సూర్య, శనిల ద్విద్వాదశ దృష్టి యోగంతో నాలుగు రాశుల జీవితంలో వెలుగులు.. డబ్బు, పురోగతి ఇలా అనేకం!

సూర్యుడు ప్రతి నెల తన రాశిని మారుస్తూ ఉంటాడు. అలాగే నక్షత్ర సంచారంలో కూడా మార్పులు చేస్తూ ఉంటాడు. శని కూడా కాలానికి అనుగుణంగా తన రాశిని మారుస్తూ ఉంటాడు. శని, సూర్యుడు 30 డిగ్రీల కోణంలో ద్విద్వాదశ రాజయోగాన్ని ఏర్పరచబోతున్నారు. ఈ యోగం కొన్ని రాశుల వారి జీవితంలో అద్భుతాలను తీసుకురాబోతోంది.

Published on: Feb 4, 2026, 15:00:20 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. దాంతో శుభ యోగాలు, అశుభ యోగాలు ఏర్పడుతూ ఉంటాయి. గ్రహాలకు రాజైన సూర్యుడు ప్రతి నెల తన రాశిని మారుస్తూ ఉంటాడు. అలాగే నక్షత్ర సంచారంలో కూడా మార్పులు చేస్తూ ఉంటాడు. శని కూడా కాలానికి అనుగుణంగా తన రాశిని మారుస్తూ ఉంటాడు. ఫిబ్రవరి 19, గురువారం ఉదయం 11:15కి శని మరియు సూర్యుడు 30 డిగ్రీల కోణంలో ద్విద్వాదశ రాజయోగాన్ని ఏర్పరచబోతున్నారు.

సూర్య, శనిల ద్విద్వాదశ దృష్టి యోగంతో నాలుగు రాశుల జీవితంలో వెలుగులు (pinterest)
సూర్య, శనిల ద్విద్వాదశ దృష్టి యోగంతో నాలుగు రాశుల జీవితంలో వెలుగులు (pinterest)

ఈ రెండు గ్రహాల కారణంగా ఏర్పడే ఈ యోగం కొన్ని రాశుల వారి జీవితంలో అద్భుతాలను తీసుకురాబోతోంది. ఏ రాశుల వారికి ఈ రెండు గ్రహాల కారణంగా విపరీతమైన అదృష్టం కలగబోతోంది? ముఖ్యంగా ఈ నాలుగు రాశుల వారు సూర్య, శనిల ద్విద్వాదశ దృష్టి యోగంతో లాభాలను పొందబోతున్నారు. మరి ఆ అదృష్ట రాశులు ఎవరు? ఈ అదృష్ట రాశుల్లో మీరు ఉన్నారేమో చూసుకోండి.

సూర్య, శనిల ద్విద్వాదశ దృష్టి యోగం, ఈ రాశుల వారికి గోల్డెన్ డేస్ ప్రారంభం

వృషభ రాశి

వృషభ రాశి వారికి ఈ యోగం అనేక విధాలుగా లాభాలను తీసుకురాబోతుంది. ఈ సమయంలో ఈ రాశి వారు సానుకూల మార్పులను చూస్తారు. ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగా కలిసి వస్తుంది. ప్రమోషన్ పొందే అవకాశం ఉంది, ఇంక్రిమెంట్లు కూడా రావచ్చు. ఈ సమయంలో జీవిత భాగస్వామితో ఉన్న గొడవలు తీరుతాయి. అప్పులను కూడా తిరిగి చెల్లిస్తారు.

కన్యా రాశి

కన్యా రాశి వారికి ఈ యోగం అద్భుతమైన ఫలితాలను తీసుకురాబోతుంది. ఈ రెండు గ్రహాల కారణంగా ఏర్పడే యోగం ఉన్నత అవకాశాలను తీసుకురాబోతోంది. కొత్త ఉద్యోగాలు లభిస్తాయి. ఆర్థికపరంగా కూడా బాగుంటుంది. బిజినెస్ ట్రిప్పులు చేయడానికి కూడా ఇది అద్భుతమైన సమయం. అనవసరమైన ఖర్చులు తగ్గుతాయి.

తులా రాశి

తులా రాశి వారికి రెండు ప్రధాన గ్రహాల వల్ల ఏర్పడే ఈ యోగం శుభ ఫలితాలను అందించబోతోంది. ఈ సమయంలో ఈ రాశి వారు సక్సెస్‌ను అందుకుంటారు. వ్యాపారస్తులకు కూడా ఇది మంచి సమయం. వ్యాపారస్తులు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఎప్పటినుంచో రావాల్సిన డబ్బు మీ చేతికి వస్తుంది. జీవిత భాగస్వామితో కలిసి నాణ్యమైన సమయాన్ని గడుపుతారు.

ధనస్సు రాశి

ధనస్సు రాశి వారికి ఇది అద్భుతమైన సమయం. ఈ సమయంలో ఈ రాశి వారు సంతోషంగా ఉంటారు. అదృష్టం మీ వెంట ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పని ప్రదేశంలో పురోగతిని చూస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీ బాస్ సపోర్ట్‌ను కూడా పొందుతారు. వ్యాపారస్తులకు కూడా ఇది బాగుంటుంది.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More