శుక్ర మాహాయోగం.. శుక్రుడి సంచారంలో మార్పు, నాలుగు రాశుల జీవితంలో వెలుగులు!

గ్రహాల సంచారంలో మార్పు వచ్చినప్పుడు అది శుభ ఫలితాలు లేదా అశుభ ఫలితాలను తీసుకువస్తూ ఉంటుంది. జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉంటే అందం, ఆనందం, ప్రేమ వంటి వాటిపై ప్రభావం పడుతుంది. శుక్రుడు ప్రేమ, అందం, విలాసాలు, డబ్బు, సంతోషం మొదలైన వాటికి కారకుడు. డిసెంబర్ 30న శుక్రుడు పూర్వాషాఢ నక్షత్రంలోకి వెళ్తాడు.

Published on: Dec 17, 2025, 10:01:08 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వచ్చినప్పుడు అది శుభ ఫలితాలు లేదా అశుభ ఫలితాలను తీసుకువస్తూ ఉంటుంది. జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉంటే అందం, ఆనందం, ప్రేమ వంటి వాటిపై ప్రభావం పడుతుంది. శుక్రుడు ప్రేమ, అందం, విలాసాలు, డబ్బు, సంతోషం మొదలైన వాటికి కారకుడు.

శుక్ర మహాయోగం
శుక్ర మహాయోగం

శుక్ర సంచారం

శుక్రుడు కాలానుగుణంగా తన రాశులను మారుస్తూ ఉంటాడు. అలాగే నక్షత్ర సంచారం కూడా చేస్తూ ఉంటాడు. డిసెంబర్ 30న శుక్రుడు మూలా నక్షత్రం నుంచి పూర్వాషాఢ నక్షత్రంలోకి వెళ్తాడు. దీంతో కొన్ని రాశుల వారికి బాగా కలిసి వస్తుంది. శుక్రుడు పూర్వాషాఢ నక్షత్రంలోకి ప్రవేశించడంతో ఏ రాశుల వారు శుభ ఫలితాలను పొందుతారు? ఎవరికి అదృష్టం పెరుగుతుంది? ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడే తెలుసుకుందాం.

శుక్ర మహాయోగం

శుక్రుడు పూర్వాషాఢ నక్షత్రంలోకి ప్రవేశించడంతో కొన్ని రాశుల వారికి విభిన్నంగా కలిసి రాబోతోంది. ఈ రాశుల వారు అనేక విధాలుగా లాభాలను పొందుతారు. మరి అదృష్ట రాశులు ఎవరు? ఈ రాశులు మీరు ఒకరేమో చూసుకోండి.

1.వృషభ రాశి

వృషభ రాశి వారికి ఈ సంచారం బాగా కలిసి రాబోతోంది. ఈ సమయంలో ఈ రాశి వారు కష్టాల నుంచి బయటపడతారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. సానుకూల మార్పులు చూస్తారు. వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది. కొత్త ఇల్లు కొనుగోలు చేయడానికి కూడా ఇది అద్భుత సమయం.

2.తులా రాశి

తులా రాశి వారికి శుక్ర సంచారం బాగా కలిసి రాబోతోంది. వ్యాపారవేత్తలకు ఎక్కువ లాభాలు వస్తాయి. మానసికంగా దృఢంగా ఉంటారు. పిల్లల నుంచి కూడా శుభవార్తలను వింటారు. పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు వస్తాయి.

3.మకర రాశి

మకర రాశి వారికి కూడా శుక్ర నక్షత్ర సంచారం బాగా కలిసి రాబోతుంది. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి అలా నెరవేరుతుంది. కెరీర్‌లో మంచి మార్పులను చూస్తారు. శుక్ర సంచారం కారణంగా ఆస్తికి సంబంధించిన పనులు కూడా మీకు కలిసి వస్తాయి. ఎప్పటి నుంచో వెంటాడుతున్న సమస్యలు ఈ సమయంలో పరిష్కారం అవుతాయి. ఒత్తిడి నుంచి బయటపడతారు. విజయాలను అందుకుంటారు.

4.మీన రాశి

మీన రాశి వారికి శుక్ర నక్షత్ర సంచారం స్వర్ణయుగమే. ఈ రాశి వారు ఈ సమయంలో ఆనందంగా ఉంటారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. వివాహం వంటి శుభకార్యాలు నెరవేరుతాయి. నైపుణ్య రంగంలో పనిచేసే వారికి కూడా ఇది మంచి సమయం. ఇలా ఈ రాశి వారు కూడా అనేక విధాలుగా లాభాలను పొందుతారు.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More