జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత శుభప్రదమైన గ్రహంగా, సంపద, వైభవం, లగ్జరీ జీవితానికి కారకుడిగా శుక్రుడిని భావిస్తారు. అటువంటి శుక్రుడు ప్రస్తుతం తన స్థానాన్ని మార్చుకుని సూర్యుడికి చెందిన సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఆగస్టు 1వ తేదీ వరకు శుక్రుడు ఇదే రాశిలో ఉంటాడు. అయితే, జూలై 29న మరో కీలక మార్పు జరగబోతోంది.

ఆ రోజున శుక్రుడు సూర్యుడి నక్షత్రమైన ఉత్తరాఫాల్గుణిలోకి ప్రవేశించి, ఆగస్టు 11 వరకు అక్కడే ఉంటాడు. రాశి, నక్షత్రం రెండూ సూర్యుడివే కావడంతో శుక్రుడిపై సూర్యుడి ‘డబుల్ ఎఫెక్ట్’ పడనుందని ప్రముఖ జ్యోతిష్య నిపుణులు పండిత్ నరేంద్ర ఉపాధ్యాయ్ వెల్లడించారు. ఈ గ్రహాల కలయిక కొన్ని రాశుల వారికి అద్భుతమైన యోగాన్ని, మరికొన్ని రాశుల వారికి సవాళ్లను తీసుకురాబోతోంది.
మీన రాశికి పట్టనున్న రాజయోగం
సూర్యుడి రాశి, నక్షత్రాల ప్రభావం వల్ల ఏర్పడుతున్న ఈ డబుల్ ఎఫెక్ట్ కొన్ని రాశుల జాతకాలను పూర్తిగా మార్చేయనుంది. ఇందులో అన్నిటికంటే ఎక్కువగా లబ్ధి పొందేది మీన రాశి వారే.
"ఈ సమయంలో మీన రాశి వారికి కెరీర్‌లో సరికొత్త మైలురాళ్లు అందుతాయి. ఆకస్మిక ధనలాభంతో పాటు సమాజంలో గౌరవ మర్యాదలు అసాధారణంగా పెరుగుతాయి," అని పండిత్ నరేంద్ర ఉపాధ్యాయ్ వివరించారు.
ఈ 9 రాశులకు తిరుగులేని అదృష్టం
మీన రాశితో పాటు మరో 9 రాశుల వారికి ఈ గ్రహాల కదలిక అద్భుతమైన ఫలితాలను ఇవ్వబోతోంది. మేషం, కర్కాటకం, మిథునం, సింహం, కన్య, వృశ్చికం, ధనుస్సు, కుంభం, మకర రాశుల వారికి అదృష్టం తోడుంటుంది.
సాధారణంగా శుక్ర, సూర్యుల ప్రభావం కలిసినప్పుడు ఆర్థిక స్థితిగతుల్లో కీలక మార్పులు వస్తాయి. ఈ రాశుల వారికి ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కెరీర్‌లో ప్రమోషన్లు, కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. సమాజంలో పలకుబడి ఉన్న వ్యక్తుల పరిచయాలు వ్యాపార వృద్ధికి తోడ్పడతాయి. సొంత ఇల్లు, భూమి లేదా కొత్త వాహనం కొనుగోలు చేసేందుకు బలమైన యోగాలు ఉన్నాయి. కుటుంబంలో చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలు తొలిగిపోయి ప్రశాంతత చేకూరుతుంది.
ఈ రెండు రాశుల వారు అలర్ట్ అవ్వాల్సిందే!
{{/usCountry}}సాధారణంగా శుక్ర, సూర్యుల ప్రభావం కలిసినప్పుడు ఆర్థిక స్థితిగతుల్లో కీలక మార్పులు వస్తాయి. ఈ రాశుల వారికి ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కెరీర్‌లో ప్రమోషన్లు, కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. సమాజంలో పలకుబడి ఉన్న వ్యక్తుల పరిచయాలు వ్యాపార వృద్ధికి తోడ్పడతాయి. సొంత ఇల్లు, భూమి లేదా కొత్త వాహనం కొనుగోలు చేసేందుకు బలమైన యోగాలు ఉన్నాయి. కుటుంబంలో చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలు తొలిగిపోయి ప్రశాంతత చేకూరుతుంది.
ఈ రెండు రాశుల వారు అలర్ట్ అవ్వాల్సిందే!
{{/usCountry}}ఈ డబుల్ ఎఫెక్ట్ అందరికీ కలిసి వస్తుందని చెప్పలేం. వృషభం, తులా రాశుల వారికి ఈ సమయం కాస్త కఠినంగా మారే అవకాశం ఉంది. ఈ కాలంలో శుక్రుడు పూర్తిగా అస్తమిస్తాడు. జ్యోతిష్య నిపుణుల ప్రకారం, గ్రహం అస్తమించినప్పుడు దాని శుభ ప్రభావం చాలా వరకు తగ్గిపోతుంది. వృషభం, తులా రాశులకు శుక్రుడే అధిపతి కావడంతో ఆ రాశుల వారిపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
"వృషభ, తులా రాశుల వారు ఆర్థిక లావాదేవీల్లో అత్యంత అప్రమత్తంగా ఉండాలి," అని జ్యోతిష్యులు హెచ్చరిస్తున్నారు. వాహనాలు నడిపేటప్పుడు వేగ నియంత్రణ ముఖ్యం. ఉద్యోగాల్లో పైఅధికారులతో విభేదాలు వచ్చే ఛాన్స్ ఉంది. ప్రేమ వ్యవహారాల్లో సైతం అపార్థాలు తలెత్తి బంధాలు దెబ్బతినే ప్రమాదం ఉంది కాబట్టి మాట తీరుపై నియంత్రణ అవసరం.