శ్రావణ మాసం మొదటి సోమవారం వేళ తెలుగు రాష్ట్రాల్లో శివాలయాలు శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. నేడు నాగుల పంచమి పర్వదినం కూడా తోడవడంతో భక్తులు ఉదయమే లేచి శివాలయాలను దర్శించుకుంటున్నారు. ఈ ప్రత్యేక రోజున ఉపవాసాలు ఆచరించి, పరమశివుని పూజించడంతో పాటు సోమవార వ్రత కథను చదవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా భక్తుల కోసం ఆ పవిత్ర వ్రత కథ మరియు విశేషాలు ఇక్కడ తెలుసుకుందాం.
వ్రత కథ

నాటి రోజుల్లో ఒక ధనవంతుడైన షావుకారు ఉండేవాడు. ఆయన నిత్యం శివ భజన చేస్తూ, పరమ శివ భక్తుడిగా పేరుగాంచాడు. ఆయన వద్ద సమస్త సంపదలు ఉన్నప్పటికీ, సంతానం మాత్రం లేదు. ఆ లోటుతోనే ఆయన ప్రతి సోమవారం వ్రతం ఆచరిస్తూ, శివాలయానికి వెళ్లి దీపారాధన చేసేవాడు.
ఒకరోజు పరమ శివుడిని పార్వతీ దేవి ఇలా ప్రశ్నించింది. "మహారాజ్, ఈ షావుకారు మీపై అచంచల భక్తి కలిగి ఉన్నాడు. ఎల్లప్పుడూ మిమ్మల్ని పూజిస్తున్నాడు. మరి ఆయన కోరికను ఎందుకు నెరవేర్చడం లేదు?" అని అడిగింది. అప్పుడు శివుడు, "దేవి, మనిషి ఎటువంటి బీజాన్ని నాటుతాడో అటువంటి పంటనే కోస్తాడు" అని బదులిచ్చాడు. భక్తుడి దుఃఖాన్ని చూడలేక పార్వతీ దేవి పట్టుబట్టడంతో, శివుడు ఒక వరం ప్రసాదించాడు. "అతని భవితవ్యంలో సంతానం లేదు. అయినప్పటికీ నేను పుత్రుడిని ప్రసాదిస్తాను. కానీ ఆ బాలుడు కేవలం పన్నెండు సంవత్సరాలు మాత్రమే ఆయువు కలిగి ఉంటాడు" అని శివుడు స్పష్టం చేశాడు.
కుమారుడి జననం - తల్లిదండ్రుల ఆందోళన
శివ పార్వతుల సంభాషణను సాహుకారు విన్నప్పటికీ, దైవ భక్తిని వీడలేదు. కాలక్రమేణా సాహుకారు భార్య గర్భం దాల్చి, పదవ నెలలో ఒక సుందరమైన మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే బిడ్డ పుట్టినప్పటికీ సాహుకారు సంతోషపడలేదు. ఎందుకంటే ఆ బాలుడి ఆయువు పన్నెండు సంవత్సరాలేనని అతనికి తెలుసు.
బాలుడికి పదకొండేళ్లు నిండిన తర్వాత, తల్లి వివాహం గురించి ప్రస్తావించగా, తండ్రి మాత్రం నిరాకరించి, కాశీకి చదువుకోవడానికి పంపిస్తానని చెప్పాడు. బాలుడి మేనమామను పిలిచి, దారాళంగా ధనం ఇచ్చి కాశీకి తీసుకెళ్లమనీ, దారిలో ఎక్కడ కనిపించినా యజ్ఞాలు చేయిస్తూ, బ్రాహ్మణులకు దానధర్మాలు చేస్తూ వెళ్లాలని సూచించాడు.
విచిత్ర వివాహం - కాశీ ప్రయాణం
{{/usCountry}}బాలుడికి పదకొండేళ్లు నిండిన తర్వాత, తల్లి వివాహం గురించి ప్రస్తావించగా, తండ్రి మాత్రం నిరాకరించి, కాశీకి చదువుకోవడానికి పంపిస్తానని చెప్పాడు. బాలుడి మేనమామను పిలిచి, దారాళంగా ధనం ఇచ్చి కాశీకి తీసుకెళ్లమనీ, దారిలో ఎక్కడ కనిపించినా యజ్ఞాలు చేయిస్తూ, బ్రాహ్మణులకు దానధర్మాలు చేస్తూ వెళ్లాలని సూచించాడు.
విచిత్ర వివాహం - కాశీ ప్రయాణం
{{/usCountry}}మామా-అల్లుళ్లు ప్రయాణమై వెళ్తుండగా మార్గమధ్యంలో ఒక నగరానికి చేరుకున్నారు. అక్కడ రాజు కూతురి వివాహం జరుగుతోంది. అయితే పెళ్లికి వచ్చిన రాజకుమారుడు ఒక్క కన్ను లేనివాడు. ఆ విషయం బయటపడితే వివాహం ఆగిపోతుందని భావించిన రాజకుమారుడి తండ్రి, అందంగా ఉన్న ఇతన్ని చూసి ఒక ఉపాయం ఆలోచించాడు.
ఆ షావుకారి కుమారుడితో మాట్లాడి, అసలు రాజకుమారుడి స్థానంలో వివాహం జరిపించి, చివరకు రాజకుమారుడితో అమ్మాయిని కాశీ పంపాలని నిర్ణయించారు. వివాహం ఘనంగా ముగిసింది. అయితే, బాలుడు అక్కడి నుండి బయలుదేరే ముందు, వధువు వస్త్రంపై "నీ వివాహం నాతో జరిగింది, కానీ పంపేది వేరే వ్యక్తితో. నేను కాశీకి చదువుకోవడానికి వెళ్తున్నాను" అని రాసి వెళ్లాడు. ఆ మాటలు చూసిన రాకుమారి వెళ్లడానికి నిరాకరించింది.
శివుడి అనుగ్రహంతో పునర్జన్మ
కాశీకి చేరుకున్న బాలుడు వేదాలు అభ్యసించడం ప్రారంభించాడు. పన్నెండేళ్లు నిండగానే బాలుడికి తీవ్రమైన అస్వస్థత ఏర్పడింది. లోపలికి వెళ్లిన మేనమామ అల్లుడు విగతజీవిగా పడి ఉండటం చూసి బోరున విలపించాడు. అయితే యజ్ఞ కార్యాలు పూర్తయిన తర్వాత అందరూ చూస్తుండగా రోధించడం మొదలుపెట్టాడు.
అదే సమయంలో అటుగా వెళ్తున్న శివపార్వతులు ఆ దృశ్యాన్ని చూసి చలించిపోయారు. పార్వతీ దేవి కోరిక మేరకు పరమశివుడు ఆ బాలుడికి మళ్లీ ఆయువునిచ్చి బతికించాడు. చదువు ముగించుకుని మామతో కలిసి స్వగ్రామానికి బయలుదేరిన ఆ బాలుడిని మార్గమధ్యంలో రాజు గుర్తించి ఘనంగా సత్కరించాడు.
కుమారుడు సజీవుడిగా ఇంటికి తిరిగి రావడంతో, ప్రాణాలు విడిచేందుకు సిద్ధంగా ఉన్న ఆ తల్లిదండ్రులు పరమానందం చెందారు. కుమారుడిని, కోడలిని సాదరంగా ఆహ్వానించి జీవితాంతం ఆనందంగా గడిపారు. ఈ సోమవారం వ్రతం ఆచరించి ఈ కథ విన్నవారికి సకల సౌభాగ్యాలు చేకూరుతాయి.