నేడు గణపతి అనుగ్రహంతో శుభ యోగాలు.. ఈ 6 రాశిచక్రాల జీవితంలో పెద్ద మార్పులు!
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు, నక్షత్రాల సంచారం మన జీవితంపై ప్రత్యేక ప్రభావం చూపుతుందని విశ్వసిస్తారు. బుధవారం విఘ్నేశ్వరుడి ఆరాధనకు అత్యంత ప్రాముఖ్యత ఉన్న రోజు. ఈ రోజున గణపతిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే విఘ్నాలు తొలగి, శుభఫలితాలు కలుగుతాయని నమ్మకం.
జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి రోజూ ప్రత్యేకమైనదే. గ్రహాలు, నక్షత్రాల గమనం ఆధారంగా ఆయా రాశుల ఫలిమాలను బేరీజు వేస్తారు. బుధవారం విఘ్నేశ్వరుడి పూజకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ రోజు గణనాథుడిని మనసారా ఆరాధించడం వల్ల సకల సంపదలు చేకూరుతాయని, విఘ్నాలు తొలగిపోతాయని విశ్వాసం. నేటి జ్యోతిష్య గణనల ప్రకారం.. కొన్ని రాశుల వారికి ఈ రోజు అద్భుతమైన ప్రయోజనాలు చేకూరనుండగా, మరికొన్ని రాశుల వారు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.

ఈరోజు రాశి ఫలాలు
మేష రాశి
మేష రాశి వారికి నేడు కెరీర్ పరంగా కొత్త సవాళ్లు ఎదురవుతాయి. వీటిని ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగితే మంచి గుర్తింపు లభిస్తుంది. బంధుమిత్రులతో ఏర్పడే చిన్నపాటి మనస్పర్థలను పరిపక్వతతో పరిష్కరించుకోండి.
వృషభ రాశి
ఈ రాశి వారు ప్రేమ వ్యవహారాల్లో అహంకారానికి తావు ఇవ్వకూడదు. వృత్తి జీవితంలో క్రమశిక్షణ మిమ్మల్ని విజయతీరాలకు చేరుస్తుంది.
మిథున రాశి
మిథున రాశి వారికి ఊహించని మార్పులు ఎదురవుతాయి. ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తే ఆర్థిక లక్ష్యాలను సులభంగా సాధించవచ్చు.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారు భాగస్వామ్యంతో జరిగే చర్చల్లో కాస్త సంయమనం పాటించడం మంచిది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది.
సింహ రాశి
ఈ రాశి వారు ఇతరుల సలహాలను స్వీకరించడానికి వెనుకాడకండి. సహనంతో వ్యవహరిస్తే అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి.
కన్య రాశి
ఈ రాశి వారు కార్యాలయంలో కొత్త బాధ్యతలను స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి. మీ దయాగుణం చుట్టూ ఉన్నవారితో సత్సంబంధాలను బలపరుస్తుంది.
తులా రాశి
తులా రాశి వారు ప్రతి పనిని ఎంతో జాగ్రత్తగా, స్థిరమైన ఆలోచనలతో పూర్తి చేస్తారు. అనుకున్నవన్నీ కూడా ఆటంకం లేకుండా జరుగుతాయి.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి ప్రేమ జీవితంలో కొన్ని విభేదాలు తలెత్తినప్పటికీ, వాటిని ప్రశాంతంగా పరిష్కరించుకోవాలి. సురక్షితమైన పెట్టుబడులపై దృష్టి పెట్టడం మంచిది.
ధనుస్సు రాశి
ఈ రాశి వారు ఆర్థిక విషయాల్లో పక్కా ప్రణాళికతో ముందుకు సాగితే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు.
మకర రాశి
మకర రాశి వారికి కుటుంబంతో గడిపే సమయం మానసిక ఉల్లాసాన్ని ఇస్తుంది. చిన్న చిన్న విషయాలకే ఆనందాన్ని పొందే రోజు ఇది.
కుంభ రాశి
ఈ రాశి వారు ఇతరుల బాగోగులు చూసుకుంటూనే, సొంత అవసరాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి.
మీన రాశి
ప్రేమ వ్యవహారాల్లో ఏ ఇబ్బంది ఉండదు. వృత్తిపరంగా ఉన్నత అవకాశాలు తలపు తడుతాయి. ఆరోగ్యం పూర్తిగా సహకరిస్తుంది.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


