మరి కొన్ని రోజుల్లో ఆషాఢమాసం పూర్తయిపోయి, శ్రావణ మాసం రాబోతోంది. శ్రావణ మాసంలో శివుడిని ప్రత్యేకించి ఆరాధిస్తారు. అలాగే శ్రావణ మంగళవారం, శుక్రవారం నాడు గౌరీ దేవిని, వరలక్ష్మీ దేవిని ఆరాధిస్తారు. హిందూ సంప్రదాయంలో ఈ నెల భక్తికి, ఆధ్యాత్మికతకు నెలవు.

ఇది తెలుగు మాసాల్లో ఐదవ మాసం. జూలై మధ్య నుంచి ఆగస్టు చివరిదాకా వస్తూ ఉంటుంది. ఈసారి శ్రావణ మాసం ఆగస్టు 13న ప్రారంభం కాబోతోంది. సెప్టెంబర్ 14 వరకు శ్రావణమాసం ఉంటుంది. ఈ నెలలో కొన్ని పనులు చేయడం వలన అద్భుతమైన ఫలితాలను చూడొచ్చు.
శ్రావణమాసం ఎందుకు అంత ప్రత్యేకమైనది?
శ్రావణ మాసాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తారు. ముఖ్యంగా శివుడికి ఈ మాసం చాలా ఇష్టమైనది. ఈ నెలలో శివుని ఆరాధించడం వలన ఆ పరమేశ్వరుని అనుగ్రహం కలుగుతుంది. శ్రావణమాసంలో చేసే ఉపవాసాలు, వ్రతాలు, పూజలు చాలా విశేషమైనవి. శివుడిని ఆరాధించడంతోపాటుగా లక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని, గౌరీదేవిని ఆరాధించడం వలన మంచి ఫలితాలను చూడొచ్చు.
స్త్రీలకు సౌభాగ్యాన్ని ఇచ్చే ఈ నెలలో పెళ్లిళ్లు, గృహప్రవేశాలు లాంటి శుభకార్యాలను కూడా ప్రారంభించడానికి అనుకూలంగా ఉంటుంది. ఆధ్యాత్మికపరంగా చూసినట్లయితే, ఈ నెల చాలా కీలకమైనది. ప్రతిరోజు దీపారాధన చేయడంతో పాటుగా, ముఖ్య రోజుల్లో వ్రతాలు, పూజలు చేయడం వలన ఇంట్లో ఆధ్యాత్మిక వాతావరణం ఏర్పడుతుంది.
శ్రావణ మాసంలో ఎలాంటి నియమాలను పాటించాలి?
శ్రావణ మాసంలో కేవలం పూజలే కాదు, కొన్ని నియమాలను పాటించడం వలన కూడా ఎంతో పుణ్యం కలుగుతుంది.
నిత్య కర్మలు:
{{/usCountry}}శ్రావణ మాసంలో కేవలం పూజలే కాదు, కొన్ని నియమాలను పాటించడం వలన కూడా ఎంతో పుణ్యం కలుగుతుంది.
నిత్య కర్మలు:
{{/usCountry}}శ్రావణ మాసంలో ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసి, దేవుని ధ్యానించాలి. శ్రావణ మాసంలో పుణ్యక్షేత్రాలను సందర్శిస్తే కూడా మంచిదే.
దానధర్మాలు:
ఈ అద్భుతమైన మాసంలో పేదవారికి, అవసరమైన వారికి వస్త్రదానం, అన్నదానం వంటివి చేస్తే కూడా మంచి ఫలితాలను చూడొచ్చు.
ప్రత్యేక పూజలు:
శ్రావణ మాసంలో వచ్చే పర్వదినాల్లో ప్రత్యేక పూజలను ఆచరించడం వలన ఆ దైవానుగ్రహం మనపై ఉంటుంది. అనేక విధాలుగా ప్రయోజనాలు లభిస్తాయి.
శ్రావణ మాసం ప్రత్యేకతపై పురాణాలు, కథలు
శ్రావణ మాసానికి సాంప్రదాయక ప్రాధాన్యతను పెంచే పురాణ కథలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
శ్రీకృష్ణుని జన్మ కథ:
కృష్ణాష్టమి రోజు కృష్ణుడు ఎలా జన్మించాడు, ఆయన బాల్యం గురించి కథలు ఉన్నాయి.
గౌరీ పార్వతి వ్రత కథ:
పార్వతీ దేవి శివుని భర్తగా పొందడానికి తపస్సులు, వ్రతాలు చేసింది కూడా తెలుసుకోవాల్సిన విషయం.
శ్రావణమాసంలో ప్రత్యేక వ్రతాలు
శ్రావణమాసంలో కొన్ని రకాల వ్రతాలు ఆచరించడం వలన మంచి ఫలితాలను చూడొచ్చు.
శ్రావణ సోమవారం:
శ్రావణమాసంలో వచ్చే సోమవారాలు చాలా విశేషమైనవి. శ్రావణ సోమవార వ్రతం చేయడం వలన మంచి ఫలితం ఉంటుంది. శివుడికి అత్యంత ప్రీతికరమైనది ఇది కాబట్టి, ఈ వ్రతాన్ని ఆచరిస్తే ఆరోగ్యం, సంపద కలుగుతాయి.
శ్రావణ మంగళవారాలు:
శ్రావణ మంగళవారాలు నాడు మంగళ గౌరీ వ్రతం ఆచరించడం వలన బాగా కలిసి వస్తుంది. అలాగే సౌభాగ్యం కోసం వ్రతాలు చేయాలనుకుంటే, ఈ వ్రతాన్ని కచ్చితంగా చేయండి.
వరలక్ష్మీ వ్రతం:
శ్రావణమాసంలో వచ్చే వరలక్ష్మీ వ్రతం చాలా విశేషమైనది. ఆ రోజు గణపతి పూజ చేసి, వరలక్ష్మీ దేవిని ఆరాధించి, వ్రత కథ చదువుకుని, ముత్తయిదువులకు తాంబూలం ఇవ్వడం వలన మంచి ఫలితం ఉంటుంది. ఆ అమ్మ అనుగ్రహంతో సంతోషంగా ఉండొచ్చు.