...
...
Next Story

సూర్య, చంద్రులు ఒకే రాశిలో సంయోగం, మార్గశిర అమావాస్య నాడు ఏర్పడిన అద్భుత యాదృచ్ఛికం.. ఈ పనులకు అత్యంత శుభప్రదం!

గ్రహాల సంచారంలో మార్పు వచ్చినప్పుడు అన్ని రాశుల మీద ప్రభావం చూపిస్తుంది. మార్గశిర అమావాస్య ఈ ఏడాదిలో చివరి అమావాస్య. ఈరోజు కొన్ని యాదృచ్ఛికాలు చోటు చేసుకోవడం జరిగింది. అమావాస్య నాడు పితృ దేవతలను స్మరించి, వారి పేరు చెప్పి దాన ధర్మాలు చేయడం, తర్పణాలు వదలడం, శ్రార్ధ కర్మలు వంటి వాటిని పాటిస్తూ ఉంటారు.

Published on: Dec 19, 2025, 10:01:01 IST
Advertisement

గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వచ్చినప్పుడు అది అన్ని రాశుల మీద ప్రభావం చూపిస్తుంది. మార్గశిర అమావాస్య ఈ ఏడాదిలో చివరి అమావాస్య. అయితే ఈరోజు కొన్ని యాదృచ్ఛికాలు చోటు చేసుకోవడం జరిగింది. అమావాస్య నాడు పితృ దేవతలను స్మరించి, వారి పేరు చెప్పి దాన ధర్మాలు చేయడం, తర్పణాలు వదలడం, శ్రార్ధ కర్మలు చేయడం వంటి వాటిని పాటిస్తూ ఉంటారు. ఇటువంటివి ఆచరించడం వలన పూర్వీకుల అనుగ్రహం కలిగి ఆనందంగా ఉండొచ్చు. వారి ఆశీస్సులను పొందడానికి కూడా వీలవుతుంది.

మార్గశిర అమావాస్య 2025

సూర్య, చంద్రుల సంయోగం (pinterest)
సూర్య, చంద్రుల సంయోగం (pinterest)

పంచాంగం ప్రకారం మార్గశిర అమావాస్య డిసెంబర్ 19 ఉదయం 5:00 కి మొదలై డిసెంబర్ 20 ఉదయం 7:12తో ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం డిసెంబర్ 19 శుక్రవారం, అంటే ఈరోజు అమావాస్య వచ్చింది. ఉదయం 7:09 నుంచి ఉదయం 11:00 వరకు స్నానాలు చేయడానికి శుభ సమయం. తర్పణాలు, శ్రార్ధ కర్మలు వంటి వాటిని జరపడానికి ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 2:30 వరకు మంచి సమయం.

సూర్య, చంద్రుల సంయోగం

ఈరోజు మార్గశిర అమావాస్య వేళ సూర్య, చంద్రుల సంయోగం ఏర్పడుతుంది. డిసెంబర్ 19, అంటే ఈరోజు మార్గశిర అమావాస్య నాడు సూర్యుడు, చంద్రుడు ఒకే రాశిలో ఉన్నారు. సూర్యుడు ఇప్పటికే వృశ్చిక రాశిలో ఉన్నాడు. చంద్రుడు ఈరోజు రాత్రి 10:50కి వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తాడు. దీంతో సూర్య, చంద్రుల కలయిక ఏర్పడుతుంది.

అమావాస్య నాడు సూర్యుడు, చంద్రుడు ఒకే రాశిలో ఉండడం విశేషం. ఈరోజు దానధర్మాలు చేస్తే చాలా మంచి జరుగుతుంది. ముఖ్యంగా ఈ సంయోగం జరిగిన ఈరోజు శ్రార్ధ కర్మలు, తర్పణాలు వదలడం వంటి వాటిని చేస్తే చాలా చక్కటి ఫలితాలను పొందడానికి వీలవుతుంది. పూర్వీకుల అనుగ్రహంతో ఆనందంగా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది.

శుక్ర అమావాస్య

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks