

విడిపోయిన బంధాలను మళ్లీ ఇలా కలపచ్చు

ఈ పరిహారాలు కేవలం మతపరమైన నమ్మకాల మీదే కాదు, సానుకూల ఆలోచన, దృక్పథంపై కూడా ఆధారపడి ఉంటాయి. పూర్తి భక్తితో, నిరంతరం ఆచరించడం వలన ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. కుటుంబ బంధాలు బలపడతాయి. ప్రేమ పెరుగుతుంది. బంధం దృఢంగా మారుతుంది.

నిరాకరణ: ఈ వ్యాసంలో ఉన్న సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనదని మేము చెప్పము. మరిన్ని వివరాలు మరియు మరింత సమాచారం కోసం, సంబంధిత రంగంలో నిపుణుడిని సంప్రదించాలని నిర్ధారించుకోండి.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks