శ్రీశైలం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లా కృష్ణానది తీరంలో ఈ ప్రసిద్ధిగాంచిన క్షేత్రం ఉంది. ఇక్కడ పరమేశ్వరుడు మల్లికార్జునుడిగా పూజలు అందుకుంటారు. భ్రమరాంబిక అమ్మవారు పూజాభిషేకాలను అందుకుంటారు. పాండవులు కూడా ఈ క్షేత్రాన్ని దర్శించినట్లు, వారు ఇక్కడ ప్రతిష్ఠించిన శివలింగాలు కనపడతాయి. త్రేతాయుగంలో రాముడు కూడా ఈ క్షేత్రాన్ని దర్శించినట్లు స్థలపురాణం చెబుతోంది. అయితే చాలా మంది ప్రతి ఏటా ఈ ఆలయానికి వెళుతూ ఉంటారు. శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవస్థానానికి సంబంధించిన పూర్తి దర్శన సమాచారాన్ని ఇక్కడ తెలుసుకోండి.
శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయం సమయాలు

ప్రతిరోజు రెండు విడతలుగా శ్రీశైలం ఆలయం తెరిచి ఉంటుంది. ఉదయం 4:30 నుంచి మధ్యాహ్నం 3:30 వరకు ఆలయం తెరిచే ఉంటుంది. అలాగే మళ్లీ సాయంత్రం 4:30 నుంచి రాత్రి 10:00 వరకు ఈ ఆలయం తెరిచి ఉంటుంది. మధ్యాహ్నం 3:30 నుంచి 4:30 వరకు ఆలయ శుద్ధి చేయడానికి దర్శనాలను నిలిపివేస్తారు.
శ్రీశైలం ఆలయ దర్శనం టికెట్ల వివరాలు
సర్వదర్శనం
ఇది పూర్తిగా ఉచితం. ఎలాంటి మూల్యం చెల్లించక్కర్లేదు.
శీఘ్ర దర్శనం
ఒక్కొక్కరికి 150 రూపాయలు చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.
అతి శీఘ్ర దర్శనం
300 రూపాయలు, 500 రూపాయల టికెట్లు. రద్దీని బట్టి ప్రత్యేక లైన్‌లో పంపిస్తారు.
స్పర్శ దర్శనం
ఒక్కొక్కరికి 500 రూపాయల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. గర్భాలయ ప్రవేశం ఉంటుంది. శ్రీశైలం మల్లికార్జున స్వామి వారిని దర్శనం చేసుకోవడానికి అత్యంత విశేషమైన దర్శనం ఇది. స్వయంగా స్వామివారిని తాకి పూజించుకునే అవకాశం ఉంటుంది. రద్దీని నియంత్రించడానికి దేవస్థానం వారు దీనిని కేటాయిస్తారు.
స్పర్శ దర్శనం స్లాట్ వివరాలు
ఉదయం 7:00 నుంచి ఉదయం 8:30 వరకు,
మధ్యాహ్నం 11:45 నుంచి మధ్యాహ్నం 2:00 వరకు,
రాత్రి 9:00 నుంచి రాత్రి 11:00 వరకు.
{{/usCountry}}రాత్రి 9:00 నుంచి రాత్రి 11:00 వరకు.
{{/usCountry}}(సమయాలు మారే అవకాశం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి)
డ్రెస్ కోడ్ ఏమైనా ఉంటుందా?
అవును. శ్రీశైలం స్వామివారిని దర్శించుకోవడానికి ఈ డ్రెస్ కోడ్‌ను పాటించాలి. స్పర్శ దర్శనానికి వెళ్లేవారు కచ్చితంగా పురుషులు అయితే పంచె లేదా ధోతి వేసుకోవాలి. మహిళలు చీర లేదా చున్నీతో ఉండే చుడిదార్ ధరించొచ్చు. సాధారణ రోజుల్లో మాత్రమే స్పర్శ దర్శనానికి అవకాశం ఉంటుంది. రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ దర్శనాన్ని నిలిపివేస్తారు.
శ్రీశైలం మల్లికార్జున స్వామి ఎలా వెలిశారు?
వినాయకుడు, కుమారస్వామి ఇద్దరిలో ఎవరికి ముందు వివాహం జరిపించాలని చర్చించుకున్న పార్వతీ పరమేశ్వరులు ఒక పోటీ పెట్టారు. ముల్లోకాలను చుట్టి ఎవరైతే ముందు వస్తారో వాళ్లకే ముందు పెళ్లి చేస్తామని చెప్పారు. కుమారస్వామి నెమలి వాహనంపై బయలుదేరారు. వినాయకుడు బుద్ధిచాతుర్యంతో తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేసి, తల్లిదండ్రులకంటే మించిన లోకాలు ఏమీ లేవని చెప్పడంతో పోటీలో వినాయకుడు నెగ్గాడు.
మనస్థాపానికి గురైన కుమారస్వామి
కుమారస్వామి తిరిగి వచ్చి తీవ్ర మనస్థాపానికి గురై, తల్లిదండ్రులపై అలిగి కైలాసాన్ని వదిలిపెట్టి క్రౌంచ పర్వతానికి వెళ్లిపోయాడు. పుత్రుని వియోగం తట్టుకోలేక పార్వతీ పరమేశ్వరులు వెతుక్కుంటూ ఆ పర్వతం దగ్గరికి వచ్చారు. వారి రాక కుమారస్వామికి ఇష్టం లేదని గ్రహించి జ్యోతిర్లింగ రూపంలో పార్వతీ పరమేశ్వరులు వెలిశారు. పార్వతీదేవి మల్లికా సమేతంగా, శివుడు అర్జునుడిగా వెలిసినందుకుగాను “మల్లికార్జునుడు” అని పేరు వచ్చింది.
స్థల పురాణం
పూర్వం దక్ష ప్రజాపతి, అల్లుడైన శివుడిని అవమానించాలని బృహస్పతి యాగం చేస్తాడు. అందరినీ పిలుస్తాడు. కానీ కూతురు సతీదేవిని, అల్లుడు శివుడిని పిలవడు. అయినా కూడా శివుడు వారించినా, సతీదేవి పుట్టింటిపై మమకారంతో అక్కడికి వెళ్తుంది. అక్కడ తన తండ్రి శివుడిని నిందించడం భరించలేకపోయి సతీదేవి యోగాగ్నిలో ఆత్మాహుతి చేసుకుంటుంది.
శివుడు ఇక ఆగ్రహంతో ఆ యజ్ఞాన్ని ధ్వంసం చేశాడు. సతీదేవి నిర్జీవ శరీరాన్ని తన భుజంపై వేసుకుని లోకాలన్నీ తిరుగుతూ ప్రళయతాండవం చేసాడు శివుడు. విష్ణువు సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ఖండించగా, ఆ శరీర భాగాలు 51 ప్రదేశాల్లో పడి శక్తిపీఠాలుగా వెలిశాయి. ఇక అందులో 18 మహిమాన్వితమైనవిగా మహాశక్తి పీఠాలు ప్రసిద్ధి చెందాయి. సతీదేవి మెడ భాగం పడిన శ్రీశైలం కూడా మహాశక్తి పీఠంగా విరాజిల్లుతోంది.