...
...
Next Story

శ్రీరామనవమి నాడు శ్రీరాముడికి ఎందుకు వడపప్పు, పానకాన్ని ఎందుకు నైవేద్యంగా పెడతారు? ఈరోజు ఈ తప్పులు చెయ్యద్దు!

శ్రీరాముడు న్యాయం, ధర్మం, సత్యం, ప్రేమలకు ప్రతిరూపం. శ్రీరాముని ఆదర్శ పురుషుడిగా ఆరాధిస్తాము. అలాగే, శ్రీరామనవమి నాడు ఉపవాసం ఉండి రాముడికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఊర్లలో ఉండే రామాలయాలు అన్నీ కూడా ప్రత్యేక పూజలతో భక్తులతో కళకళ్ళాడతాయి. శ్రీరామనవమి నాడు శ్రీరామ కథను చదువుతారు.

Published on: Mar 27, 2026, 08:00:44 IST
Advertisement

ప్రతి సంవత్సరం చైత్ర మాసం శుద్ధ నవమి నాడు శ్రీరామనవమిని జరుపుకుంటాము. శ్రీరామనవమి అనేది రాముడు జన్మించిన రోజు. రాముడు విష్ణుమూర్తి అవతారం. శ్రీరాముడు న్యాయం, ధర్మం, సత్యం, ప్రేమలకు ప్రతిరూపం. శ్రీరాముని ఆదర్శ పురుషుడిగా ఆరాధిస్తాము. అలాగే, శ్రీరామనవమి నాడు ఉపవాసం ఉండి రాముడికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఊర్లలో ఉండే రామాలయాలు అన్నీ కూడా ప్రత్యేక పూజలతో భక్తులతో కళకళ్ళాడతాయి.

శ్రీరామనవమి నాడు శ్రీరాముడికి ఎందుకు వడపప్పు, పానకాన్ని ఎందుకు నైవేద్యంగా పెడతారు? (pinterest)
శ్రీరామనవమి నాడు శ్రీరాముడికి ఎందుకు వడపప్పు, పానకాన్ని ఎందుకు నైవేద్యంగా పెడతారు? (pinterest)

శ్రీరామనవమి నాడు శ్రీరామ కథను చదువుతారు. శ్రీరామనవమి నాడు రాముల వారి కళ్యాణాన్ని కూడా అంగరంగ వైభవంగా జరుపుతారు. ఈరోజు ప్రత్యేకించి రాముడికి వడపప్పు నైవేద్యంగా పెడతారు. అయితే, రాముడికి ఎందుకు శ్రీరామనవమి నాడు వడపప్పు, పానకాన్ని నైవేద్యంగా పెట్టాలి? దాని వెనుక రహస్యం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

శ్రీరాముడికి ఎందుకు వడపప్పు, పానకాన్ని నైవేద్యంగా పెడతారు?

రాముడు సూర్యవంశానికి చెందిన వాడు. శ్రీరామనవమి పండుగ సమయంలో వాతావరణం ఎంతో వేడిగా ఉంటుంది. వడపప్పు, పానకం శరీరాన్ని చల్లగా మారుస్తాయి. వేడిని తగ్గించి చల్లదనాన్ని ఇచ్చే పదార్థాలు రామయ్యకు ఇష్టమని అంటారు. ఈ రెండు పదార్థాలు కూడా శ్రీరామనవమి నాడు శ్రీరాముడికి నైవేద్యంగా సమర్పిస్తారు. వడపప్పు, పానకం వేడిని తగ్గించి చల్లదనాన్ని అందిస్తాయి. వడపప్పు అంటే పెసరపప్పును నానబెట్టి, ఆ నానబెట్టిన పెసరపప్పును నైవేద్యంగా సమర్పించడం. పెసరపప్పును నానబెట్టి, కొందరు బెల్లం, కొబ్బరి కూడా అందులో కలుపుతారు.

పెసరపప్పు వేసవి తాపం నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఈ రామనవమి వేసవిలో రావడంతో ఈ పదార్థాలు మంచివని నైవేద్యంగా సమర్పిస్తారు. పానకాన్ని బెల్లం నీటితో కలిపి తయారుచేస్తారు. అలాగే యాలకులు, మిరియాలు లాంటివి కూడా కలుపుతారు. ఇది కూడా ఆరోగ్యానికి మంచిది. ఈ నైవేద్యాలను శ్రీరాముడికి శ్రీరామనవమి నాడు సమర్పిస్తే, రాముని అనుగ్రహాన్ని పొందవచ్చని కూడా భక్తుల నమ్మకం. అందుకే పండ్లు, ఇతర నైవేద్యాలతో పాటు ఈ రెండింటినీ కూడా తప్పక పెడతారు.

శ్రీరామనవమి నాడు ఈ పనులు చేయకండి

శ్రీరామనవమి నాడు పెద్దవారిని దూషించడం, తిట్టడం, కోపానికి గురవడం మంచిది కాదు.

గోర్లు కత్తిరించుకోవడం, జుట్టు కత్తిరించుకోవడం వంటివి కూడా శ్రీరామనవమి నాడు చేయకూడదు.

శ్రీరామనవమి నాడు భార్యా భర్తలు గొడవ పడడం వంటివి చేయకూడదు. ఎవరితోనూ తగాదాలు పడకూడదు. ఇతరుల వ్యవహారాల్లో దూరితే రామయ్యకు కోపం వస్తుంది. ఫలితంగా ఆర్థిక ఇబ్బందులు, నష్టాలు కలుగుతాయి.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe