...
...
Next Story

సోమవతి అమావాస్య 2026: రేపు గోధుమ పిండితో ఈ 3 పరిహారాలు చేస్తే ధన సమస్యలు దూరం!

జూన్ 15 సోమవతి అమావాస్య. మతం మరియు జ్యోతిషశాస్త్రంలో ఈ రోజుకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అమావాస్య తిథి పూర్వీకులకు అంకితం కాగా, సోమవారం శివుడి రోజుగా భావిస్తారు. ఈ రోజున ప్రజలు పూజలు, దానం మరియు అనేక రకాల నివారణలు చేయడానికి ఇదే కారణం.

Published on: Jun 14, 2026, 19:39:56 IST
Advertisement

జూన్ 15న సోమవతి అమావాస్య. హిందూ ధర్మం, జ్యోతిష్య శాస్త్రంలో ఈ రోజుకు ఎంతో విశిష్టత ఉంది. అమావాస్య తిథి పితృదేవతలకు అంకితం కాగా, సోమవారం పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఈ రెండు కలిసి రావడం వల్ల సోమవతి అమావాస్యకు విశేష ప్రాముఖ్యత ఏర్పడింది. ఈ రోజున చేసే దానధర్మాలు, పూజలు అనంతమైన ఫలితాలను ఇస్తాయని పండితులు చెబుతుంటారు. ముఖ్యంగా గోధుమ పిండితో చేసే కొన్ని జ్యోతిష్య పరిహారాలు కుటుంబంలో సుఖశాంతులను చేకూర్చడమే కాకుండా, ఆర్థిక ఇబ్బందులను తొలగిస్తాయని ప్రతీతి. ఆ పరిహారాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

సోమవతి అమావాస్య నాడు ఈ పరిహారాలు పాటిస్తే మంచిది

1.చేపలకు పిండి ముద్దలు

Somwati Amavasya
Somwati Amavasya

సోమవతి అమావాస్య రోజు ఉదయాన్నే గోధుమ పిండితో చిన్న చిన్న ఉండలు చేసి, సమీపంలోని నది, చెరువు లేదా కాలువలో ఉన్న చేపలకు తినిపించడం ఒక గొప్ప సాంప్రదాయం. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుందని, ఆర్థిక పరమైన సమస్యలు క్రమంగా తగ్గుముఖం పడతాయని భక్తుల నమ్మకం.

2.చీమలకు పిండి, చక్కెర

ఈ రోజున గోధుమ పిండిలో కొద్దిగా చక్కెర లేదా పంచదార కలిపి చీమలకు ఆహారంగా పెట్టడం చాలా శుభప్రదం. చెట్ల మొదళ్ల వద్ద లేదా చీమల పుట్టల దగ్గర ఈ మిశ్రమాన్ని వేయాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుందని, జీవితంలో ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. చాలా మంది ఈ పరిహారాన్ని నిత్యం కూడా చేస్తుంటారు.

3.పిండితో దీపారాధన

సోమవతి అమావాస్య సాయంత్రం గోధుమ పిండితో చేసిన 'చతుర్ముఖ దీపం' (నాలుగు ముఖాల దీపం) వెలిగించడం విశేషం. ఈ దీపంలో ఆవనూనె వేసి వెలిగిస్తారు. దీన్ని ఇంటి ప్రధాన ద్వారం వద్ద లేదా దక్షిణ దిశలో ఉంచడం వల్ల పితృదేవతల ఆశీస్సులు లభిస్తాయని, ఇంట్లో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని నమ్ముతారు. దీని వల్ల వాతావరణం సానుకూలంగా మారుతుంది.

4.పితృ దోష నివారణకు ఇలా చేయండి

సోమవతి అమావాస్య నాడు రావి చెట్టుకు ప్రత్యేక పూజలు చేస్తారు. చెట్టుకు నీరు పోసి, ప్రదక్షిణలు చేయడం వల్ల శుభం కలుగుతుంది. అలాగే, పరమేశ్వరుడికి అభిషేకం చేయడం ఎంతో శ్రేయస్కరం. ఈ రోజున బియ్యం, నువ్వులు, పండ్లు లేదా నిత్యావసరాలను పేదలకు దానం చేయడం వల్ల విశేష ఫలితాలు దక్కుతాయి. దానధర్మాలు చేయడానికి ఈ రోజు అత్యంత అనువైనది.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks