...
...
Next Story

భక్తి, పూజలు, నోములతో శ్రావణ మాసం సందడి.. ఈ నెలలోని ముఖ్యమైన రోజులు ఇవే!

ఆగస్టు 13, 2026 నుంచి సెప్టెంబర్ 11 వరకు శ్రావణమాసం కొనసాగనుంది. భక్తి, ఆధ్యాత్మికతకు ప్రత్యేకమైన ఈ మాసంలో నాలుగు మంగళవారాలు, నాలుగు శుక్రవారాలు రావడం విశేషం. మంగళ గౌరీ వ్రతం, వరలక్ష్మీ వ్రతం, రాఖీ పౌర్ణమి, సత్యనారాయణ వ్రతం, శ్రీకృష్ణ జన్మోత్సవం వంటి పర్వదినాలను భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు.

Published on: Aug 10, 2026, 12:30:57 IST
Advertisement

శ్రావణమాసం అంటే భక్తికి, ఆధ్యాత్మికతకు నెలవు. సంవత్సరంలో ఐదవ పవిత్రమైన మాసం శ్రావణమాసం. శ్రావణ మాసంలో చంద్రుడు శ్రవణా నక్షత్రంలో సంచరిస్తాడు కాబట్టి దీనికి శ్రావణమాసం అని పేరు. ఈ ఏడాది శ్రావణమాసం ఆగస్టు 13, గురువారం నుంచి ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ 11, శుక్రవారంతో ముగుస్తుంది.

భక్తి, పూజలు, నోములతో శ్రావణమాసం సందడి.. ఈ నెలలోని ముఖ్యమైన రోజులు ఇవే! (pinterest)
భక్తి, పూజలు, నోములతో శ్రావణమాసం సందడి.. ఈ నెలలోని ముఖ్యమైన రోజులు ఇవే! (pinterest)

ఈసారి శ్రావణ మాసంలో నాలుగు శుక్రవారాలు వచ్చాయి. పౌర్ణమి తిథి కూడా శుక్రవారం వచ్చింది. సాధారణంగా చూసినట్లయితే, శ్రావణ పౌర్ణమి కంటే ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తాము. ఈ ఏడాది పౌర్ణమి శుక్రవారం రావడంతో, ఆ ముందు వారం వరలక్ష్మీ వ్రతాన్ని జరుపుకోవాలని, పౌర్ణమి నాడు శుక్రవారం రావడంతో ఆ రోజు కూడా పున్నమి గడియలు దాటకుండా వ్రతం చేయొచ్చు.

శ్రావణ మంగళవారాలు, శుక్రవారాలు

ఈసారి శ్రావణ మంగళవారాలు 4 వచ్చాయి. ఆ నాలుగు మంగళవారాల్లో మంగళ గౌరీ వ్రతం చేసుకోవచ్చు. సెప్టెంబర్ 11, శుక్రవారం వచ్చింది. కానీ అమావాస్యతో శ్రావణ మాసం పూర్తవుతుంది. భాద్రపద మాసం వస్తుంది.

శ్రావణమంతా సందడి

శ్రావణమాసం అంటే నిజంగా ఒక సందడి అని చెప్పొచ్చు. సాంప్రదాయ వస్త్రాలను కట్టుకుని ఆడపడుచులు పూజలు, నోములు వంటివి చేస్తారు. శ్రావణ మాసం చాలా విశేషమైనది. శ్రవణం విష్ణుమూర్తి జన్మ నక్షత్రం కూడా. పార్వతీ పరమేశ్వరులతో పాటు లక్ష్మీదేవిని, శ్రీమన్నారాయణుడిని ఈ నెలలో కొలిస్తే ఏ విశేషమైన ఫలితాలను చూడొచ్చు.

అలాగే, శ్రావణ మాసంలో వచ్చే సోమవారం నాడు శివుడిని ఆరాధించే రుద్రాభిషేకాలు చేయించడం వలన అద్భుతమైన ఫలితాలను చూడొచ్చు. ఆ పరమేశ్వరుడికి పాలు, నీళ్లతో అభిషేకం చేస్తే చాలా మంచిది.

మంగళ గౌరీ వ్రతం

శ్రావణమాసంలో వచ్చే పౌర్ణమిని రాఖీ పౌర్ణమి లేదా జంధ్యాల పౌర్ణమి అని అంటారు. వేద అధ్యయనం చేసిన వారందరూ కొత్త యజ్ఞోపవీతాన్ని ధరిస్తారు. విష్ణు అవతారమైనటువంటి హయగ్రీవుడు కూడా అదే రోజు అవతరించాడని పురాణాలు చెబుతున్నాయి.

పౌర్ణమి నాడు సత్యనారాయణ వ్రతం చేసుకుంటే కూడా చాలా మంచిది.

శ్రావణ మాసంలో వచ్చే బహుళ అష్టమి నాడు కృష్ణుడు జన్మించాడు. ఆరోజు కృష్ణుడిని ఆరాధిస్తే చాలా మంచిది. కృష్ణ మందిరాల్లో స్వామిని అందంగా అలంకరించి, వైభవంగా ఉత్సవాలను జరుపుతారు.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks