సూర్యుడి నక్షత్ర మార్పు - జూన్ 22 నుంచి ఈ రాశుల వారికి తిరుగులేని రాజయోగం!
గ్రహాల రాజు సూర్యుడు జూన్ 22న రాహువు నక్షత్రమైన ఆర్ద్రలోకి ప్రవేశిస్తున్నాడు. జూలై 6 వరకు సాగే ఈ నక్షత్ర సంచారం వల్ల సింహం, మకర రాశుల వారికి అఖండ ఆర్థిక లాభాలు, విజయాలు కలగనున్నాయి.
నవగ్రహాలలో సూర్య భగవానుడిని గ్రహాలకు రాజుగా, ఆత్మకారకుడిగా జ్యోతిష్యశాస్త్రంలో భావిస్తారు. అందువల్ల సూర్యుని ప్రతి కదలిక, రాశి మార్పు లేదా నక్షత్ర మార్పు చాలా ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి లేదా ఒక నక్షత్రం నుంచి మరో నక్షత్రంలోకి మారినప్పుడల్లా ద్వాదశ రాశులన్నింటిపై దాని ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది.

ప్రస్తుతం సూర్య భగవానుడు మిథున రాశిలో కొలువై ఉన్నాడు. ఈ తరుణంలో ఆయన మృగశిర నక్షత్రంలో సంచరిస్తున్నాడు. అయితే…. హిందూ క్యాలెండర్ ప్రకారం జూన్ 22, 2026న సూర్యుడు తన నక్షత్రాన్ని మార్చుకోనున్నాడు. ఈ సారి సూర్యుడు రాహువుకు అత్యంత ప్రీతిపాత్రమైన ఆర్ద్ర నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాడు.
గ్రహాల రాజు సూర్యుడి ఈ నక్షత్ర మార్పు కొన్ని రాశిచక్రాల వారి జీవితాల్లో ఊహించని మలుపులు తీసుకోనుంది. రాహువు నక్షత్రమైన ఆర్ద్రలో సూర్య భగవానుడు 2026 జూలై 6 వరకు కొలువై ఉంటాడు. ఈ నేపథ్యంలో, రాహువు నక్షత్రంలో సూర్యుని సంచారం వల్ల ఏ ఏ రాశుల వారికి అదృష్టం వరించనుందో, ఎవరి భవితవ్యం ప్రకాశించనుందో ప్రముఖ జ్యోతిష్య పండితులు నరేంద్ర ఉపాధ్యాయ వివరించారు.
సింహ రాశి:
రాహువు నక్షత్రమైన ఆర్ద్రలో సూర్యుడి ప్రవేశం సింహ రాశి వారికి అత్యంత లాభదాయకమైన పరిస్థితులను తెచ్చిపెడుతుంది. సింహ రాశికి అధిపతి అయిన సూర్యుడు జాతక చక్రంలో పదకొండవ స్థానంలో (లాభ స్థానం) సంచరించడం వల్ల అకస్మాత్తుగా ఆర్థిక లాభాలు పెరుగుతాయి. దీనికి తోడు రాహువు స్థానం కూడా అనుకూలంగా ఉండటంతో మీకు అన్ని వైపుల నుంచి కలిసి వస్తుంది.
ఈ కాలంలో ఎలాంటి కొత్త పనులనైనా, వ్యాపారాలనైనా ప్రారంభించడం మీకు శుభప్రదంగా మారుతుంది. గత కొంతకాలంగా తోబుట్టువులతో ఉన్న విభేదాలు, పుల్లని సంబంధాలు తొలగిపోయి మళ్లీ సాన్నిహిత్యం పెరుగుతుంది. దీర్ఘకాలంగా వేధిస్తున్న ఆర్థిక ఇబ్బందులు, అప్పుల సమస్యలు క్రమక్రమంగా తీరిపోతాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక లేదా వినోద యాత్రలకు వెళ్లే అవకాశం ఉంది. అయితే, ఈ సమయంలో మీ ఆరోగ్యం పట్ల తగిన శ్రద్ధ వహించడం అవసరం.
మకర రాశి :
మకర రాశి స్థానికులకు ఈ సూర్య నక్షత్ర సంచారం అద్భుతమైన ప్రయోజనాలను చేకూరుస్తుంది. మీపై ఆధిపత్యం చలాయించాలని చూసే శత్రువులు పూర్తిగా బలహీనపడతారు. శత్రువులు మీ ముందు ఎట్టి పరిస్థితుల్లోనూ తల ఎత్తలేరు, వారి వ్యూహాలను మీరు సమర్థవంతంగా తిప్పికొడతారు. మీ రంగంలో మీ మాటే చెల్లుబాటవుతుంది. సమాజంలో, కార్యాలయంలో మీ ఆధిపత్యం, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పోటీ పరీక్షలు లేదా కోర్టు వ్యవహారాల్లో మీకే విజయం దక్కుతుంది. ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే చాలా మెరుగ్గా మారుతుంది.
వైవాహిక జీవితంలో సంతోషం వెల్లివిరుస్తుంది. జీవిత భాగస్వామితో ఉన్న ప్రేమ బంధంలో మధురమైన క్షణాలు చోటుచేసుకుంటాయి. వ్యాపార రంగంలో ఉన్నవారు దీర్ఘకాలంలో భారీ లాభాలను తెచ్చిపెట్టే సరికొత్త పెట్టుబడి ప్రణాళికలను రూపొందిస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా సమయాన్ని గడుపుతారు.
చేయాల్సిన పరిహారాలు :
సూర్య భగవానుడి ప్రతికూల ప్రభావాలు తొలగిపోయి, శుభ ఫలితాలు, ఆయన పూర్తి ఆశీస్సులు లభించడం కోసం ప్రతిరోజూ ఉదయాన్నే ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం మంచిది. దీంతో పాటు సూర్య చాలీసా పారాయణం చేయడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ప్రతిరోజూ ఉదయం తూర్పు ముఖంగా నిలబడి సూర్య భగవానుడికి రాగి పాత్రతో అర్ఘ్యాన్ని (నీటిని) సమర్పించాలి. అర్ఘ్యం ఇచ్చేటప్పుడు గాయత్రీ మంత్రాన్ని లేదా సూర్య బీజ మంత్రాన్ని జపించడం వల్ల సకల దోషాలు తొలగిపోయి ఐశ్వర్యం సిద్ధిస్తుంది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

