సూర్య-చంద్రుల కలయికతో వ్యతిపాత యోగం.. 2026 ప్రారంభంలోనే ఈ ఐదు రాశులకు అపార ధన లాభం!
గ్రహాల సంచారంలో మార్పు వస్తుంది. ఇది అన్ని రాశుల వారి జీవితాల్లో అనేక మార్పులను తీసుకు వస్తుంది. వేద జ్యోతిష్య శాస్త్రంలో యోగాలు గ్రహాల సంయోగం జరిగినప్పుడు ఏర్పడుతూ ఉంటాయి. జ్యోతిష్య లెక్కల ప్రకారం జనవరి 13న సూర్య, చంద్రుల కలయిక ఉంటుంది. ఇది వ్యతిపాత యోగాన్ని ఏర్పరుస్తుంది. ఈ యోగం శుభప్రదమైనది.
గ్రహాలు ఎప్పటికప్పుడు తమ రాశులను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వస్తుంది. ఇది అన్ని రాశుల వారి జీవితాల్లో అనేక మార్పులను తీసుకు వస్తుంది. వేద జ్యోతిష్య శాస్త్రంలో యోగాలు గ్రహాల సంయోగం జరిగినప్పుడు ఏర్పడుతూ ఉంటాయి. జ్యోతిష్య లెక్కల ప్రకారం జనవరి 13న సూర్య, చంద్రుల కలయిక ఉంటుంది. ఇది వ్యతిపాత యోగాన్ని ఏర్పరుస్తుంది. ఈ యోగం శుభప్రదమైనది. అన్ని రాశుల వారి జీవితాల్లో అనేక మార్పులు తీసుకొస్తుంది. కానీ కొన్ని రాశుల వారు మాత్రం ఈ సమయంలో ఎక్కువ లాభాలను పొందుతారు.

వ్యతిపాత యోగం
వ్యతిపాత యోగం అనేది జ్యోతిష్య శాస్త్రంలో శుభప్రదమైన యోగంగా భావిస్తారు. సూర్య–చంద్రుల కలయికతో ఈ యోగం ఏర్పడుతుంది. ఇది జనవరి 13, అంటే సంక్రాంతికి ముందు ఏర్పడుతుంది. 2026 మొదటి నెలలో ఈ యోగం ఏర్పడి కొన్ని రాశుల వారి జీవితాల్లో అద్భుతమైన మార్పులను తీసుకొస్తుంది. మరి ఆ అదృష్ట రాశులు ఎవరు? ఈ రాశుల్లో మీరు ఒకరేమో చూసుకోండి.
సూర్య–చంద్రుల కలయికతో ఏర్పడే వ్యతిపాత యోగం.. ఈ రాశుల వారికి రెండు రోజులు ముందే పండుగ
1.మేష రాశి
మేష రాశి వారికి జనవరి 13న ఏర్పడే వ్యతిపాత యోగం బాగా కలిసి వస్తుంది. సూర్య–చంద్రుల కలయికతో ఈ యోగం ఏర్పడి ఈ రాశి వారి జీవితాన్ని మార్చేస్తుంది. పని ప్రదేశంలో పేరు ప్రఖ్యాతులను సంపాదిస్తారు. ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. ఎప్పటినుంచో ఎదురవుతున్న అడ్డంకులు అన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయి. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వారు కూడా ఎక్కువ లాభాలను పొందుతారు. వివిధ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు.
2.కన్యా రాశి
కన్యా రాశి వారికి ఈ సమయంలో మానసిక ప్రశాంతత ఉంటుంది. కుటుంబంలో ఆనందం పెరుగుతుంది. సూర్య–చంద్రుల కలయికతో ఏర్పడే ఈ యోగం ఈ రాశి వారి జీవితాన్ని మార్చేస్తుంది. వాహనాలు, భూములు కొనుగోలు చేసే అవకాశం ఉంది. జీవిత భాగస్వామి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆనందంగా ఉంటారు.
3.సింహ రాశి
సింహ రాశి వారికి ఈ యోగం బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఆర్థికపరంగా లాభాలు కలుగుతాయి. పాత ఇన్వెస్ట్‌మెంట్ల నుంచి ఎక్కువ లాభాలు వస్తాయి. పెద్ద ప్రాజెక్టులను చేపడతారు. ఉద్యోగస్తులకు కూడా ఇది అద్భుతమైన సమయం.
4.వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి ఈ వ్యతిపాత యోగం బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు బంగారు అవకాశాలను పొందుతారు. సూర్యుడు ధైర్యాన్ని పెంపొందిస్తే, చంద్రుడు మానసిక ప్రశాంతతను కలిగిస్తాడు. కొత్త వ్యాపారాలు చేపడితే కూడా ఎక్కువ లాభాలు కలుగుతాయి. ఈ రాశి వారు విదేశీ వ్యాపారాలను కూడా చేపడతారు. ఇలా ఈ రాశి వారు అనేక విధాలుగా లాభాలను పొందుతారు.
5.కుంభ రాశి
కుంభ రాశి వారికి సూర్య–చంద్రుల కలయికతో ఏర్పడే వ్యతిపాత యోగం అదృష్టాన్ని పెంపొందిస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు ఆనందంగా ఉంటారు. కొత్త ఉద్యోగం వస్తుంది. మతపరమైన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. మానసిక ఆరోగ్యం బాగుంటుంది. మానసికంగా దృఢంగా ఉంటారు.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


