...
...
Next Story

శ్రావణ పౌర్ణమి 2026: పూజా సమయం, జపం, దానం, పరిహారాల పూర్తి వివరాలు!

శ్రావణ పౌర్ణమికి ఆధ్యాత్మిక, మతపరమైన ప్రాధాన్యత ఉందని సంప్రదాయ విశ్వాసం. 2026లో శ్రావణ శుక్ల పౌర్ణమి ఆగస్టు 27 ఉదయం 9:09కి ప్రారంభమై, ఆగస్టు 28 ఉదయం 9:47కి ముగుస్తుందని, ఉదయ తిథి ప్రకారం ఆగస్టు 28న పౌర్ణమిని జరుపుకోవాలని ఈ కథనం పేర్కొంది.

Published on: Aug 24, 2026, 12:40:46 IST
Advertisement

శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి ఉన్న విశేషత గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. శ్రావణ పౌర్ణమి ప్రత్యేకమైన ఆధ్యాత్మిక, మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. శ్రావణ మాసంలో వచ్చే ఈ పౌర్ణమిని సరిగ్గా సద్వినియోగం చేసుకోవడం మంచిదే. ఆ రోజు శివుడు, పార్వతీ దేవి, లక్ష్మీదేవిని పూజిస్తే చాలా మంచిది. అలాగే చంద్రుడిని కూడా ఆరాధిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. శ్రావణ పౌర్ణమి తేదీ, సమయంతో పాటుగా ఆ రోజు ఏం చేయాలి, ఎలాంటి పరిహారాలను పాటిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

శ్రావణ పౌర్ణమి 2026

శ్రావణ పౌర్ణమి 2026: పూజా సమయం, జపం, దానం, పరిహారాల పూర్తి వివరాలు! (pinterest)
శ్రావణ పౌర్ణమి 2026: పూజా సమయం, జపం, దానం, పరిహారాల పూర్తి వివరాలు! (pinterest)

శ్రావణ పౌర్ణమి తేదీ విషయానికి వస్తే, ఈ ఏడాది శ్రావణ శుక్ల పౌర్ణమి ఆగస్టు 27 ఉదయం 9:09కి మొదలవుతుంది. ఆగస్టు 28 ఉదయం 9:47తో ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం శ్రావణ పౌర్ణమిని ఆగస్టు 28, శుక్రవారం నాడు జరుపుకోవాలి.

శ్రావణ పౌర్ణమి వేళ ఈ పొరపాట్లు చేయొద్దు

శ్రావణ పౌర్ణమి నాడు శివుని ఆరాధించడం వలన ఎంతో విశేషమైన ఫలితాలను పొందడానికి వీలవుతుంది. అయితే, ఆ రోజు కొన్ని తప్పులు చేయకూడదు. ముఖ్యంగా శివుడికి కొన్ని వస్తువులను సమర్పించకూడదు.

తులసి ఆకులు, పసుపు, కుంకుమలను శివలింగానికి సమర్పించకూడదు.

పురాణ విశ్వాసాల ప్రకారం, కేతకి పువ్వుని కూడా శివుడికి సమర్పించడం మంచిది కాదు.

పూజ స్థలం చుట్టూ చెత్తాచెదారం ఉంటే తొలగించాలి. అలా ఉంటే ప్రతికూల శక్తి ఏర్పడి, సానుకూల శక్తి దూరమవుతుంది. శివుడికి పూలను సమర్పించేటప్పుడు తాజా పూలను మాత్రమే సమర్పించాలి. వాడిపోయిన పూలు, ముందు రోజు పూలు దేవుడి దగ్గర ఉండకూడదు. వాటిని ఎప్పటికప్పుడు తొలగించాలి.

శ్రావణ పౌర్ణమి నాడు పెద్దలను అవమానించడం, వారితో గొడవ పడడం, వారిని బాధ పెట్టడం, కోపంతో మాట్లాడటం వంటివి చేయకూడదు. అలా చేయడం వలన ప్రశాంతత తగ్గిపోతుంది. ఆ భగవంతుని అనుగ్రహం కూడా కలగదు.

శివలింగానికి స్వచ్ఛమైన నీటితో అభిషేకం చేయండి. బిల్వదళాలను సమర్పించండి. శ్రావణ మాసంలో శివుని ఆరాధిస్తే చాలా మంచిది. ముఖ్యంగా పౌర్ణమి నాడు తప్పక ఆరాధించండి.

2.శివనామ జపం:

108 సార్లు “ఓం నమః శివాయ” అనే మంత్రాన్ని జపించండి. ఇది కూడా మీకు మంచి ఫలితాలను తీసుకువస్తుంది.

3.అన్నదానం:

పేదలకు, అవసరమైన వారికి అన్నం, పండ్లు, అవసరమైన వస్తువులు వంటివి దానం చేయండి. ఇది కూడా మంచి ఫలితాలను తీసుకువస్తుంది.

4.నెయ్యితో దీపారాధన:

సాయంత్రం పూజ మందిరంలో నెయ్యి దీపాన్ని వెలిగించండి. కుటుంబంలో శాంతి, ఐశ్వర్యం కలుగుతాయి.

5.చంద్రుడికి అర్ఘ్యం సమర్పించండి:

శ్రావణ పౌర్ణమి రోజు రాత్రి చంద్రుడికి నీటితో అర్ఘ్యం సమర్పించండి. దీని వలన మనశ్శాంతి కలుగుతుంది, సంతోషంగా ఉండొచ్చు.

6.చెడు అలవాట్లను వదిలేయండి:

శ్రావణ పౌర్ణమి నాడు చెడు అలవాట్లను విడిచిపెట్టే సంకల్పం చేసుకోండి. ఆధ్యాత్మికంగా మంచి సాధనగా భావించొచ్చు.

శ్రావణ పౌర్ణమి పూజ విధానం

సూర్యోదయానికి ముందే లేచి తలస్నానం చేసి, ఇంటిని శుభ్రం చేసుకుని, పూజ మందిరంలో దీపం వెలిగించండి.

తర్వాత గణపతి పూజ చేసి, ఇష్టదైవాన్ని ఆరాధించండి.

శివుడికి కచ్చితంగా బిల్వదళాలను సమర్పించి, “ఓం నమః శివాయ” అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి.

శ్రావణ పౌర్ణమి నాడు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే కూడా మంచిది.

విష్ణుమూర్తిని కూడా ఆరాధించి, తులసి దళాలను సమర్పించండి.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks